గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 371-బంగారుపల్లకి కానుకగా పొందిన ,సంగీత సూర్యోదయ కర్త -భండారు లక్ష్మీ నారాయణ –(15000

గీర్వాణకవుల కవితా గీర్వాణం -2

371-బంగారుపల్లకి కానుకగా పొందిన ,సంగీత సూర్యోదయ కర్త -భండారు లక్ష్మీ నారాయణ –(15000

భారద్వాజ గోత్రీకుడు రుక్మిణి ,విఠలేశ్వర  దంపతుల  పుత్రుడు భండారు లక్ష్మీ నారాయణ .వాగ్గేయ కారుడిగా సుప్రసిద్ధుడు .శ్రీకృష్ణ దేవ రాయల 1509-1529) ఆస్థాన  సంగీత విద్వాంసుడు .’’అభినవ భరతా చార్య ‘’ తోడరమల్ల ,సూక్ష్మ భరచాచార్య ‘’మొదలైన బిరుదులున్నవాడు . రాయలు బంగారు పల్లకిని ,గజాలను ముత్యాలను కానుకగా సమర్పించాడు .విష్ణు భట్టాచార్య శిష్యుడు .’’సంగీతసూర్యోదయ ‘’కర్త .ఇందులో అయిదు అధ్యాయాలు వృత్త తాళ,స్వరగీతి జతి,ప్రబంధాల గురించి వివరించాడు .ఉపోద్ఘాతం లో విద్యాపుర చక్రవర్తిగురించి విపులంగా తెలిపాడు .

గోవిందుని ‘రాగ తాళ పారిజాత ప్రకాశిక ‘’లో సంగీత ధ్వనులు, కాలం గూర్చి రాశాడు .సారంగ దేవుని గురించి  రాశాడు కనుక కాలం పదమూడవ శతాబ్ది తరువాత వాడని అనుకోవచ్చు .

విజయ నగర రాజు తిరుమల రాయని కాలం వాడైన లక్ష్మీధరుడు .గుంటూరు జిల్లా చెరుకూరు వాడు .గీతగోవి౦ద౦ పై వ్యాఖ్య రాస్తూ రాగ దీపిక ,రంగ లక్ష్మీ విలాసం వామదేవీయం ,ప్రతాప రాజు సంగీత చూడామణి గురించి పేర్కొన్నాడు  తాను ‘’భరత శాస్త్ర గ్రంధం ‘’రాశాడు .

372సంగీత దర్పణం కర్త–చతుర దామోదరుడు

లక్ష్మీధరుని కుమారుడు చతుర దామోదరుడు .’’సంగీత దర్పణం ‘’సంగీత నృత్యాలపై రాశాడు .సంగీత స్వరాలను చిత్రాలుగా వివరించాడు .దీనికి ఆధారం సోమదేవుని ‘’రాగ విబోధం ‘’.జహంగీర్ చక్రవర్తి ఆస్థానం లోని చతుర కల్లినాధుని వంశం వాడు .

హరిభట్టు సంగీత దర్పణం ,సంగీత సారోద్ధారం ,సంగీత కళానిధి.గ్రంధ రచయిత .

373-షాహాజీ ఆస్థాన విద్వాంసుడు ,సంగీత మకరందం ‘’కర్త –వేద

చతుర దామోదరుని కొడుకు అనంతుడు .ఈతని కొడుకే వేద.శివాజీ తండ్రి షాహాజీ ఆస్థాన విద్వాంసుడు .షాహాజీ కోరికపై ‘’సంగీత మకరందం ‘’,’’సంగీతపుష్పాంజలి ‘’రచించాడు .మొదటి దానిలో రస ద్రుష్టి ,గతి ,చారి ,హస్త ,నృత్య ,రసాలపై రాశాడు .

374-జగజ్జోతిర్మల్లుడు(1617-16330

త్రిభువన మల్లుని కొడుకే జగజ్జోతిర్మల్లుడు .నేపాల్ వాడు .నేపాల్ లో సరైన సంగీత శాస్త్ర గ్రంధం లేదని అభిలాషుని ‘’సంగీత చంద్ర’’కు నేపాల్ కు తెచ్చి ‘’సంగీతభాస్కరం ‘’అనే వ్యాఖ్య రాశాడు దీనికే మిధిలకు చెందిన వంగమణి.కూడా వ్యాఖ్యానం రాశాడు .799లో ’’సంగీత సారసంగ్రహం ‘’సంతరించాడు స్వయంగా .1617-1633కాలం లో పరిపాలించాడు .పద్మశ్రీ ‘’రాగ రస సర్వస్వం ‘’కు వ్యాఖ్యానమూ చేశాడు .నేపాలీ భాషలో ‘’హర గౌరీ వివాహం ‘’సంగీత నాటకం రచించాడు .ఇవికాక ‘’స్వరోదయ దీపిక ‘’,గీత పంచాశిక ,సంగీత భాస్కరం రాశాడు ముప్ఫై మూడు విషయాలపై చక్కని సంస్కృత శ్లోకాలను సేకరించి ప్రచురించాడు .

ఇతనికొడుకు ప్రతాపమల్లుడు ,ఇతనికొడుకు జగత్ ప్రకాశ మల్లుడు కూడా కవులే .ప్రకాష్ ‘’పద్య సముచ్చయం ‘’పై కవుల చరిత్ర రాశాడు .కూతురికొడుకు అనంతుని కోరికపై ‘’హస్త ముక్తావళి ‘’అనే నృత్య గ్రంధం పై వ్యాఖ్యానం రాశాడు .

375-కవిరత్న రాగమాలిక కర్త -–పురుషోత్తముడు(1790)

కవి రత్న పురుషోత్తముడు గంజాం జిల్లా పర్లాకిమిడి లో సుమారు 1790లో ఉన్నాడు . రామ చంద్రోదయం రామాభ్యుదయం ,బాలరామాయణ ప్రబంధాలతో బాటు ‘’కళా౦కూరనిబంధం లేక రాగ మాలిక ను రచించాడు.ఇతనికొడుకు నారాయణ మిశ్ర కవిరత్న ‘’సంగీత సారాని ‘’,తో బాటు ‘’బలభద్ర విజయం,శంకర విహారం ,ఉషాభిలాష ,కృష్ణ విలాసం గుండీచ విజయం నవ నాగ లలిత అనే ప్రబంధాలు రాశాడు .

ప్రబంధాలను నారాయణ మిశ్ర శుద్ధ ,సూత్రా అనే రకాలుగా విభజించాడు మొదటి దానిలో అంక పాటలున్నాయి .వీటిని వివిధ రాగాలలో కూర్చాడు

376- సంగీత నారాయణ కర్త-,గజపతి వీరశ్రీ నారాయణ దేవరాజు (1700)

పర్లాకిమిడి రాజు పద్మనాభుని కుమారుడే నారాయణ దేవ   వీరిది ఉత్తుంగ జాతి .,1700కాలం రాజు .కవి రత్న పురుషోత్తముని వద్ద సంగీత విద్య నేర్చి ‘’సంగీత నారాయణం ‘’రచించాడు .దీనిలో సంగీతం నృత్యం సంగీత వాద్యాలు ,సంగీత కూర్పు లపై వివరణ ఉంది .ఉదాహరణలు రాజుపై ప్రశంసలే .ఆయన చెప్పిన సంగీత గ్రంధాలైన సంగీత శిరోమణి ,సంగీత సారం ,సంగీత రత్నమాల చిత్ర ప్రకాశ సంగీత చంద్రిక ,అరుదైనవి ..   సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -30-8-15 –ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.