భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -1
బహు భాషా కోవిదుడు’’ పెనుగొండ ‘’కావ్య నిర్మాత ,దానినే ,పాఠ్య గ్రంధంగా చదివి విద్వాన్ పరీక్ష రాసినవారు ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం శ్రీశంకరాచార్యుల వారిఆశీస్సులతో పొంది , ‘’భావ కవి చక్రవర్తి ‘’గా కీర్తి గాంచి ,పద్మశ్రీ ని ప్రభుత్వం చే పొంది ‘’శివ తాండవం ‘’కావ్యం తో శాశ్వత యశస్సు నార్జి౦చినవారు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులవారు .ఆ కావ్యాన్ని వారి ముఖతా విని విని పులకించిన ధన్యులెందదరో ఉన్నారు .ఆచార్యులవారికి సాహిత్యం తో పాటు సంగీత నాట్య శాస్త్రాలూ నేర్చారు .ఇంతతిప్రతిభ రవీంద్రునికి మాత్రమే ఉండేది . ‘’ సరస్వతీ పుత్రుని శివతాండవం ‘’అని సుమారు 40ఏళ్ళ క్రితమే ఆంద్ర ప్రభ ‘’సాహితీ గవాక్షం ‘’లో రాశాను .
ఈమధ్యే శ్రీ రావి మోహన రాగారు సరసభారతి ఉగాది వేడుకల సందర్భంగా వచ్చినపుదు సభా ముఖంగా నాకు భరద్వాజ మహర్షి రాసి శ్రీ దోర్బల విశ్వ నాద శర్మ గారు సంపూర్ణ వ్యాఖ్యానం తో ప్రచురింపబడిన ‘’శ్రీ శివ కర్ణామృతం ‘’కానుకగా అంద జేశారు .దాన్ని శ్రద్ధగా చదువుతున్నాను .నాకు శ్రీ శంకరాచార్య విరచితం అని ప్రసిద్ధమైన శ్రీరామకర్ణామృతం బిల్వ మంగలుడు లీలాశుకులై రాసిన శ్రీకృష్ణ కర్ణామృతం తెలుసు,కాని శ్రీ శివకర్ణామృతంఉందని తెలియనే తెలియదు దీన్ని భరద్వాజ మహర్షి రాశాడనీ తెలియదు .భరద్వాజుడు కాదు అప్పయ దీక్షితులే దీన్ని రాశాడని ఇందులో ఉపోద్ఘాతం రాసిన సంస్కృతాంధ్ర మహా పండితులు శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు అన్నారు .కాని పుస్తకం భరద్వాజ ప్రణీతంగానే ప్రచురితం .ఇందులో ప్రతి శ్లోకం అమృత గుళికయే.శివ భక్తీ ప్రపూరితమే .మూడు అధ్యాయాలున్న ఈ కావ్యం లో రెండవ అధ్యాయం లో శివతాండవం వర్ణించ బడింది .దాన్ని చదివి పుట్టపర్తి వారి శివతాండవాన్ని నాకు తెలిసినంత వరకు రెండిటినీ పోల్చి కొంత రాయాలని పించి ఈ ప్రయత్నం చేస్తున్నాను .
మొదటగా మహర్షి’’ శివ రాస ‘’నృత్యాన్ని’’వర్ణిస్తాడు .
‘’తాపసా స్తాపనా౦తరా దేవతా-దేవతాదేవతాశ్చా౦తరా తాపసాః-ఏవ మాద్రుత్య వాగీశ్వరాది స్థితౌ –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’
మహర్షుల మధ్య దేవతలు ,దేవతల మధ్య తాపసులు ఉండగా బ్రహ్మాది దేవతలతో మహర్షి గణంతో శివుడు అలనాటి కృష్ణుడు గోపికలతో’’ అంగనా మంగనా అన్నట్లు రాస లీల చేశాడు .శ్రీకృష్ణ కర్ణామృతం లోనూ లీలాశుకుడు ఇలాంటి వర్ణనే చేశాడు .
అప్పుడు గజముఖుడైన వినాయకుడు శివ పాదస్పర్శ చేయగా శివుడు విజ్రుమ్భించి నటించాడు .
‘’కుంభి కుంభా హతి స్తంభ సంభావిత –శ్రీ మద౦ఘ్రిద్వ్యయా విక్రమీ విక్రమీ
భక్తి సక్తావలీభుక్తి ముక్తి ప్రదః –స౦ ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’
గజముఖుడు శివుని పాద స్పర్శ కోసం వంగి శిరస్సుపై ఉన్న కుంభాలను తాకించగా ఆ పాద ద్వయం కాంతి వంతమైంది.అలాంటి పాదద్వయం భుక్తి ముక్తులిస్తూ స్వయంగా నర్తించాడు .ప్రతి శ్లోకం చివర’’ శ్రీ భవానీ పతిః’’అని ఈ ఘట్టం లో భరద్వాజ మహర్షి రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-16-ఉయ్యూరు

