గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 292-కనక లత కావ్య నిర్మాత -కళ్యాణ రామ శాస్త్రి –(1862-)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

292-కనక లత కావ్య నిర్మాత -కళ్యాణ రామ  శాస్త్రి –(1862-)

శుభ లక్ష్మి ,పార్దియూర్ కృష్ణ శాస్త్రి ల కుమారుడు కళ్యాణ రామ శాస్త్రి  . .తంజావూర్ రాజాస్థానం లో తండ్రి తాత పెద్ద ఉద్యోగాలో ఉండేవారు .మద్రాస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఆఫీసర్ గా పని చేసి రిటైరై తంజావూర్ లో ఉన్నాడు .సుసంపన్నమైన పాండిత్యం సంస్కృతభాషలో ఉన్నవాడు .’’కనక లత’’అనే శృంగార కావ్యాన్ని రాశాడు .దీనికి మాతృక షేక్స్ పియర్ రచన లూక్రేసి .

ఈతని తండ్రి కృష్ణ శాస్త్రి 1842-1911కాలం వాడు .తంజావూర్ జిల్లా కాడంబాడిలో జన్మించాడు .సేన్గాలి పురం లో విద్యానాధ దీక్షితుల వద్ద విద్య నేర్చాడు .రామాయణాది పురాణాలను విశ్లేషించి ఉపన్యాసాలివ్వటం లో మహా నేర్పున్న వాడు .ఆయన రాసిన ‘’రస నిష్యందిని ‘’రామాయణం లోని కొన్ని కాండలకు బ్రహ్మాండమైన భాష్యం .’’కౌముది సోమం ‘’లో ప్రేమ పై నాటకం .ఇందులోనూ రామాయణం ను అంతర్గతం గా  ఆవిష్కరించాడు .’’మీనాక్షి శతకం ‘’,’’మాలినీ శతకం ‘’,హనుమత్ శతకం ‘’లక్ష్మీ నృసింహ శతకం ‘’చాలా పేరు పొందాయి. భక్తికి పరాకాష్టగా నిలిచాయి .’’కలి విలాస మదిరాపానం ‘’వ్యంగ్యాత్మక రచన .

293-మందారవతి రాసిన -కపిస్థలం కృష్ణ మాచార్య 91883-1933)

తిరుపతికి చెందిన కౌశిక గోత్రీకుడు రంగా చార్య కుమారుడు కృష్ణమాచార్య .1883లో జన్మించాడు –చిన్ననాటినుంచే కవిత్వం అల్లేవాడు .ఈయన చినతాత దేశికాచార్య వేదాంత ,భాషా శాస్త్రాలలో ఉద్దండ పండితుడు .సంస్కృతం లో వివిధ విషయాలపై వ్యాసాలూ చాలా రాశాడు .’’విలాప తరంగిణి ‘’’’భాణ రసార్నవ తరంగిణి ‘’కావ్య కర్తకూడా .’’మందారవతి ‘’అనేది శృంగార రచన .ఇందు సభ్య శృంగారం విరగ బూసింది .మహాకావ్య లక్షణాలను ఆధునిక భావాలతో రంగరించి రాసిన కావ్యం ఇది .1933లో మరణించాడు .

ఈయన తండ్రి రంగాచార్య గొప్ప పండితుడు .’’అలంకార సార సంగ్రహం ‘’రాశాడు .సుభాషిత శతకం ,’’శృంగార నాయికా తిలకం ‘’’’పాదుకా సహస్రారావతార కదా సంగ్రహం ‘’కూడా రాశాడు  .గోదా దేవిపై ‘’చూర్నిక ‘’రచించాడు .’’రహస్యత్రయ సారా రత్నావళి .సన్మతి కల్ప లత లు వేదాంతా ధోరణిలో రాసిన రస గుళికలు .

294-కాదంబరిలాటి జయంతిక కర్త-జగ్గూ ఆల్వార్ అయ్యంగార్( 1800)

ఈయననే కవివర జగ్గు శ్రీ వకుళ భూషణ అంటారు .మైసూర్ లోని మెల్కోటేకు చెందిన ‘’బాల ధన్వి ‘’ కుటుంబానికి చెందినవాడు .తండ్రి తిరుమార రాయ .జగ్గు గొప్పకవిగా పేరు పొందాడు .కాదంబరి లాంటి ‘’జయంతిక ‘’కావ్యాన్ని నవ రసభరితం గా ఇరవై వ ఏటనే రాసిన పరిణత బుద్ధి ఆయనది .’’శ్యమంతక ‘’,అద్భుతాంశుక ‘’నాటకాలను రచించాడు ఇందులో రెండవది వేణీ సంహారానికి ఉపోద్ఘాతమే .’’కరుణారస సత్సరంగిణి ‘’,హయగ్రీవ స్తోత్రం ‘’కూడా రాశాడు .i

ఇతని సోదరుడు సింగార అయ్యర్ ‘’శ్రీ కృష్ణ రాజ చంపు ‘’,యదుశైల చంపు ,చిత్రకదా రహస్యం అనే యమకం రాశాడు. బాబాయి వేంకటాచార్య ‘’గ్రాన్దీ వర చరిత్ర ‘’,రామానుజ మతభాష విలాసం ,’’కావేరి మహిమాదర్షం ‘’లేక శ్రీకృష్ణ రాజ సేతు బంధనం ‘’,(కన్నంబాడి డాం పై )’’యాదవ గిరి మహాత్మ్యా సంగ్రహం ‘’,వ్యాఘ్ర తాక భూ వివర వారుణం ,(హల్కేరి సొరంగం పనులపై )’’కాకన్యోక్తిమాల ‘’’’చంపకాన్యోక్తిమాల ‘’,కస్తూరికాన్యోక్తి మాల తో బాటు అనేక స్తోత్రాలు రాశాడు .వచన రచన గా ‘’దివ్య సూరి వైభవం ‘’రచించాడు .ఇతని తాత ‘’సంపత్కుమార స్తోత్రం ‘’కళ్యాణ పంచిక ‘’,వ్రుత్తి ముక్త సారావళి రాసిన ఘనుడు .కనుక వీరి వంశం లో గీర్వాణం బహు కావ్య మాలలతో శోభించింది .

295-చంద్ర మౌళి నవలా రచయిత -రాజమ్మ (1877

1877 రాజమ్మ కవయిత్రి బెంగుళూరు లో జన్మించింది .మైసూర్ ను పాలించిన టిప్పు సుల్తాన్ ఆస్థాన మంత్రి ప్రధాని గోపాలయ్య వంశానికి చెందినది .గంగాధరయ్య రామ లక్ష్మి జననీ జనకులు .మైసూర్ న్యాయవాది సాంబశివ అయ్యర్ ను పెళ్ళాడింది .మద్రాస్ విల్లింగ్టన్ కాలేజిలో సంస్కృత పండితురాలు .సాంఘిక దురన్యాయాలపై ‘’చంద్ర మౌళి ‘’నవల రాసింది .

296-‘’విద్వత్ చరిత పంచకం ‘’కర్త -కిస్టే నారాయణ శాస్త్రి (1900

సాహిత్యాచార్య కిస్టే నారాయణ శాస్త్రి కాశి లోని సరస్వతి భవన్ గ్రందాలయాదికారి .’’విద్వత్ చరిత పంచకం ‘’అనే పేరిట అనేక మంది గొప్ప గొప్ప విద్యా వేత్తల జీవిత చరిత్రలను రాశాడు .సులభ శైలీ చక్కని వివరణ తో పుస్తకం రక్తి కట్టింది .

297-కాశీలో సంస్కృత శతావధానం చేసిన -మానవల్లి గంగాధర శాస్త్రి (1834-1914)

నృసింహ శాస్త్రి కుమారుడైన గంగాధర శాస్త్రి తెలుగు బ్రాహ్మణుడు .బెంగుళూరు దగ్గర వాసర గట్ట లో1834 లో జన్మించాడు .తండ్రి కాశీలో స్థిరపడి ‘’కావ్యాత్మ సంశోధన ‘’రాశాడు .గంగాధరుడు రాజారామ శాస్త్రి, బాల శాస్త్రి వంటి గొప్ప పండితుల వద్ద విద్య నేర్చాడు. వారి జీవితాలపై చక్కని వ్యాసాలూ రాశాడు .1879లో కాశీలోనే సంస్క్రుతాచార్యుడయ్యాడు .వేలాది విద్వజ్జన సమక్షం లో సంస్కృత శతావధానం చేసి అందరి మెప్పూ పొందాడు .పృచ్చక ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పి ఆశ్చర్య పరచాడు శాస్త్రి .వ్యాకరణం పై అనేక వ్యాసాలూ ,రస గంగాధరం పైమంచి వ్యాఖ్య రాసిన మహా పండితుడు మానవల్లి .1887లో విక్టోరియా రాణి రజతోత్సవ ,ఎడ్వర్డ్ రాజు పట్టాభి షేకోత్సవ సంరంభం లో ‘’మహా మహోపాధ్యాయ’’ ‘’బిరుదునందుకొన్నాడు . 1914లో మరణించాడు .

298-విద్యా మార్తాండ -శివకుమారశాస్త్రి (1848-1919)

1848-1919కాలానికి చెందిన శివకుమార శాస్త్రి రామ సేవక మిశ్ర ,మిత్రాంగి దంపతులకు కాశి లో ఉండి లో జన్మించాడు .ద్వార వంగ ముఖ్యుడైన లక్ష్మీశ వర దేవ ఈతని ప్రాపు .యవ్వనం లో తలిదండ్రులను కోల్పోతే పిన తండ్రి నాగేశ్వర భట్టు కాశీ లో పెంచాడు .లక్ష్మీశ్వర దేవప్రతాపం ‘’అనే కావ్యం రాసి ,అందులో లక్ష్మీశ్వరుని దగ్గర నుండి మహేశ తక్కూర్ వరకు వంశ చరిత్ర వర్ణించాడు .’’యతీన్ద్రజీవన చరిత్ర ‘’కావ్యం లో భాస్కరానంద యోగి జీవిత చరిత్ర చెప్పాడు . విద్యామార్తాండ ,పండిత రాజ మొదలైన బిరుదులూ పొందిన శివకుమార శాస్త్రి1919లో మరణించాడు .

299-దుర్గేశ నందిని సంస్కృత నవల రాసిన -శ్రీ శైల తాతా చార్య లేక తిరుమల తాతాచార్య (–1862-1925)

వెంకట వరదుని పుత్రుడైన తాతాచార్య 1862లో కంచి లో జన్మించి అరవై మూడేళ్ళు జీవించి 1925లో చనిపోయాడు .ఆయన అసాధారణ ప్రజ్ఞా వంతుడు .’’యుగలాన్గుహ్య ‘’,వేదాంత దేశిక చరిత్ర ‘’అనే నాటకాలతో బాటు ‘’దుర్గేశ నందిని ‘’,క్షత్రియ రమణి ‘’అనే నవలలను సంస్కృతం లో బెంగాలీ  నవలల అనువాదంగా  రాశాడు .

300-కావ్య వ్యాకరణ తీర్ధ –హరిచరణ భట్టా చార్య (1879

హరిచరణ భట్టా చార్య 1879లో తూర్పు బెంగాల్లోని విక్రంపూర్ జిల్లా కనుర్గావ్ లో 1879లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .కలకత్తా మెట్రోపాలిటన్ కాలేజీలో సంస్కృత ఆచార్యుడు .’’కపాల కుండల ‘’సంస్కృత నవలను బంకిం చంద్రుని బెంగాలీ నవల ఆధారంగా రాశాడు .’’కర్ణ ధార ‘’, రూప సునిర్ఝర ‘’కావ్య రచన చేశాడు . జాన్ ఫిట్జరాల్డ్  ఇంగ్లీష్ లో రాసిన ‘’ఉమర్ ఖయ్యాం ‘’ను 75సంస్కృత శార్దూల  శ్లోకాలలో రచించి మంచి కీర్తి పొందాడు .మెట్రోపాలిటన్ కళాశాలను ఈశ్వర చంద్ర విద్యా సాగరుడు స్థాపించాడు .కావ్య వ్యాకరణ తీర్ధ ,విద్యా రత్న బిరుదులూ భట్టాచార్య ప్రతిభకు అలంకారాలు .

301-సౌదామిని నవలాకర్త – నరసింహా చార్య (1902)

కర్నాటక దక్షిణ ప్రాంతం కొటీశ్వరలోద్వైత  మహా బాల కుచెందిన  బ్రాహ్మణుడు మహాబాలకు   నరసింహా చార్య .కుమారుడు.1902లో జన్మించాడు .చిన్నతనం లోనే తండ్రిని కోల్పోతే పిన తండ్రులు పెంచి పెద్ద వాడిని చేశారు .మద్రాస్ విశ్వ విద్యాలయం నుంచి సాహిత్య శిరోమణి అందుకొని బెంగుళూర్లోని  శ్రీ చామరాజేంద్ర కాలేజిలో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .ఇతని ‘’సౌదామిని ‘’నవల ఎనిమిది అధ్యాయాలు .మగధ రాజు సూరసేనుడు విదర్భ రాజు కాన పాలుని  కుమార్తె సౌదామినిని రహస్యం గా వివాహమాడిన కద ఇది .దీనితో ఆమెను పెళ్ళాడాలనుకొన్నవిజయ వర్మ చేతిలో పరాజయం పొంది రాజ్యాన్ని కోల్పోయి అడవులలో కొత్త జంట తిరుగుతున్నారు ..ఆమెకు అతనిపై ఉన్న వల్లమాలిన ప్రేమ వారిద్దరి దాంపత్య గరిమ ఫలించి చివరికి విజయం సాధించి రాజ్యాన్ని సంపదను తిరిగి పొందటం తో సమాప్తం ..’’భారత కద’’,వ్యాయోగం ‘’,ప్రతిజ్ఞా భార్గవం ‘’కావ్యాలు గొప్ప పేరు పొందాయి భారవి రచన కిరాతార్జునీయం ‘’ను సంగ్రహం గా చెప్పిన తీరునవ్యంగా ఉంటుంది .

302- విశేషణాల ‘’అర్ధ సంగ్రహ’’కర్త -సార్వ భౌమ

సార్వ భౌమకవి ‘’అర్ధ సంగ్రహం ‘’అనే రచన సంక్షిప్త రామాయణమే అయినా విశేషణాలతో అలంకారాలతో వింత సొగసులు దిద్దాడు .’’మహా భారత కదానకం ‘’వచన రచన .’’విరించి నాద చరిత్ర ‘’,’’ డిండిమ వంశానికి చెందిన విరించి నాధుడు .విరించిపురం లోని దైవం గూర్చి చరిత్ర .ఈ కదా సంగ్రహాన్నే సార్వ భౌమ కవి ‘’విరించినాద చరిత్ర ‘’గా రాశాడు .’’రవి వర్మస్తుతి ‘’అనేది కేరళలోని మలబార్ రాజు రవివర్మ పై రాసిన వచన స్తుతి .’’దమయంతి పరిణయం’’కూడా రాశాడు .

‘’సంయోగిత స్వయం వరం ‘’ఆరు అధ్యాయాలుగా రచించాడు .వైద్య అనే పేరున్న పరశురాముడు రాష్ట్ర కూట రాజుజయచంద్రుని కుమార్తె సంయోగిత వివాహ కద .’’పరిహాసాచార’’అనే చిన్న హాస్య వచన రచనా చేశాడు .వరద కాంత విద్యా రత్న కవి ‘’గద్యాదర్శం’’రచించాడు .బిజాపూర్ సుల్తానులచరిత్రను ‘’విజయ పురకద ‘’గా ,’’వేల్లపురీశ గద్య ‘’లో వెల్లూరు రాజు కేశవ రాజు చరిత్రను రాశాడు .మహేశ ఠాకూర్ ‘’సర్వ దేశ వృత్తాంత సంగ్రహం ‘’లో అక్బర్ చక్రవర్తి పరిపాలన వర్ణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-15-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.