గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 73-రావు భాస్కర రాయ (1840-)

నాలుగవ గీర్వాణం

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

73-రావు భాస్కర రాయ (1840-)

పశ్చిమ గోదావరి జిల్లా పాండుర గ్రామానికి చెందినవాడు పిఠా పురం వెలమ దొరల బంధువు ,రావు వెంకమ్మ ,రామరాయల సుపుత్రుడే భాస్కర రాయ .1840లో జన్మించి 20వ శతాబ్ద ప్రారంభం లో మరణించాడు .తత్వ వ్యాకరణ ,పురాణ ,స్మ్రుతి నీటి శాస్త్రాలలో అపార పాండిత్యం ఉన్న వాడు .విశిస్టాద్వైతి అయినప్పటికీ అద్వైతాన్ని అవపోసన పట్టాడు .40వ ఏట ‘’అద్వైత సారం ‘’సంస్కృతం లో రాశాడు .ఆంద్ర గీర్వాణాలలో చాలా రాశాడని చెబుతున్నా సంస్కృతం లో లభించినవి రెండే రెండు .అవి రామ ధాటి శ్లోకం ,కుమార శతకం

రామదాటి 21శ్లోకాల రచన .ఇందులో రావు వంశం గొప్పతనాన్ని వర్ణించాడు .దీనిని పిఠాపురం రాజు రాజా వెంకట కుమార మహీపతి సూర్యా రావు బహద్దర్ కు అంకితమిచ్చాడు –ఇందులో మొదటి శ్లోకం –

‘’కళ్యాణదం భవతు వస్తు కిమష్య జసం స్త్రీ పు౦సా రూప మతిలోక మనంత్య మాఘం

రాజ్య శ్రియః కృతి పతే సస వాసు రూప మేవం సంబోధయన్నవనవాభ్యుదయాయ రాజః ‘’

వెలమ వంశా రంభాన్ని వివరిస్తూ శ్లోకం చెప్పాడు .సూర్యారావు బహద్దూర్ దాన వితరణ పై –

‘’వనీపకానామ వనీపకానాం విపర్యయస్స్యా ద్విహి తోషి వృత్తౌ –అస్మిన్ భువం బిభ్రతి సూర్య రాయే ,దానేన శౌర్యేనజగత్ప్రసిద్దే’’

చివరి శ్లోకం లో రామదాటి ని 21శ్లోకాలలో రాశానని ,ఇది పరశురాముడుక్షత్రియులపై చేసిన  21దండ యాత్రలను సూచిస్తుందని తెలిపాడు .

‘’శ్లోకా స్శ్రీసూర్య రాయస్యాభ్యుదయ ప్రతిపాదకాః-ద్విషన్మనోభిదో రామ ,దాటీ వచ్చైకా విమ్శతిః’’

కుమార శతకం వంద శ్లోకాలతో ఉంది .ప్రతిశ్లోకం లో కుమా శబ్దం వచ్చేట్లు రాసి కుమార రాజా కు అంకితమిచ్చాడు

‘’మాతా మంగామ్బికా యస్య పితా రామ మహేశ్వరః –కుమారాత్కుమారోయం ద్రాజ్య యత్వరి మండలం ‘’

చాలా లోతైన భావం తో ఉత్కృష్ట రచన చేసిన పద్యాలు ఎక్కువగా ఉన్నాయి .కొన్ని –

సాన్త్వం మాన్యే,దనం దీనే ,శటేభేద మరౌ దమం –కుమార!పాతయ దియా విమృశ్య గురు లాఘవం ‘’

న నీచ మాధికం కుర్యాన్నాధికం నీచ మప్యతః –యదార్హం స్తాపయేద్రాజా ,కుమార !స్వార్ధ తత్పరః ‘’.

దీన్ని 1890లో రాసి 1897లో కుమారా మహీపతికి అంకితమిచ్చాడు .

74-చాగంటి మల్లినారాధ్యుడు

మల్లారి ఆరాధ్య పేరున్న ఈ కవి చాగంటి శరభానారాధ్య కుమారుడు ‘’శివలింగ సూర్యోదయం ‘’రాశాడు .ప్రబోధ చంద్రోదయం సంకల్ప సూర్యోదయం లాగా నే నడిపించాడు .వీరశైవాన్ని సుప్రతిస్టితంచేశాడు .బసవేశ్వరుని గూర్చి వర్ణన ఉంది .కవి చెప్పిన బసవేశ్వరుడు వీరశైవ ప్రాపకుడు బసవన మంత్రి ఒక్కరుగానే కనిపిస్తారు .పెనుగొండ ఎపిగ్రాఫ్ లో కందుకూరి బసవ రాజు గోదావరి జిల్లా ఏలూరు కు దేశ పా౦ డ్యుడుఅని తెలుస్తోంది .1429ప్రాంతం వాడు .దేవిది ,ఉర్లాం జమీందార్ .ఇదే సద్గురు శివానంద మూర్తిగారి వంశం .మొదటి శ్లోకం –

‘’శ్రీమత్పర్వత పట్టసాగ్రవిలాస త్సౌవర్ణ సౌదాస్థలీ –నానా రత్న విచిత్ర కాంతి రచిత ప్రోత్తన్గురా వేదాన్తరే

బ్రహ్మో పెంద్ర హరాఖ్యాయ పర్వతాతియుక్సిమ్హాసనే సుస్తితం –వీరేశం విప దంద కార మిహిరం పశ్యేయ మంతర్దాశా ‘’

చివరి శ్లోకం లో తన పేరు వగైరా చెప్పుకొన్నాడు –

‘’చాగంట్వన్వయా సింధు శీత కరుణా శ్రీ శరభారాధ్య స –త్పుత్రాయామల సద్గుణా య కలయే మల్లెశ్వరాఖ్యాయ చ

ద్రస్టూనాంశివ లింగ దర్శన సముద్ భూత ప్రమోదాత్మనాం-భూయాల్లింగ కటాక్ష వీక్షణావశాత్ గోబ్రాహ్మణేభ్యశ్శుభం’’

75-మల్లికార్జున భట్టు (1280-1330)

భాస్కరకవి కొడుకైన మల్లికార్జున భట్టు కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానకవి మణులలో ఒకడు .’’నిర్యోస్ట్య రామాయణం ‘’రాశాడని పేరు .సురవరం ప్రతాప రెడ్డి గారు ‘’అబిషిక్త రాఘవం , సరస్వతి చంద్రిక కు కూడా ఈ కవే కర్త అన్నారు .తెలుగులోభాస్కరరామాయణం లో  కిష్కింద సుందర కాండలు రాశాడు.ఆశ్వాసాంత గద్యం లో –

‘శ్రీ మదస్ట భాషా  కవిమిత్ర కుల పవిత్ర భాస్కర సత్కవి పుత్రమల్లికార్జున భట్ట ‘’అని రాశాడు .చాగంటి శేషయ్యగారి కధనం ప్రకారం ఈ భాస్కరుడు హుళక్కి భాస్కరుడు .కనుక మల్లికార్జునకవి కాలం 1280-1330.ఈ కవి ఉదార రాఘవ కర్త సాకవెల్లి మల్లికార్జున భట్టుఅని కొందరు పొరబడ్డారు .ఇద్దరూ ఒకరు కాదు వేరు వేరుకవులు .దురదృష్ట వశాత్తు ఈ మల్లికార్జున భట్ట సంస్కృత రచనలు లభించలేదు .

76-సాకల్య మల్లు భట్టు

మల్లు భట్టు లేక కవి మల్లయచార్య శకవల్లి  ఇంటిపేరున్న మధ్వుడు .ప్రతాపరుద్రుని ఆస్థాన కవి .కాకతి రాజ్య పతనం తర్వాత రాచ కొండ వెళ్ళాడు .శ్రింగార భూపాలుని ఆస్థానం లో ఉన్నాడు .గురుపరంపర లో ప్రభావ మల్లు భట్టు అనే పూర్తీ అద్వైతి.నయనాచార్య చేతిలో వాదం లో ఓడిపోయి వైష్ణవం స్వీకరించి ప్రచారం చేశాడు .దీని వెనుక ఒక కద ఉంది .సాకల్యుడు తన వైష్ణవ విరోదిపై బేతాలుడిని ప్రయోగింఛి విరోధి పల్లకి ని మోసే బోయీగా ఉండమన్నాడు .పల్లకీలోని స్వామిని మట్టు బెట్టె ప్రయత్నం లో ఉండగా ఆయన గ్రహించి మంత్రం ప్రయోగం తో ఈ బేతాలుడిని దారికి తెచ్చ్చి నిజంగానే తన పల్లకీని మోయించాడు  .సాకల్యుడు వైష్ణవుని చేతిలో ఓడిపోయి మతం పుచ్చ్చుకొన్నాడు .

సాకల్య మల్లుడు సంస్కృతం లో నిర్యోస్త్య రామాయణం రాశాడు .కాని 16శతాబ్ది మధ్యలోనే అది కనుమరుగైంది 16శతాబ్దం చివరలో   గోల్కొండ రాజు వద్ద ఉన్న మరిగంటి సిన్గానాచార్య దీని విషయమ తెలిపాడు .అప్పకవి కూడా ఈ కవి వ్యాకరణ శాస్త్రం రాశాడని చెప్పాడు .సాకల్యుడు ‘’అవ్యయ సంగ్రహ నిఘంటు ‘’కూర్చాడు .-

‘’ప్రణమ్య శిరసా దేవం భద్రాద్రి నిలయం హరిం –అధవ్యయాని కచితిసంగ్రుహాంతే యధాశ్రుతం

ఆః యాస్బెదే నిషేదార్ధం స్వల్పే చాప్యానృతా ర్దికే –అస్తు సంతాపనే కోపెప్యాంగ చ స్యాదీషదర్ధకే ‘’

చివరగా –‘’సమన్తతః సర్వ తోర్దే శోభనాంత సుధాన్తయోః –ఉపాన్తతః పురోర్ధ చ స్యాదార్ధ్యార్ధ గ్రవాచాయే ‘’

ఈ నిఘంటువే కవి చివరి రచన .’’చతుర్భాషా కవితా పితామహ ‘’అనే బిరుదున్నవాడు .ఇతని రచనలలో ఉదార రాఘవం ఒకటే లభించింది .మొదటి ,చివరి శ్లోకాలను చూద్దాం –

‘’ఆస్తి ప్రశస్తః ప్రక్రుతేః పరస్తా దాఘః పుమాన్ కేవలాచిత్స్వరూపః –ఆనంద పూర్ణః సద సత్ప్రపంచ బాహ్వంతర వ్యాప్త భుప్రకారః ‘’

సాదిస్ట మాత్ర క్షుభితాత్మ నీనా మాయా గుణోర్ధైరమః దాడి తత్వైః-ప్రారబ్ధ మండంసామాను ప్రవిశ్య ప్రావర్తయామాస భవత్ప్రపంచం .

రాముని శివ ధనుర్భంగ వార్తను జనకుడు దశరధునికి తెలియే జేసే శ్లోకం –

‘’విశిఖే ధనుర్భజి తదార్వ భీత్యా ,చలితే రదే రధినితడధ్వని హ్రుస్టే-గుణాసరదీ చ శరమాన విషాతాం శ్యానాత్మ జావితి దదుః శుభ లేఖం ‘’

తెలుగు పలుకు బడులను సంస్కృతీకరించి రాశాడు .భోజ చంపు ను వాడుకొన్నాడు .ఈ కవి కవిత్వాన్ని అల్లసానిపెద్దన కూడా అనుసరించి శ్రావ్యత కల్గించాడు మను చరిత్రలో .సీత దృష్టిలో లక్ష్మణ స్వామి ఎలా ఉన్నాడో చెప్పే శ్లోకం బాగుంటుంది –

‘’గురురేషపిటేశ ,పుత్రఏష స్వజన శాచైష సర్వేష భ్రుత్య ఏషః –ఇతి దేవరి లక్ష్మణేను కంపాః విదధే నిఃస్వసితా విదేహ పుత్రీ ‘’’ఉదార రాఘవం లో కొన్ని సూక్తులు –

‘’ప్రత్యక్షతః స్వర్గ సుఖం విహాయ ,పరోక్షతః కిం నరకాద్విభీయం

ముగ్ధే కిమప్యాంబ న  వేస్తి దగ్దే ,కుక్షౌ క్షుదాకాం జన మాక్షిణ దదాత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-16-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.