గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
357నేపాల్ లో కర్నాటక వంశ స్తాపకుడు ,సరస్వతి హృదయ భూషణ కర్త —నాన్య దేవుడు (1097-1147)
రాజనారాయణ అనే నాన్య దేవుడు తీర్హత్ అనే మిధిల రాజు .1160లో బెంగాల్ రాజు విజయ సెందు ఇతని రాజ్యం ను లోబరుచుకొన్నాడు .కనుక ఇతని కాలం 1097-1147గా భావిస్తారు .నాన్య దేవుడు నేపాల్ లో ‘’కర్నాటక వంశ ‘’స్థాపకుడు .భవ భూతి ‘’మాలతీ మాధవం ‘’పై విమర్శను ,’’భరత నాట్య శాస్త్రం ‘’పై భాష్యాన్ని రచించాడు .దీనికే ‘’భరత వార్తిక ‘’అనే పేరుంది .’’సరస్వతి హృదయ భూషణం లేక సరస్వతి హృదయ అలంకార హారం ‘’అనే పది అధ్యాయాల సంగీత సర్వస్వ గ్రంధం రాశాడు .ఇందులో పది వేల గ్రంధాలను స్పృశించాడు .పూనా భండార్కర్ ఓరియెంటల్ఇన్స్తిట్యూట్లో రాత ప్రతి లభ్యం .మహర్షులు చేసిన యజ్న యాగాలలో వేద పరిభాష ననుసరించి సంగీత వాయిద్యాలు సృజంప బడి నాయనన్నాడు .ఒక’’ వేణువు ‘’పై తప్ప అన్ని వాయిద్యాలపైనా సంపూర్ణంగా రాశాడు .కాని అతనిపాలిటి రాహువులా రాజాస్థాన విద్వాంసుడు ‘’కుంభ కర్ణుడు’’ అడ్డుపడి గ్రహణ సూర్యుడిని చేసి తినేశాడు .దేవుని రచనలో కొన్ని అధ్యాయాలు సప్త గీతులమీద ,మరికొన్ని దేశి గీతులపైనా రాశాడు .పురాతన తాళ విధానం పైనా రాశాడు ఇప్పుడిది లేదు .ఇందులో మొదటివాటి నన్నిటినీ భరతుడు రాశాడు ,తరువాతివి ప్రబంధాలకు దారి చూపాయి .మాతంగుడు వీటిపై ప్రత్యెక ద్రుష్టి పెట్టాడు .సప్త గీతులపై అభినవ గుప్తుడు,దత్తిలుడు మోజు పడి రాశారు.’’ఆత్మ మేధం లేక రాజ సూయం ‘’లో వేద క్రియలకు వీటికి ఉన్న సంబంధాన్ని వివరించారు .ఈ సప్తస్వరాలను మొట్ట మొదట దక్ష ప్రజాపతి దేవతలను ఆహ్వానించటానికి గానం చేశాడు .’’ఏక తంత్రి ‘’’’పినాకి ‘’,కిన్నరి ,వీణ’’లను పరిచయం చేసి వాటితో ఋషుల మంత్రాలకు సప్తస్వర విన్యాసం చేయించాడు .
నాన్య దేవుడు 140రాగాల గురించి ప్రస్తావింఛి వివరించాడు . .ఈవిషయాలపై అత్యంత శ్రద్ధ తీసుకొని సాదికారికం గా చెప్పాడు .కశ్యప ,మాతంగ ,సారంగ దేవులను గురు దేవులుగా భావించాడు .సారంగ దేవుడు రాగాలను 260దాకా పెంచాడు .అతనికాలానికి పూర్వమే వీటిలో చాలా రాగాలను వదిలేశారు జనం .నందుడు కూడా ఇన్నే రాగాల గురించి రాశాడు .సారంగ దేవుడు నందిని అనుసరించకుండా నాన్య దేవుని రాగాలనే అనుసరించాడు .క్లిష్ట విషయాలో అభినవ గుప్తుని మార్గ దర్శిగా చేసుకొన్నాడు .అయితే వీరిద్దరి గురించి ఎక్కడా చెప్పుకోని గడుసు పిండం .సారంగుని రచన ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అతను ఎంత గొప్పగా అభినవుని ఆంతర్యాన్ని పట్టుకో గలిగాడో తెలుస్తుంది .
358- వీణ కనిపెట్టిన సంగీత రత్నాకర ‘’కర్త – — -సారంగ దేవుడు(1100)
కాశ్మీర్ దేశం లో ఉన్నత కుల సంజాతుడు సారంగ దేవుడు .ఇతని తాత భాస్కరుడు దక్కన్ కు వలస వచ్చాడు .భిల్లమ ను పూజించి తండ్రి సోద్దాలుడు పేరు పొందాడు .స్వతంత్ర రాజుగా యాదవ కులజుడైన సింగ సేన రాజును దౌలతాబాద్ అనే దేవగిరి లో ఆ వంశ రాజ్య స్తాపన చేసి 1132-1169మధ్య పరిపాలించాడు .ఈ రాజు వద్ద సారంగ దేవుడు ఆడిటర్ జెనరల్ గా ఉద్యోగించాడు .సంగీతం లోనే కాక వైద్య ,వేదాన్తాలలోను నిష్ణాతుడు .అతని సాహిత్య ఆరోహణ మహా దొడ్డది .తాను సరస్వతీ దేవి అనుగ్రహ పాత్రుడనని చెప్పుకొన్నాడు .తనను తరచుగా ‘’నిశ్శంకుని ‘’గా చెప్పుకోనేవాడు .ఈ పేరుతోనే ‘’వీణ ‘’ను కనిపెట్టాడు.’’సంగీత రత్నాకరం ‘’అనే సంగీత శాస్త్ర గ్రంధం రాశాడు .అంతకు పూర్వం వారు సంగీతంపై వెలువరచిన విషయాలన్నిటిని తెలియ జేసి తన అభిప్రాయాలని నిస్సంకోచంగా తెలియ బర్చి మహా గ్రంధం గా రాశాడు .సంగీతం పై ఇంత విస్తృతమైన తొలి గ్రంధం ఇదే .కాని శతాబ్దాలు గడిచి పోయాక గానం లో పద్ధతులలో అనేక మార్పులోచ్చాయి .ప్రతి శతాబ్దం లోను రాగం, తాళం లలో మార్పులొచ్చాయి .తనకాలం లో ఉన్న సంగీతాన్ని సారంగ దేవుడు రాసి భద్రపరచాడు .సంగీతం లో వచ్చిన మార్పులు గ్రహించి అభివృద్ధి తెలుసుకోవటానికి సారంగుని గ్రంధం విలువైన సమాచారాన్నిచ్చే సంగీత సర్వస్వమే .
సశేషం
శ్రావణ పూర్ణమి ,రక్షాదినశుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-15

