ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -137
55- సర్వ శాస్త్ర పారంగతుడైన బ్రిటిష్ మేధావితత్వ వేత్త ,అమెరికా పౌరుడు నోబెల్ లారియట్ –బెర్ట్రాండ్ రసెల్ -3
యుద్ధం తర్వాత తాను నమ్మని , రష్యామీదుగా ప్రయాణం చేశాడు .అప్పుడు బోల్షేవిక్కులు ఆసియా వాసులపై చూపిస్తున్న బలాన్ని పాశ్చాత్య మానసాలు ఒక జబ్బుగా ఎలా భావిస్తున్నారో నని ఆశ్చర్య పోయాడు .రష్యా చైనాలను మెచ్చుకొన్నాడు .50 వచ్చాయి పెళ్లి అయి 27 ఏళ్ళయింది .విడాకులిచ్చి డోరా విన్ఫ్రేడ్ బ్లాక్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమెతోకలిసి ‘’ప్రాస్పెక్త్స్ఆఫ్ ఇండస్ట్రియల్ సివిలిజేషన్ ‘’పుస్తకం రాశాడు .ఆమె సహకారం తో బీకన్ హిల్ స్కూల్ ను 4నుండి 10 ఏళ్ళ వయసు పిల్లలకోసం స్థాపించాడు.అందులో నిబంధనలు కాని ,మతబోధ కాని క్రికెట్, ఫుట్ బాల్ ఆటలు కాని ,బెత్తం తో కొట్టటం కాని తిట్టటం కాని లేని ఆధునిక భావాలతో నడిపించ టానికి ప్రయత్నించిన స్కూల్ అది .విద్యార్ధినీ విద్యార్ధులు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చదువుకోవచ్చు .ఏం కావాలంటే అది చేసుకోవచ్చు .ఆడా మగా కలిసి బట్టలు లేకుండా స్నానాలు చేసేవారు .అన్ని ప్రశ్నలకు పూర్తీ నిజాయితీ తో జవాబు చెప్పేవారు .ఈ విధానం సాధారణ ,ఎగువ సాధారణ వర్గాల తలిదండ్రులకు మింగుడు పడలేదు ..కొందరు ఈ విధానం పనికిరాదన్నారు ..మనిషి శీలానికి నాలుగు ముఖ్య విషయాలు కారణం అన్నాడు రసెల్ .వీటిని ‘’ఎడ్యుకేషన్ అండ్ గుడ్ లైఫ్ ‘’పుస్తకం లో వివరించాడు .అందులో మొదటిది –వైటాలిటి –అంటే బలీయమైన శక్తుత్సాహం –భయం లేని స్వీయ క్రమ శిక్షణ .ఎవరూ ఎలా ప్రవర్తించాలో చెప్పబడ రాదు ఎవరూ అవతలివారి పై అధికారం చూపించ రాదు .మన ప్రయోజనాలు మనవే .అవి బయటివారి ప్రభావం వలన యేర్పడ రాదు .మన ప్రయోజనాలను ఇతరులపై బలవంతంగా రుద్ద రాదు ..రెండవది కరేజ్ –ధైర్యం –ఆత్మ గౌరవం,ఆత్మ జ్ఞానం..వ్యతిరేక అలవాట్లపై పోరాటం చేసి కోపం దుర్మార్గాలను అణచుకొని నేర్చుకోవాలి .మూడవది సెన్సిటివిటి-అంటే సున్నిత మనస్తత్వం .సరైన విద్యవలన ఇది లభిస్తుంది కాని తాత్కాలిక భావోద్రేకాలకు గురైతే రాదు .నాలుగవది ఇంటలిజెన్స్ –అంటే మేధస్సు .తెలుసుకోవాలనే తహ తహ కొత్తది కనిపెట్టటానికి కారణ మవుతుంది .అది విజ్ఞానానికి దారి తీస్తుంది .సృజన వయసు మీద పడిన కొద్దీ తగ్గుతుంది .ఆశయ ఆదర్శాలు ఘనమే కాని ఆచరణలో పూజ్యమై స్కూల్ మూత పది నిరాశనూ అపజయాన్ని పంచింది .
స్కూల్ తో పాటు రెండో పెళ్ళీ ఫెయిలయింది .మొదటి భార్య ఇచ్చిన విడాకులు గుర్తింపు పొందలేదు .రెండో భార్య డోరా ఇచ్చిన విడాకుల నోటీసు చాలా స్పెక్టాక్యులర్ అంటే వింత ఆకర్షణమైంది .దీనికి కారణం రసెల్ ప్రచురించిన ‘’మారేజ్ అండ్ మోరల్స్ ‘’.భార్యా భర్తల మధ్య సెక్స్ సంబంధం సంతానం కోసం మాత్రమే కాదు కాని వారిద్దరి మధ్యా అవగాహనకు ఇద్దరికీ విద్య ఉండాలి .అందుకోసం పెళ్లికాకుండానే పరాయి వాడితో పడుకోవటం అలవాటుకావాలి .అంతే కాదు వివాహేతర శృంగారమూ అభిలాష ణీయం అన్నాడు .దీన్ని వివరిస్తూ రసెల్ ‘’where marriage is fruitful and both partners to it are reasonable and decent the expectations ought to be that it will be lifelong ,but that not it will exclude other sex relations ‘’అని కొత్త’’ దవ్వారాలు ‘’తెరిచాడు .ఈ విషయం లో రసెల్ ద్వయం హుందాగానే ఉన్నా ,ఇద్దరు పిల్లలను కన్నా వీరికాపురం జీవితాంతం వర్దిల్లాల్సి ఉంది .కాని ఈ వివాహేతర శృంగారాన్ని ఆ ఇద్దరూ ఆహ్వానించ లేక పోయారు .ఈ బాధ భరించలేక 1932లో చట్ట పరంగా రెండేళ్ళ తర్వాత విడిపోయారు .అప్పటికి ముసలాయన వయసు 64,ఇక ఆగకుండా తన దగ్గర రిసెర్చ్ అసిస్టెంట్ గా ఉన్న హెలెన్ పాట్రీషియా స్పెన్స్ ను పెళ్లి చేసుకొన్నాడు .మరో ఏడాదికి ఒక కొడుక్కి తండ్రి అయ్యాడు .
అరవైలలో చాలా విలువైన గ్రంధ రచన చేసి ప్రచురించాడు ..అందులో ముఖ్యమైనది ‘’ఫ్రీడం అండ్ ఆర్గ నైజేషన్ ‘’.దీనిలో 1814నుండి 1914వరకు ఒక శతాబ్దపు చరిత్ర ను గూర్చిన సర్వే ఉంది .ఇందులోని శక్తి వంతమైన వర్ణన శైలి విపరీతంగా ఆకర్షిస్తుంది .దీన్ని ఒక సైంటిఫిక్ ఫిక్షన్ గా రాశాడు .పాతవాటిని పునర్ మూల్యాంకన చేసి కొత్త విషయాలు చెప్పాడు .ఇందులో కొంత దుస్టస్వభావం ఉన్నా ,వందేళ్ళలో నియంత మాటర్నిచ్ ,సింహ సదృశ బిస్మార్క్ ,చాపకింద నీరులా ఉండే మాల్థస్,విప్లవ అవాస్తవ ఫిలాసఫర్ ,ప్రమాదకర ఎకనామిస్ట్ మార్క్స్ల గురించి మనకు తెలియని విషయాల నెన్నిటినో తవ్వి తీశాడు .గణిత శాస్త్ర వేత్తగా రసెల్ మార్క్స్ చెప్పిన వివాదాస్పద సర్ప్లస్ ధీరీ అంటే మిగులు సిద్ధాంతాన్ని సవాలు చేసి ధనికుల చేతిలో అధికారం ఉందనటాన్ని కాదని వర్గ పోరాట సిద్ధాంతం ఉదార వాద సిద్ధాంతాన్ని దెబ్బతీసిందని తేల్చాడు .దీనివలన కన్జర్వేటివ్ లు బలపడ్డారన్నాడు .అంతమాత్రం చేత కేపిటలిజం ఉద్ధరిస్తున్దనుకోలేదు .దీనికి పారిశ్రామిక ప్రజాస్వామ్యం పరిష్కారం అన్న మార్క్స్ ఆలోచనపై అనుమానించాడు .’’the nineteenth century was brought to a disastrous end by conflict between industrial technique and political theory .Plutocracy ,the actual form of government in western countries ,was unacknowledged and ,as far as possible concealed from the public eye ‘’అని తన మనోభావాలను స్పష్టంగా చెప్పాడు రసెల్ .
‘’ఇన్ ప్రైజ్ ఆఫ్ ఐడిల్నెస్ ‘’ను దీనితర్వాత ఒక ఏడాదికి ప్రచురించాడు .శైలిలో విషయం లో చాల భిన్నంగా ఉంది .ఆశ్చర్యాలు సూక్తులు ,హాస్యం తో మేళవించి రాశాడు ‘’science while it diminishes our cosmic pretensions ,enormously increases our terrestrial comfort .That is why in spite of the horror of the theologians ,science has on the whole been tolerated ‘’అని సైన్స్ చేస్తున్న మేలు కీడులను విశ్లేషించాడు పని రెండు రకాలు .మొదటిది పదార్దాన్ని భూమి వద్దకానీ భూమిఉపరితలం దగ్గరలో కాని ఇతర పదార్ధాలకు సాపేక్షంగా మార్చటం .రెండవది ఇతరులను కూడా ఇలానే చేయమని చెప్పటం ‘’అన్నాడు
65వ ఏట రసెల్ మళ్ళీ అమెరికా వెళ్ళాడు చికాగో యూని వర్సిటి ,కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెల్స్ యూని వర్సిటి ,హార్వర్డ్ యూని వర్సిటీలలో విలియం జేమ్స్ స్మారక ఉపన్యాసాలిచ్చాడు 1940లో కాలేజ్ ఆఫ్ ది సిటి ఆఫ్ న్యు యార్క్ లో ఫిలాసఫీ ప్రొఫెసర్ చైర్ కు ఆహ్వానించారు .చాలా తీవ్రంగా అరుపులు కేకలు నిరసనలు మిన్ను ముట్టాయి. ‘అక్కడి తలిదండ్రులు రసెల్ రాసిన మారేజ్ అండ్ మోరల్స్ చదవకుండానే తమ పిల్లలకు ఫ్రీ సెక్స్ ,అనైతికత వంటివి నేర్పి భ్రస్టు పట్టిస్తాడేమోనని భయ పడ్డారు,.ఈ అభియోగాలైన సేలేషియస్ అంటే కామం ,లెచేరస్ అంటే అతి శృంగారం ,లిబిడినస్అంటే విషయాసక్తి ,ఏస్తేటిక్అంటే సౌందర్యారాధన ,సబ్ వేర్సివ్అంటే అన్నిటికీ అడ్డుతగలటం వంటివి తనపై మోపటం చూస్తె పూర్వం సోక్రటీస్ పై,ణ కూడా ఇవే అభియోగాలు మోపారన్న సంగతి గుర్తు చేశాడు .రసెల్ క్లాస్ రూమ్ లో లాజిక్ ,గణితం మాత్రమె బోధిస్తున్నాడని కాలేజి ప్రెసిడెంట్ నిర్దారించినా ,రసెల్ పై ఒక కోర్టు కేసు జరిగి ,అతను హానికర ప్రభావం (పేర్నిషియస్ ఇన్ఫ్లుయేన్స్)కలిగిస్తున్నాడని నియామకం రద్దు అయింది .న్యు యార్క్ సుప్రీం కోర్ట్ జస్టిస్ జాన్ మెక్ గీహన్ ,రసెల్ నియామకాన్ని రద్దుపరచి ‘’రసెల్ కి ఉద్యోగం అమర్యాదకు పట్టాభిషేకం ‘’అని తీర్పు చెప్పాడు . రసెల్ ఫిల డేల్ఫియా దగ్గర బార్న్స్ ఫౌండేషన్ లో ఉపన్యాసానికి ఆహ్వానం అందుకొన్నాడు .పెన్సిల్వేవేనియాలో మెరియన్ లో ఇల్లు కొనుక్కొని ఉండి,బార్న్స్ తో తగువు పడిరెందేల్లతర్వాట మళ్ళీ బాక్ టుపెవిలియన్ గా ఇంగ్లాండ్ చేరాడు .
రెండవ ప్రపంచ యుద్ధకాలం లో రసెల్ అభ్యంతరాలేవీ చెప్పలేదు .పసిఫిజాన్ని వదులుకోలేదు .కాని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఫాసిజాన్ని వ్యతిరేకించాలని కోరాడు .70 వ పడిలో తననుతాను ఆనంద పసిఫిస్ట్ గా చెప్పుకొన్నాడు .మార్మికటా వ్యతిరేకి అయ్యాడు .నిందా స్తుతి పరుడు ,అవిదేయతా తిరుగు బాటు దారుడు అనిపించాడు .76లో మరో రచన బాంబు పేల్చాడు .అదే ‘’హ్యూమన్ నాలెడ్జ్ –ఇట్స్ స్కోప్ అండ్ లిమిట్స్ ‘’.మేధావితనం ను విశ్లేషించిన రచన ఇది .రసెల్ తొణకని బెణకని ధైర్య సాహసాలకు అద్దంపట్టింది అది ..రేడియో ప్రసంగాలు చేస్తూ రేడియో స్థాయిని విపరీతంగా పెంచాడు .సామాన్యజనానికి సాహిత్యాన్ని
అందించాడు రేడియో మాధ్యమంగా .77వ ఏట నార్వీజియన్ ఫ్లైయింగ్ బోట్లో ప్రయాణం చేశాడు .అది కూలిపోయింది .అందులోని 20 మంది ప్రయాణీకులు నీళ్ళలో మునిగి మరణించారు .ఒళ్ళంతా పూర్తీ డ్రెస్ తో ఉన్న రసెల్ గడ్డకట్టిన సముద్రం లో ఈడుకొంటూ బయట పడే ప్రయత్నం చేస్తుండగా సహాయం అంది రక్షింప బడ్డాడు .కొద్ది రోజుల తర్వాత యధాప్రకారం తానూ చేయాల్సిన ఉపన్యాసం ఇచ్చాడు .78 వ ఏట బెర్ట్రాండ్ రసెల్ కుసాహిత్యం లో నోబెల్ బహుమతిలభించింది .రసెల్ ను మహితాత్మక రచయితగా మానవతా మూర్తి గా ప్రపంచం గుర్తించి ప్రశంసించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-16 –ఉయ్యూరు

