నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
86-రామ సూరి (19శతాబ్దం )
ఆత్రేయ గోత్రీకుడు బొబ్బిలి కి చెందినకృష్ణ గోపాల కుమారుడు రామ సూరి .19వ శతాబ్ది మధ్య వాడు .13అధ్యాయాల గోపాల క్షేత్ర మాహాత్మ్యం ను బొబ్బిలి లోని గోపాల క్షేత్రం పై రచించాడు .ఈ క్షేత్రం గోస్తనీ –వేగావతి లమధ్య విలసిల్లుతోంది ..కధను భవిష్యోత్తర పురాణం నుంచి గ్రహించాడు .ముందుగా ప్రార్ధన శ్లోకం –
‘’శ్రీ లక్ష్మీశం శివ మజం రామం గౌరిం సరస్వతీం –ధ్యాత్వా గణానాధిపం ప్రణమ్య గ్రహనాయకం ‘’.క్షేత్రానికున్న పూర్వనామం గురించితెలియ జేస్తూ –‘’
తస్మాద్దుర్గ సుసంపన్నా పురీ దేశీయ భాషయా –బొబ్బిలీతి ప్రసిద్ధా సా దక్షినార్దేన భోగిలా ‘’
బొబ్బిలిని ఉజ్జయిని తో పోలుస్తూ –
‘’విశాలాయాం దుర్గ వతాచిక భాగేన నిశ్చితా-యదా చోజ్జయినీ సా స్యాంత దాసౌ బొబ్బిలీ పురీ ‘’
రచనా కాలాన్ని తెలియ జేస్తూ-వ్యయాబ్దాశ్వ యుజాంత మారవారే లిఖాదత్రిజః –గోపాల క్షేత్రమహాత్మ్యంరామసూరిస్సవయం కృతం .’’అంటే 12-10-1406 లేక 26-10-1886 అని తెలుస్తోంది .ఆరవారం మంగళవారం .
రామసూరి మరో రచన ‘’భావ మ౦జరి ‘’.మూడు అధ్యాయాలు సర్దా నీతికవిత్వం .-కొన్ని మచ్చులు –
శ్రీరామో మాధవ స్ఫూర్తిః పాయాన్నో భావ మంజరీం –చంద్రానాలోజ్జ లన్నేత్రం గాత్రం యన్న ప్రభాసతే ‘’-కొన్ని నీతులు –
‘’శరణార్ధి మనః పూర్తీ శరణ్య యేన భావేద్యాది –శోణాదామ సుధా దామ్నోనిర్ధమత్వం న కిం భవేత్ ‘’
‘’హంసానాం జలదద్వాన న్నాసకరం వరం –హృదస్త దంబు పూర్ణాహిపురా పద్మాశ్రియమ వహా ‘’
చివరి శ్లోకాలలో వేదాంతం ఉంది –‘’హ్రుదాంబుజే బిందు మరంద తుందిలేకళా రుచి స్ఫీత సుషుమ్నా మందిరే
స్ఫురన్మహా నాద వినోద మంబరం నమామి విశ్వంభర మిందిరా పతిం ‘’
87-కందుకూరి రామేశ్వర
కృష్ణాజిల్లా కళ్ళేపల్లి పార్వతీ పరమేశ్వర భక్తుడు కందుకూరి రామేశ్వరుడు ‘’పార్వతీ పరిణయ చంపు ‘’రాశాడు .కాలాదులు అలభ్యం .రెండు స్తబకాల అసంపూర్తి రచన .ప్రార్ధన శ్లోకం –
‘’శ్రేయః కరోతు సతతం మమ చంద్రమౌళేః పాదాబ్జ యుగ్మ మధసంజయ నాశ నిధ్వం
మేరేంద్ర ముఖ్య సుస్వందిత గీయమాన౦ చన్నానుక౦పిసమతత్వ దురంధారం తత్ ‘’
కవి వినయ విదేయతలను ప్రకటించుకొన్నాడు –
‘’కాహం విద్వాన్ గ్రంధ కర్తృత్వ బుద్ధిః జానన్ ద్విన్నాన్ యానికాని ప్రకుర్వే –నానా విద్యా భూషితానాం తధాపి గ్రంధం విద్వాన్మనుషాణాం మూదే చ ‘’
హిమాలయ వర్ణన –‘’హిమాలయో గోత్ర రాజశ్చతుస్సాముద్ర పర్వంత భువో మాన దండ ఇవ స్థితః –బభౌ స హిమవాన్రాజా కాంచీ కృతమ హార్నవః ‘’
తారకాసురుని చేత పరాభావిమ్పబ్డిన ఇంద్రుని దైన్యం –
‘’తారకాఖ్య కరవాల విభిన్న బాహు శాస్విభవాదిజితాశాః –తత్ప్రుతా ముకిలీకృత నేత్రా బ్రహ్మ లోక మగామన్ సురరాజః ‘’
88-కొర్ర పాడు లక్ష్మణ కవి
రామానుజ ,రమలపుత్రుడు కొర్రపాడు లక్ష్మణ కవి ..తాత తెలున్గార్య చేన్జి దైవంవిలాస కృష్ణ కావ్యం రాశాడు ..ఇందులోని మూడు స్తబకాలలో మొదటిది పూర్తిగా మిగిలిన రెండు అసంపూర్తిగా నాలుగోది చివరలేకుండా అయిదోది అసంపూర్ణంగా ఉన్నాయి .జెంజి కృష్ణ రాజు ఆస్థానకవి కనుక ఆయనపై రాసిన శ్లోకం –
‘’తత్వ విరాసీ త్తత కౌతుక శ్రీర్విలాస కృష్ణో విహతిం చికేర్షుః-క్రుతాశ్రియం కృష్ణ నృపం విధాతుం ,స్వనామ భాజం ప్రధిత స్వచిహ్నం ‘’
పూర్వీకుల గురించి –‘’శ్రీ కోర్పాడు తెలున్గార్ధ తనూభావస్య రామానుజస్య తన యేన సమావరస్య –శ్రీ లక్ష్మణేన కవినా జయతు ప్రణీతః క్రుష్ణానుజేన నవ కృష్ణ విలాస ఏషః ‘’
89-ఓరుగంటి లక్ష్మణ సోమయాజి (16శతాబ్దం )
ఓరుగంటి శంకర సోమయాజి పుత్రుడు లక్ష్మణ సోమయాజి 12అధ్యాయాల ‘’సేతారామ విహార కావ్యం ‘’రాశాడు .ఓరుగంటివారు వరంగల్ ,కరీంనగర్ విశాఖ గుంటూరు జిల్లాలో ఉన్నారు .ఈకవి 16వశతాబ్దం లో వరంగల్ వాసి అయి ఉంటాడు .దీనిపై తత్సత్ వైద్యనాధ రాసిన ‘’చంద్రిక ‘’,అవసస్తి భగీరధ రాసిన ‘’తత్వ ప్రకాశ ‘’వ్యాఖ్యానాలున్నాయి .వీరిద్దరూ ఆంధ్రేతరులే కావటం విశేషం .మన సోమయాజి కవిమేదా దక్షిణామూర్తి ఉపాసకుడు .స్వామియే స్వయంగాకలలో మంత్రాన్నిచ్చి సాధన చేయమన్నాడు .కనుక తన రచనను ఆస్వామి దక్షిణా మూర్తియే రాశాడని వినయంగా చెప్పాడు .
‘’స్వప్నే సాక్షాత్క్రుతౌ యః ప్రధమ ముపా దిశన్ దక్షిణా మూర్తి మంత్ర౦ –పస్చాదాజ్నా పయంచ స్వమహిమ కలితం పంజరంయః పఠేతి’’
ఇదికాక యింకా 5రచనలు చేశాడు .’’కై యాటవివరణ అనే వ్యాకరణ గ్రంధం ,గీతారమ ,చమత్కార లహరి ,గీతామహేశ్వర ,అనే కవిత్వం ,న్యాయ శాస్త్రం పై ‘’సంగతి లక్షణ ‘’రచించాడు ఆంధ్రుడు కనుక కవిత్వం లో తెలుగుదనాన్ని చూపాడు .అయోధ్య వర్ణన –
‘’ఏ మాముపాస్చిత్య వసంతి సర్వే జానా ఇహముత్ర చ పాలనీయాః-ఇతీ బద్ధం పరిఖాచ్చలేన పాదే యయా కంకణామివ భాటి ‘’
అన్నం వార్చి ‘’వారుపన్నం ‘’వండటం చెప్పాడు –
‘’చిత్రం యాత్ర ప్రముగ్దా బహుతర ఖాదిరాన్గారబుద్ధ్యా మణీనాం—సాఘం నిక్షిప్య చుల్లయాం తదుపరి కలశే చంద్ర కాంతా వనేద్వే
తోయం జలాన్టారా లస్తిత శశి కిరణైర్వర్ధమానం హిరాత్రీ –దుగ్ధ్వా పాకర్య మేతత్ కలశ గత జలే తండులాన్ ప్రక్షి పంతి’’
కొన్ని చోట్ల శంకరాచార్యుల శివానంద లహరి లాంటి శ్లోకాలున్నాయి –
‘’ఇమాం సర్వం కలయ మమ సర్వోత్తమ విభో –సదాపూర్వం సుర వినుత చార్వంకి కమలం
స్థిరో భూత్వా తవ పదమ భీత్వా చ విహారే ‘’
కవిపై కాళిదాసప్రభావం బాగా ఉంది ,కన్పిస్తుంది .తెలుగులో రామరాజ భూషణుని వసు చరిత్ర ప్రవాహం లోనూ కవి కొంత దూరం కొట్టుకు పోయాడు .
చంద్ర వర్ణన –‘’రాజా దోషాకర ఖ్యాతో ,దోషాణామాక్రో హిసహః –పద్మినీ చక్ర కాన్తాశ్చ,బాధతే స్వోదయే యతః ‘’
సీతాదేవి నాసాభరణాన్ని చంద్రునితో బృహస్పతితో పోల్చటం మహాద్భుతం –
‘’సుహ్రుత్త బాహ్వో ర్వలయా ను రజ్జితా విశాల కేయూర యుగోజ్జ్వల ద్భుజః –నిశీధినీ చారి గురూపమోజ్జ్వల ద్విశా ద్వనా భరణేనభాసురా ‘’
90-మంగు లక్ష్మీ నారాయణ (1660)
‘’గంగావతార చంపు ‘’రాసిన మంగు లక్ష్మీ నారాయణ 1682-1689 ప్రాంత రాజైన మధుర రంగాదిపునికి అంకిత మిచ్చాడు .ఇందులో నాలుగు తరంగాలున్నాయి .మొదటి శ్లోకం-
‘’అవ్యడా వ్యాజ కారుణ్య భావ్యాయ తనతన్వయం –అధ్యాహతర మాసేవ్యమధ్యా హిత పదం మహః
శంతనుని పొగుడుతూ –‘’పితా ప్రతీపోపి గుణే రనూనః స్తుతోపి భీష్మః సుజనాగ్ర గణ్యః-బలాత్మికాపి ప్రమాదా తిమన్యేత్యహో మహాన్ శంతన భాగ్య సారః ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-16-ఉయ్యూరు

