ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -153
59-అత్యంత వివాదాస్పద బ్రిటిష్ ప్రధాని –సర్ విన్ స్టన్ చర్చిల్ -6
నాజీల ‘’ఆబాస విజయం ‘’ను గుర్తి౦చనివాడు ,ఇంగ్లాండ్ చేస్తున్న ఒంటరి పోరాటం చూసి రష్యాకు అమెరికాకు తగిన సమయం లోఆయుధాలతో సైన్యం టో స్పందించే అవకాశామిచ్చినవాడు’’ ,మహా కూటమి ‘’అనే గ్రాండ్ అలయన్స్ ఏర్పాటు చేసి పడమటినుంచి అమెరికాను తూర్పునుంచి రష్యాను యుద్దొన్ముఖులను చేసిన అపర చాణక్యుడు చర్చిల్ .తనకు అత్యంత మిత్రుడైన అమెరికా ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ తో న్యు ఫౌండ్ లాండ్ లో 19 41లో చారిత్రాత్మక శాంతి ఒప్పందమైన అట్లాంటిక్ చార్టర్ ను రూపొందించటం లో అనన్య సాధారణ ప్రతిభ కనపరచాడు .యుద్ధ సమయం లో ఈ నేత లిద్దరూ కనీసం డజను సార్లు అయినా సమావేశమై చర్చి౦చుకొన్నారు .చర్చిల్ అమెరికా ప్రెసిడెంట్ కు ఆయననివాసం వైట్ హౌస్ కు ఆత్మీయ అతిధి ,కుటుంబ సభ్యుడూఆయ్యాడు.ప్రెసిడెంట్ భార్య ఎలినార్ రూజ్ వెల్ట్ ఈ అగ్రనాయకులిద్దరూ యుద్ధ పూర్వ దేశ పరిస్తితికి యుద్దానంతర దేశ పరిస్థితికి చాలా ఆందోళన పడ్డారని చెప్పింది .యుద్ధం పూర్తీ అయ్యేదాకా తాను పదవిలోనే ఉంటానని యుద్ధం నుంచి ప్రతి సైనికుడు బయటికి వచ్చి జీవితం లో స్థిరపడేదాకా తనకు విశ్రాంతి లేదని చెప్పేవాడని గుర్తు చేసుకోన్నది .రష్యా నియంత స్టాలిన్ తోస్నేహం వ్యక్తిగాతమైనదేకాని రాజకీయమైనదికాదు .ఈ ఇద్దరూ నిర్లఖ్యం ,దూకుడు స్వభావం గల యుద్ధ వీరులేకాక తిండి పోతులు ,తాగు బోతులు కూడా .కమ్మ్యూనిజం వ్యాప్త్ని చర్చిల్ భయంకరమైనదిగా భావించేవాడు . రష్యా వల్ల కలిగిన దారుణ మారణ కాండ మానవ జాతి చరిత్రలో ఎప్పుడైనా చూశామా అని 1921 జనవరి లో చర్చిల్ అన్నాడు .’’రష్యా తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తోంది జనానికి తిండి లేదు .మనిషికి మనిషి రాష్ట్రానికి రాష్ట్రం బద్ధ శత్రువులై జనాలను తరిమేస్తున్నారు .ఇదంతా చూస్తుంటే నాగరక మానవుడిని సంస్కృతికి దూరంగా తరిమేస్తూ ఆశల హర్మ్యాలు కూలుస్తూ ,రెక్కాడితెకాని డోక్కాడని పరిస్స్థితి సృష్టించి మనం రాతి యుగం లో ఉన్నామా అనే అనుమానం కలిగేట్లు చేస్తున్నారు’’అన్నాడు .ఇదే చర్చిల్ 20ఏళ్ళ తర్వాతారష్యాను ‘’మహా యుద్ధ వీరులు ,శక్తి వంతమైన నాయకులు అన్నాడు రష్యా సైన్యం జర్మనీ సైన్యాన్ని ఎక్కడికక్కడ నిలవరించి ఇంగ్లాండ్ వైపుకు దూసుకు రాకుండా అడ్డు పడినప్పుడు.గత రెండు దశాబ్దాలుగా తనకంటే కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన వారెవరూ లేరన్నాడు .జర్మనీ రష్యాపై దాడికి దిగినప్పుడు రేడియో లో మాట్లాడుతూ ‘’నేను పూర్వం మాట్లాడిన మాటలన్నీ గతం గతః .ఇప్పుడు రష్యా సైనికులు ప్రాణాలు ఒడ్డి తమ దేశాన్నిరక్షి౦చు కొంటున్న తీరు చూస్తె వారి అపూర్వ త్యాగాభరిత పోరాట పటిమ దిగ్భ్రాంతి కలిగిస్తోంది .మా రెండు దేశాల లక్ష్యం ఇప్పుడు ఒక్కటే హిట్లర్ ను అతని నాజీ సిద్ధాంతాన్ని కూకటి వేళ్ళతో పెకలించి పారేయటమే .ఇప్పుడు ఆ నరహంత హిట్లర్ తోకాని అతని నాజీ జుంటా తోకాని అసలు సంప్రదింపులు జరపనే జరపం .భూమిపైనా సముద్రం మీదా ఆకాశమార్గానా అతనితో పోరాటం చేస్తాం దైవక్రుపవలన తను స్వాధీనం చేసుకొన్న భూభాగాన్ని విముక్తం చేయగలిగాం ‘’Any man or state who fights on against Nazidom will have our aid’’అన్నాడు .
యుద్ధం పూర్తీ అవగానే చర్చిల్ రష్యా విషయం లో కొంత ఊగిసలాడాడు .రష్యాఆసియాను డామినేట్ చేస్తుందేమోనని అనుమానించాడు .దానికోసం ఇంగ్లీష్ మాట్లాడే దేశాల సమాఖ్య కోసం ప్రయత్నించాడు .అంతమాత్రం తో రష్యా వైపు యుద్ధ ద్రుష్టి టో చూడను కూడా లేదు .ప్రభుత్వం లో ఉన్నా బయట ఉన్నా అతని స్వరం లో తీవ్రత ఏమాత్రమూ తగ్గలేదు .యుద్ధం ముగిసి మిత్రపక్షాల విజయం తర్వాత ఇంగ్లాండ్ లో ఎన్నికలు జరిగి యే నాయకుడు తమను కాపాదాడో తమ దేశాన్ని రాక్షించాడో ఆమహా నాయకుడైన చర్చిల్ నుపరువు ప్రతిష్టలు హిమాలయోత్తుంగ సదృశంగా ఉన్న సమయం లో దారుణం గా ఓడించారు .దీనికి చాలాకారణాలున్నాయి .స్వతహాగా టోరీ కావటం ,పేదదప్రజానీక బాగోగులపై ద్రుష్టి లేని వాడు కావటం , నూతన దేశ నిర్మాణానికి,బాధ్యతలను మోయటానికి చాలినంత శక్తి యుక్తులు లేని ముసలి ఎద్దు అయిపోవటం కొన్ని కారణాలు అతని శత్రువులు మాత్రం యుద్ధ సమయం లో శక్తి యుక్తులు చూపిదేశాన్ని రక్షించినా శాంతి సమయం లో సమర్ధత చూపే చాకచక్యం లేని ఒంటి కొమ్ము సొంటి లాంటి వాడన్నారు .అసలు ప్రజలు మార్పు కోరారు . సూపర్ హ్యూమన్ కాకపోయినా చర్చిల్ తీవ్రంగా బాధ పడ్డాడు .ప్రతిపక్ష నేతగా ఉండి అవమానాల పాలయ్యాడు .దీనిపై స్పందిస్తూ ‘’దేశం లో అత్యున్నత పదవినిలో ఉంటూ అయిదేళ్ళ మూడునెలల రెండవ ప్రపంచ సంగ్రామం లో నా దేశం తరఫున పోరాడి నా దేశం పరువు ప్రతిస్స్టలనుపెంచి ,యుద్ధ విజయాన్ని చేకూర్చితే నా బ్రిటిష్ ప్రజలు ఇక నువ్వు మా విషయాలలో చేయవలసిందేమీ లేదు అంటూ ఓడించి ఇంటికి పంపారు ‘’అని రాసుకొన్నాడు.
ఈ నిరాశా నిస్పృహలనుండి తేరుకోవటానికి చర్చిల్ కు కొంత కాలం పట్టింది .ఇంగ్లాండ్ అమెరికాలలో విస్తృతంగా పర్యటన చేస్తూ పూర్వంలాగానే శక్తి వంతమైన పదజాలం తోప్రజలను ఆకర్షించాడు .కొత్త మాటలూ ప్రయోగాలు చేశాడు .రష్యా గురించి చెబుతూ ‘’an iron curtain has descended across the continent ‘’అన్నాడు ఇనప తెరఅనే మాటను రష్యన్ సీక్రెట్ సర్వీస్ లకు అన్వయిన్చేట్లు అన్నాడు .గణాంక వేత్తలను సైంటిస్ట్ లను ,మిలిటరీ ఎక్స్ పర్ట్ లను ,పరిశోధకులను ,విద్యా వేత్తలను ఒక రికార్డింగ్ మెషీన్ ను ఏర్పాటు చేసుకొని పగలూరాత్రి షిఫ్ట్ పద్ధతిలో పనిచేసి ఆరు భాగాల సీరియల్ ను నిర్మించాడు .ఇందులో అమెరికన్ సీరియల్ ఒక్కదానికే రెండు మిలియన్ డాలర్ల డబ్బు వచ్చింది .వీటికి వేరువేరుగా పేర్లు పెట్టాడు –‘’ది గాదరింగ్ స్టార్మ్’’,దెయిర్ ఫైనేస్ట్ అవర్ ‘’,ది గ్రాండ్ అలయన్స్ ‘’,ది హింజ్ ఆఫ్ ఫేట్ ,’’క్లోసింగ్ ది రింగ్ ‘’,ది త్రంఫ్ అండ్ ట్రాజేడి’’చివరిదానికి బాధా తప్త హృదయం తో ‘’HOWTHE GREAT DEMOCRACIES TRIUMPHED AND SO WERE ABLE TO RESUME THEFOLLIES WHICH HAD SO NEARLY COST THEM AND THEIR LIFE ‘’అని ఉప శీర్షిక పెట్టాడు .శక్తి వంతమైన రష్యా ,ప్రచ్చన్న యుద్ధం వంటివి ఇంకా పరిష్కారం కాని సమస్యలుగానే ఉన్నాయి .
ఆరేళ్ళు జ్ఞాపకాల రాతల్లో తలమునకలుగా ఉండి,తన జీవితం లోని అవమాన కర ఓటమి ట్రాజెడీ ని మరో అంతర్ నాటకం తోవిజయ తీరాలకు చేరుద్దామని ఎదురు చూస్తుండగా 1951లో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చి ,అదృష్టం తలుపుతట్టగా గెలిచి మళ్ళీ బ్రిటిష్ ప్రధాని అయి ఊరట చెందాడు .ప్రజా సేవకు గర్వ పడుతూ ‘’నేను పదవికోసమో అధికారం కోసమో రాలేదు .ఈ రెండిటినీ సుస్టుగా అనుభవించాను .మరి ఎందుకు వచ్చాను అంటే సుస్థిర శాంతి స్థాపనకోసమే ‘’అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-5-16-ఉయ్యూరు

