నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
61- పద్మనాభుడు (19వ శతాబ్దం )
భరద్వాజ గోత్రీకుడు కామశాస్త్రి కుమారుడు పద్మనాభుడు .గోదావరిజిల్లా కోటిపల్లి లో జన్మించాడు. అక్కడి దైవం సోమేశ్వరుడు అంటే అవ్యాజభక్తి ఉన్నవాడు .సంస్కృతం లో ‘’త్రిపుర విజయ వ్యాయోగం ‘’రాశాడు కోటిపల్లి తిరుణాల లలో దీన్ని ప్రదర్శించేవారు ..శివుడు త్రిపురాసురులను వధించిన కధ.-ప్రారంభ శ్లోకం –
‘దేవఃస్వార్ధ శివానవాను నయ స౦పూ త్కొత్తమంగ నయనాత్ –గంగా భు వ్యపవాహ్నగౌతమ తపస్సి ద్దిచ్చలా దుత్సుతః
ఇయం బుద్వదిఏవ కోటి పల్లి సంస్తానే నిరూద్వస్తయా -పార్శ్వ దక్షిణామాప్తయోభయ తరస్సోమేశ్వరః పాతు నః’’
సూత్రధార, నటి లమధ్య సంభాషణలో కవి చరిత్ర తెలుస్తుంది .భారద్వాజ గోత్రీకుడైన ఎల్లావధాని కి పద్మనాభ కుమారుడు ఈయనకు కామ శాస్త్రి కొడుకు ఈయనకోడుకే పద్మనాభ కవి .గంగాధర గురువు అనుగ్రహం తో కవికి సకలశాస్త్రాలు వచ్చాయి .గంగాధరుడు అంటే శివుడుకావచ్చు అదే పేరున్న గురువూ కావచ్చు .త్రిపుర సంహారం కోసం పరామేశ్వరుడు రధం పై బయల్దేరిన యుద్దోత్తతి వర్ణ న ఇలా సాగింది –
‘’ఛందో హాటక ఘోటక ప్రఘటితం చందః శిరః ప్రగ్రహం –వాణీ వల్లభ సారధి ప్రచరితం సర్వం సహా స్యందనం
చండా చండ మయూఖ మండల మహా చక్ర ద్వాయోపస్థితం—వై గానాయత మదద్భుతెన భగవానారుహ్య నిర్గచ్చతి ‘’
62-మరో పద్మనాభుడు ‘(18శతాబ్దం )
కాలం వగైరాలేవీ తలియని ఈ పద్మనాభుడు వేంకటాంబ ,లక్ష్మణ దంపతులకొడుకు .’’లీలా దర్పణ భాణం’’రాశాడు .ఇది శృంగారం రంగరించిన నాటకం .నాయకుడు లీలా శేఖరుడు ,నాయిక లీలావతి .ఈమె తొలినాట్యాన్ని తిలకించిన హీరో ప్రేమలో పడిపోయాడు .దీనికి ‘’మదన లీలా దర్పణ భాణం’’అనే పేరూ ఉంది .అసంపూర్తి రచన .కాశీకి వెళ్లి కవి దీన్ని రాసి ఉండాలి లేక ఊహించి రాసైన ఉండవచ్చు .ప్రారంభం అలాఅలా సాగిపోతుంది –
‘’లీలాలాలస మానసాభి రభి రభితో గోపీభి రంతః పురే –వ్యాలిప్తో మృదు చందనేన దిశతు శ్రేయస్సమే శ్రీ పతిః
నాంది తర్వాత శ్లోకం –‘’చలత్తిమిర చుమ్బితాంబురుహ విరీ బిమ్బోల్లాస –చ్చకారే మద కాలికొచ్చలితచక్రనృత్త క్రమైః’’
ప్రస్తావనలో పది శ్లోకాలు వంశ వర్ణ న ఉంది .వంశ క్రమం –గణపతి –పద్మనాభ –లక్ష్మణ భార్య ,వెంకమాంబ –సుబ్రహ్మణ్య-,పద్మనాభకవి .సూత్ర దారుడు కవిని వంశాన్ని పరిచయం చేస్తాడు –
‘’శ్రీమాన్ శ్రీమదుమార్ద దేహ కరుణా పూర్ణాజ్వలప్రేక్షణ –ప్రాప్త శ్రీ కవితామృతాబ్దిలహరీ సంతోషిత శ్రేకవిః
శేషా శేష వచో విశేష విలస త్సౌర సౌభాగ్య భ్-ద్వాక్య్ప శ్రీ రధ పద్మనాభ సుకృతీ శ్రీ పద్మ నాభోపమః ‘’
ఘన చిద్బోదాయతి మనకవి గురువు అని తెలుస్తోంది .ఈయనే కొల్లూరి రాజశేఖరుని గురువు బోధానంద ఘనే౦ద్ర గురు అయి ఉండవచ్చు .కనుక కవి 18శతాబ్ది వాడు .
63-అవసరాల పద్మ రాజు
గోల్కొండ నియోగి అవసార పద్మ రాజు ,పిఠాపురం రాజు నీలాద్రి రావు మంత్రి .అయిడుకా౦డలలో భాగవత చంపు రాశాడు కవికి అంభోజ ,వర్నాధిక కాంభోజ అనే పేర్లూ ఉన్నాయి –ప్రారంభ శ్లోకం –
‘’శ్రియః కటాక్షః స తనోతు నః శివం విదిత్సునా యస్యద్వశం నవోత్పలం –వితన్యతే స్మిన్ విధినా దివా నిశం నిమేలినోన్మీ లన సంత తౌఘం ‘’
పద్మ రాజు శైలికి గద్య ఉదాహరణ –యాఃసలీలమ పుర స్కృత జీమూతా సౌదామిన్య ఇవ కామిన్యః కమనీయ తర కబరీ భరాఃపరి వవ్రు రనంతః పురగత మనవరతమఖిల భువనాదార నిజోదరం శ్రీ రోరాది ప్రణయినం ధనమేనం –‘’ఇలా సాగుతుంది
ఆ కాలపు అలవాటు ప్రకారం శృంగారాన్ని బాగా దట్టించాడు .బాలకృష్ణుని వర్ణన –‘’త్వం దృష్టా హి పరున్మాయా రరస మొరస్కా ధృవం కందుక –ద్వంద్వం మే గలితం చిరాయ నిహితం గూడం త్వయా కంచుకే ‘’
గోపికా వస్త్రాపహరణం చేస్తున్న కన్నయ్య –
‘’నాభి దఘ్న మభావన్నత యామునం సలిలామంతరీయ తాం –ఉత్తరీయ మనురూప ముల్లస త్కేశం సంహితర భూద్విసరితా ‘’
అసలైన రాసక్రీడా వర్ణన –
‘’అవిరలోభయ పార్శ్వ లసత్తరూప యుభయ పార్శ్వ గత స్వతం నూక్రుతే-మధు జిదంతర రాజత మండలే ,స్వయ మసౌ పరిదావివ చంద్రమాః ‘
చివరి శ్లోకం –చిరమాదిగతామ్రుద్ధిం లుమ్పంపలాశ తతోర్భుశం –సపది రచయన్నామోదా౦చన్ద్రీ రయ౦ సుమనా శ్చయ౦
దీనిపైదేవులపల్లి రామ సూరి రాసిన సుది చంద్రిక ,రాఘవాచార్య రచించిన కవి రంజని వ్యాఖ్యానాలున్నాయి .కాని అచ్చు కాలేదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-16-ఉయ్యూరు

