ఇది విన్నారా కన్నారా ! 20
36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3
‘’మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు ‘’అనే కీర్తన ఎప్పుడూ పాడుకోనేవారట .శంకర శాస్స్త్రి గారు కూడా చివరి కచేరీలలో ఈ కీర్తనే వాయి౦చేవారట .వారు ముక్త పురుషులు .నాదం లో లయించేవారు .1987 డిసెంబర్ 23 న ఈమని వారు ‘’ఈమనికి ‘కి ’స్వస్తి చెప్పి శంకర గళ నిగళం లో చేరుకొన్నారు .వారు తూర్పు గోదావరిజిల్లా ద్రాక్షా రామపుణ్య క్షేత్రం లో 1922 సెప్టెంబర్ 23న జన్మించారు .ఇక్కడే అశ్వత్ధ నారాయణుడూ వెలసి ఉన్నాడు. అంటే శివ కేశవ క్షేత్రం అన్నమాట .65ఏళ్ళు మాత్రమే జీవించి ప్రతిక్షణాన్నీ సార్ధకం చేసుకొన్నారు .తండ్రి అచ్యుతరామ శాస్త్రి తాతగారుసుబ్బా రాయ శాస్స్త్రి గార్లు ఇద్దరూ మహా వైణికులే .శాస్త్రిగారికి నలుగురు అక్కయ్యలు .తల్లి మగపిల్లాడికోసం తపన చెంది అశ్వత్ధ నారాయణుడికి మొక్కుకొంటే ఆ స్వామి అనుగ్రహం తో శంకర శాస్త్రి గారు జన్మించారు .బాలసార నాడు వీరికి పెట్టిన పేరు ‘’శంకర సూర్య మాణిక్యాల రావు ‘’.
248 –అంత ధనిక కుటుంబం కాకపోయినా భుక్తికి లోటు లేనిదే .కొడుకు సంగీత వృత్తిలో స్థిరపడటం తండ్రిగారికి ఇష్టం ఉండేది కాదు .కాని శంకర శాస్త్రి గారికి నర నరానా ,ప్రతి రక్త బి౦దువులోనూ సంగీతమే ఉంది. ఏమీ తెలియని వారి శైశవ బాల్యాలలోనూ సంగీతమే ప్రవహి౦చింది వారిలో .తండ్రిగారు ఇది విన్నారా కన్నారా ! 20
36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3
247-‘’సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా ‘’.త్యాగరాజస్వామి వారు జీవితపు చివరి రోజులలో నాద లోలురై వీణ వాయించు కొంటూ ఉంటె వీరు నోటితోనే మృదంగ జతులను పలికే వారట .అంటే తాళ వాద్యం లేకుండానే తాళ ధ్వనులను పలికే వారన్నమాట .లయ ,తాళాలు అలా వారికి ఆజన్మ సిద్ధంగా లభించిన వరాలయ్యాయి . తాళం తో పాటు మధురంగా పాడటం కూడా యే శిక్షణా లేకుండానే వచ్చేసింది .ఈ చైల్డ్ ప్రాజేడీ ప్రతిభ గుర్తించి తండ్రిగారు కొన్ని వర్ణాలు నేర్పారు .కాని సంప్రదాయ శిక్షణ కొడుకుకు అవసరం లేదని కొద్ది రోజుల్లోనే గ్రహించారు .కుమార సంభావ కావ్యం లో మహా కవి కాళిదాసు పార్వతీ దేవికి ప్రాక్తన విద్య తో సకల శాస్త్రాలు లభించినట్లు చెప్పాడు .అలాగే శాస్త్రిగారివిద్యఅంతా కూడా ప్రాక్తన విద్య యే.ఉపదేశాకాలం లో ఈ ప్రాక్తన విద్య సహజంగా దానంతటికి అదే బయటికి వచ్చేది .అంతటి చిన్న వయసులోనే వీణ పై ప్రయోగాలు చేసేవారు .కొత్త ధ్వనులు సృష్టించేవారు ప్రకృతిలో విన్న ప్రతి ధ్వనినీ వీణ పై పలికించి అబ్బుర పరచేవారు .ఒక్క ఏడాది కాలం లోనే కచేరీ కి కావాల్సినంత పాఠం నేర్చుకొని ,ప్రయోగ శీలత తో దాన్ని గుబాళింప జేసేవారని ఆచార్య ముదిగొండ అన్నారు .
249-దాక్షారామం లో మూడవ ఫారం చదివి ,కాకినాడ వెళ్లి పెద్దక్క సరస్వతమ్మ గారింట ఉండి,పి ఆర్ కాలేజీలో ప్రిసిపాల్ పెద్దాడ రామ స్వామిగారిని పాట తో మెప్పించి సీటు సంపాదించారు .ప్రిన్సిపాల్ గారే వీరి పేరును ‘’ఈమని శంకర శాస్త్రి ‘’గా మార్చారు .ఇది ఆయనకు రెండవ బారసాల అయి ఆ పేరే స్థిర పడి విశ్వ వ్యాప్తమై పోయింది ‘’.పేరులోన పెన్నిధి కలదు ‘’అని రుజువైంది .’’సూర్య మాణిక్యాల రావు’’నోటితో మృదంగమే వినిపిస్తే ,శంకర శాస్త్రి జీవితమంతా వీణ నే వినిపించాడు .వీణ పై పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తున్నప్పుడు వ్రేళ్ళతో ఆ పాట లయను వీణ బుర్ర మీద కొట్టి వినిపించేవారు .వీరి కాలేజి చదువుకు రెండు సార్లు విఘ్నం కలిగింది .1930 లోని చదువు ,1945 కు కాని బి యే .పట్టాను ఇవ్వలేక పోయింది ‘
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-16 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

