నమస్తే పతన్జలిగారు -పెద్ద నగారి పెద్ద పద్యానికి హృద్యమైన అర్ధ తాత్పర్యాలు మీ లేఖిని నుండి వెలువడి ఈ తరానికి కూడా ఆహ్లాదాన్ని కలిగి౦చిన్ది .ఈ పద్యం చూసినప్పుడు నాకు రెండు విషయాలు స్పురణకు వస్తున్నాయి మేము తొమ్మిదో తరగతి లో(1954) లో ఉండగా ”ప్రవారాఖ్యుడు ”పేరు తో పద్య భాగం ఉండేది అందులోని పద్యాలన్నీ బట్టీ పట్టేశా . అర్ధ తాత్పర్యాలతో ఉన్న మను చరిత్రను లైబ్రరీ నుండి ఇంటికి తెచ్చుకొని ,నా సహాధ్యాయులకు చదివి వినిపిస్తూ అందులోని అన్నివిశేషాలను వివరించి చెప్పేవాడిని అదొక మధురాను భూతి .
రెండవ అనుభూతి నేను 1963-లో మోపిదేవి హైస్కూల్ లో సైన్స్ మాస్టారు గా ఉద్యోగ జీవితం ప్రారంభించినపుడు అక్కడ కూచి భొట్ల సత్యనారాయణ అనే జూనియర్ తెలుగు పండిట్ తో గాఢ స్నేహమేర్పడింది ఆయన మహా అందంగా పద్యం చదవ గలడు ,అంత అందంగా భావమూ విడమర్చి చెప్పగలడు . ఖాళీ కనిపిస్తే మా ఇద్దారికీ సాహిత్య వ్యాసంగమే .ఒకసారి ఈ పద్యం విషయం వచ్చింది .నాకు ఆ పద్యం నోటికి వచ్చా అని అడిగాడు రాదు అని చెప్పాను నీకు వచ్చా అని అడిగా వచ్చు కాని మర్చి పోయానన్నాడు .ఇద్దరమ్ పందెం వేసుకొని వారం రోజుల్లో ఆ సుదీర్ఘ ఉత్పలమాలను కంఠత పట్టి తప్పులు లేకుండా ఎవరు చెప్పగలరో పందెం కాద్దాం అన్నాడు సరదాగా సరేనన్నాఆయన తెలుగు పండితుడు నేను తెలుగులో ఔత్సాహికుడిని .. ఇద్దరం వారం కుస్తీ పట్టి సాధించాం ఒకరి తర్వాత ఒకరం అప్పగించుకోన్నాం ఆయన దానిలో రెండో మూడో తప్పులు దొర్లాయి. నా దానిలో ఒక్క పోరబాటూ రాలేదు ఆయన నన్ను అభి నందించి .”ప్రసాదూ భలేవాడివయ్యా పండిట్ నే ఓడించావు అభినందనలు .”అన్నాడు నిండు మనసుతో మా స్నేహం దానితోమరింత పెరిగింది ఒకసారి ఉయ్యూరులో మా ఇంటికి ఆయనతో బాటు మా మిగిలిన మిత్రులు జమ్మలమడక రమణారావు ..అనే లెక్కల మేష్టారు ,కృత్తివెంటి నరసింహా రావు అనే సెకండరీ గ్రేడ్ మేష్టారు వచ్చి మా ఆతిధ్యం స్వీకరించి స్నేహానికి ఉదాహరణ గా నిలిచారు ఇందులో ఆ ముగ్గురూ స్వర్గస్తులయ్యారు .. మీ పద్య విహారం ఇంత ఫ్లాష్ బాక్ కు కారణమైంది ధన్యవాదాలు -దుర్గాప్రసాద్


