సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
— సరసభారతి ఆధ్వర్యం లో నేను రాసిన ”కెమో టాలజి పిత కొలచల సీతారామయ్య (పుల్లేరు నుండి ఓల్గా దాక )పుస్తకాన్ని శాసన మండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ సౌజన్య సహకారాలతో ముద్రించి,జనవరి చివరి వారం లో ఆవిష్కరిస్తున్నామని తెలియ జేస్స్తున్నాను .
”పుల్లేరు కలువ ప్రక్కన ఉన్న ఉయ్యూరు నుండి1918లో కాలినడకన మద్రాస్ వెళ్లి ,అక్కడ కస్టపడి డిగ్రీ చదివి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ,ఓడలో బొగ్గు గదిలో కూర్చుని కెప్టెన్ చెప్పిన చాకిరీ చేస్తూ దానివలన ఏమీరాబడి లేకుండానే అతని దయా దాక్షిణ్యాలతో అమెరికా చేరి ,అందుబాటులో ఉన్న ప్రతి చిన్న పనినీ హీనంగా భావించ కుండా చేస్తూ శ్రద్ధగా చదివి కెమిస్ట్రిలో మాస్టర్ డిగ్రీపొంది ,అ రోజుల్లో కొత్తగా ఆవిర్భవించి అభి వృద్ధి చెందుతున్న రష్యా దేశ ప్రగతికి తోడ్పడాలనే సదుద్దేశం తో రష్యా చేరి,ఓల్గా తీరం లోని మాస్కో లో ఉంటూ ,ఆయిల్ సైన్స్ లో ప్రయోగాలు, పరిశోధనలు చేసి తేలిక రకం యుద్ధ టాంక్ ల రూప శిల్పిగా పేరు పొంది ,’ ఫాదర్ ఆఫ్ కెమో టాలజి ,””ఫాదర్ ఆఫ్ ట్రై బో కేమిస్ట్రి ”బిరుదులు పొంది సోవియెట్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని 42ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చి 42రోజులు మాత్రమే ఉండి,రష్యాలో ఉన్నా మన సంప్రదాయం సంస్కృతీ భాషలను మర్చి పోకుండా సార్ధక జీవితాన్ని గడిపిన ఉయ్యూరుకు చెందినసాహసి ,స్వయం కృషితో లక్ష్యాన్ని సాధించిన ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త శ్రీ కొలచల సీతారామయ్య గారి జీవిత ప్రస్థానమే ”పుల్లేరు నుండి ఓల్గా దాకా ”
పూర్తీ వివరాలతోకరపత్రం ఒక వారం తర్వాత అండ జేస్తాం –దుర్గా ప్రసాద్

