గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 30-ఏలేశ్వరపు గోపాల

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

30-ఏలేశ్వరపు గోపాల

ఏలేశ్వరపు వెంకటలక్ష్మి ,సుబ్బరాయలపుత్రుడే గోపాల .కౌశికస గోత్రం .’’యుదిష్టిరాశ్వమేద చంపు ‘’కర్త..ధర్మరాజు చేసిన అశ్వమేధ కద.మూలం జైమిని భారతం .హలయాస క్షేత్ర మీనాక్షీ సుందరేశ్వరుల భక్తుడు .మీనాక్షీ దేవిని స్తుతిస్తూ చెప్పిన శ్లోకం –

‘’శ్రీ హాలస్య వసున్ధరానివాసతే రీశస్య మోదప్రదా-మీనాక్షీ కరుణా కటాక్ష సరణిర్మా౦ పాతు సా  సతతం ‘’

కవిని ఇతర కవులు పొగిడి ఈ కావ్యాన్ని రాయమని కోరిన   శ్లోకం –

‘’మీనాక్షీ వరలబ్ద దివ్య కవితా ధారా సుధా రాశింస౦ -భూతా గణ్య మహా ప్రచండ రచనా పాండిత్య సర్వంకషం

శ్రేస్టే జైమిని భారతే సురుచిరం పర్వాశ్వ మేధం మహా –కావ్యం త్వం కురు గద్య పద్య మయమిత్సేతే ప్రహృష్టా ధియః ‘’

ఈ శ్లోకాలలో కవి బహు గ్రంధ కర్త అని ధారా శుద్ధి కలకవి అని తెలుస్తుంది .కాని యుదిష్టిర చంపు తప్ప ఏదీ లభ్యం కాలేదు కవి చేసిన హస్తినాపుర వర్ణన –

‘’ఆస్తి శ్రీ భారతాన్వవాయ జనుషాంరాజ్ఞాం జ్వలత్సేజసం –సంపజ్జాలా వినిర్జితా మరపురీ శ్రీ హస్తి నాఖ్య పురీ .

చివరలో ఉన్న శ్లోకం –

‘’మైలో రత్నమయం కిరీటమమలం పార్శ్వేనుజాతన్యదా –చిత్తే భూత దయాం కరే వితరణం బాహో ప్రతాపశ్రియం

జిహ్వాగ్రే హరి కీర్తనం విరచయన్ ధర్మాత్మ జాతో ముహుః-సా మోదేనసహాత్యుతేనశకలం గోపాయతి స్మశ్రితిం ‘’

తన వంశ చరిత్రను చివర్లో చెప్పుకోన్నాడుకవి .

‘’శ్రీమత్స్కౌశిక  గోత్ర పావన మహా ఏలేశ్వరా ఖ్యాన్వయ-మ్భో జా హస్కరతేజస్య కవి సుత శ్రీ సుబ్బయాదీ౦దునా

శ్రీ మద్వేంకట శబ్దపూర్వ విలసల్లక్ష్మాంబికా గర్భాస –ద్రత్నే నేదమ కారీ చంపు కవినా గోపాల నామ్నా ముదా ‘’

గోపాలకవి పుట్టిన చోటు ,కాలం తెలియదు  .ఏలేశ్వర పు వారు ప్రసిద్ధ బ్రాహ్మణులు ఏలేశ్వరం పవిత్ర క్షేత్రం కూడా  .అందులో ఏలేశ్వరోపాధ్యాయులు గొప్ప సంప్రదాయ విద్యా వేత్త .సూక్తి వారధి రాసిన పెద్దిభట్ట కూడా ఇక్కడివాడే.నల్గ్గొండ జిల్లా కృష్ణానదీ తీర నివాసులు ఏలేశ్వరపు వారు .

31శ్రీ రంగ నాధ ప్రబంధ కర్త –ఆంద్ర రత్న దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య (1889-1928)

దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య2-6- 1889లో కోదండ రామ స్వామి సీతమ్మ దంపతులకు జన్మించాడు .పుట్టిన మూడవరోజు  తల్లిని ,మూడవ ఏట తండ్రిని కోల్పోయిన దురదృష్ట వంతుడు .పినతండ్రి  నాయనమ్మల దగ్గర కూచి పూడి గుంటూరు లలో చదివాడు..హైస్కూల్ చదువులోనే ‘’జాతీయ నాట్య మండలి ‘’స్థాపించి సగీత నాటక కార్యక్రమాలు చేసేవాడు .చదువు పై శ్రద్ధ తగ్గి మెట్రిక్ తప్పి బాపట్ల లో చేరి పాసైనాడు . రాజకీయ దురంధరుడు రామ భక్తుడు,సాహసి నిక్కచ్చిమనిషి . .హరితస గోత్రం .1906 వరకు గుంటూరులో చదివాడు .కాలేజి విద్యార్ధిగా ఉండగానే బాలగంగాధర తిలక్ అరవిందుల ప్రభావానికి లోనయ్యాడు  నడింపల్లి నరసింహా రావు అనే స్నేహితుని సాయం తో .ఇంగ్లాండ్ వెళ్లి ఎడిన్ బర్గ్ లో 1911-16వరకు అయిదేళ్ళు చదివి ఏం ఏ డిగ్రీ పొందాడు .అక్కడ ఉండగానే ప్రముఖ శిల్పి వేదాంతి చిత్రకారుడు ఆనంద కుమార స్వామితో పరిచయమైంది .ఆయన శిష్యరికం లో తనను తానూ తీర్చి దిద్దుకొన్నాడు గోపాల క్రిష్నయ్య .నందికేశ్వరుడు రాసిన ‘’అభినయ దర్పణం’’ను ఆనందకుమార స్వామితో కలిసి ‘’ది మిర్రర్ ఆఫ్ గెస్చర్’’పేరుతొ ఇంగ్లీష్ లోకి అనువదించాడు .ఇది కేంబ్రిడ్జి –హార్వర్డ్ యూని వర్సిటీ ప్రచురితం .ఇండియా తిరిగి వచ్చి రాజమండ్రి ట్రెయింగ్ కాలేజి లో 1917నుండి ఒక ఏడాది లెక్చరర్ గా పని చేశాడు .తర్వాత 1918-19కాలం లో బందరు జాతీయ కళాశాలలో విద్య నేర్పాడు .ఎక్కువ కాలం ఇక్కడ ఉండకుండా చీరాల పేరాల దగ్గర ‘’ఆంద్ర విద్యా పీఠ గోష్టి’’అనే విద్యా సంస్థను స్థాపించాడు .గాంధీ మహాత్ముని పిలుపు నందుకొని స్వాతంత్ర్య ఉద్యమం లో చేరాడు .ప్రజలకు  నచ్చ చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమం లో భాగస్వాములను చేశాడు .భారత జాతీయోద్యమ నాయకులలో ముఖ్యుడైనాడు .ఉద్యమాలలో అరెస్ట్ అయి ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాడు .’’శ్రీ రామ దండు ‘’అనే ‘’ఆధ్యాత్మిక జాతీయ స్వచ్చంద దళాన్ని’’  తయారు చేశాడు.ఆనాటి కాంగ్రెస్  సభలకు వీరే రక్షక భటులు  .జైలు నుండి విడుదలకాగానే సాంఘిక సంస్కరణ లకు శ్రీకారం చుట్టాడు .గోపాల క్రిష్నయ్య మహా వక్త .ఆంగ్లాన్ద్రాలలో అనర్గళంగా మాట్లాడే నేర్పున్నవాడు. నాగస్వరానికి పాములు పరవశమైనట్లు గోపాల క్రిష్నయ్య గారి ఉపన్యాసానికి జనం ముగ్దులయ్యేవారు .వేలాది జనం పాల్గొన్న సభలలో ఆయన కంచు కంఠం తో జనాలను ఉత్తేజ పరచేవాడు కర్తవ్య బోధ చేసేవాడు .జానపద కళా రూపాలఉద్ధరణకు గ్రంధాలయోద్యమానికి విశేష కృషి చేశాడు .ఆయన ప్రోత్సహించిన జానపద కళారీతులు –తోలుబొమ్మలాటలు ,జముకుల కద ,బుర్ర కద ,వీధినాటకాలు సాము గరిడీలు ,గొల్లకలాపం బుట్టబొమ్మలు ,కీలుగుర్రాలు ,నాటకాలు ,గోసంగి గురవయ్యలు ,సరదాకద ,కిన్నెర కద కొమ్ము బూర జోడు మద్దెల ,పల్లె సుద్దులు తూర్పు భాగోతం ,చుట్టుకాముడు ,పిచ్చుక కుంటల కద ,సాధనా శూరులు ,పల్నాటి వీరులు మొదలైనవెన్నో .

ఆంగ్ల ప్రభుత్వం చీరలా పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినపుడు వ్యతిరేకించి పెద్ద ఉద్యమం నడిపాడు .ప్రజలను ఖాళీ చేయించి ప్రభుత్వా దృష్టికి తెచ్చాడు.. ఆయన చేసిన చీరాల పేరాల పోరాటం చిరస్మరణీయం .

గోపాల క్రిష్నయ్య సర్వోత్క్రుస్టకవి, దేశభక్తుడు ,సంస్కర్త విమర్శకుడు . .గీర్వాణ ఆంధ్రాలలో గోపాలకృష్ణయ్య రాసిన కవిత్వం ఆయన పాండిత్యానికి మచ్చుతునకలు .’’సమకాలీనులలో మహా జీనియస్ ‘’అన్నాడు ఆయన్ను కట్టమంచి రామ చంద్రా రెడ్డి .1921లో గుంటూరు సభలో గోపాల క్రిష్ణయ్యకు ‘’ఆంద్ర రత్న ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .దురదృష్ట వశాత్తు  40ఏళ్ళ వయసులోనే 10-6-1928 నమరణించాడు

శ్రీరంగం లోని రంగ నాద స్వామి పై ‘’శ్రీ రంగ నాద ప్రబంధం ‘’సంస్కృతం లో రచించాడు గోపాల క్రిష్నయ్య .మహా కవుల శైలికి ఏ మాత్రం తగ్గకుండా అర్ధ గాంభీర్యం తో కవితా పాటవం తో వెలసిన కావ్యం ఇది .అందులోని కొన్ని శ్లోకాలు –

‘’కదా వా కావేరీ విమల సలిల ప్రాంగణా౦ ట-చ్చ్రుమ్భాద్గ తమిళ హృదయ ధ్వాంత దలనం

తనో త్యా తిధ్యం మే నిజ సదసి బందా చ్యుతి యుతో –ముహూర్ర్తేత్యా క్రోశన్నిమిష న్నివనేష్యామి దివసన్ .

‘’శ్రీ రంగేశ కృపాలో తమిళ జన సభాధ్యక్ష దీక్షాంత రంగం –స్వరాజ్యానంద నిద్రా పరవశా ద్రుతముత్తిస్ట భో రంగ నాయక

త్రేతాయాం రామ చంద్ర కృతి ద్రుత భవతా ప్రీణితై వాంధ్ర భూమి –స్త్వాన్ద్రోహం కర్త మానాం తవ భవన కధాం వక్త్రు మత్రాగతోసమి ‘’

ఇదికాక సంస్కృతం లో చాటువులు చాలా రాశాడు .గీర్వణ౦  లో ఆంగ్ల పదాలను చేర్చి జైలు నుంచి తిరిగి రాగానే మద్రాస్ లో బహిరంగ సభలలో మాట్లాడాడు –మచ్చుకి ఒకటి

‘’న యాచే’’ రిఫారం’’ నవా’’ స్టీలు ఫ్రేముం’’ న ‘’కౌన్సిల్ ‘’న తు ‘’ప్రీవీ కౌన్సిల్’’పదం వా-స్వరాజ్యార్తి హంతాంగ్లరాజ్యే నియంతా ,’’ఫరంగీ ‘’ఫిరంగీ ‘’ద్రుడన్గ౦గే  కరోతు ‘’   ఇది జగన్నాధ పండిత రాయల ‘’నయాచే రాజాలిం న వా వాజి  రాజిం ‘’ కవిత్వానికి అనుకరణ .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.