విజయం ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపిస్తోంది: అభినందన సభలో చంద్రబాబు By: Nageshwara Rao Published: Wednesday, August 24, 2016, 14:25 [IST] అమరావతి: కృష్ణా పుష్కరాల విజయం ఇచ్చిన కిక్ ఇప్పుడు కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల్లో విధులు నిర్వహించిన ఉద్యోగులు, అధికారులు, కార్మికులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాకంటే సిబ్బంది, ఉద్యోగులు ఎక్కువగా కష్టపడ్డారని అన్నారు. పోలీసులు కూడా పుష్కరాల్లో సేవ చేశారని మెచ్చుకున్నారు. Also Read: బాబు సర్వే: టిడిపి స్థితిపై దిమ్మతిరిగే ఫలితం పోలీసులంటే లాఠీలు ఉపయోగిస్తారన్న చెడుభావం గతంలో ఉండేదని, పుష్కరాల పోలీసుల ఇమేజ్ పెరిగిందని అన్నారు. టెక్నాలజీ సాయంతో పుష్కరాలను విజయవంతం చేశామని తెలిపారు. టెక్నాలజీ వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రాలేదన్నారు. ఈ విజయం అన్ని వర్గాల ప్రజలది, అధికారులదని సీఎం తెలిపారు. నది పారిన అన్ని ప్రాంతాల్లో పుష్కరస్నానాలు చేశారని చెప్పిన చంద్రబాబు, పారిశుద్ధ్యం విషయంలో పురపాలకశాఖ తీరు అభినందనీయమని కొనియాడారు. 17వేల మంది విద్యార్థులు పుష్కర సేవకులుగా పనిచేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఐవోటి కింద ముందుకు తీసుకువెళ్లడానికి ఈ పుష్కరాల అనుభవం ఉపయోగపడుతుందని అన్నారు. పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ సమన్వయం బాగుందని, పక్కా ప్రణాళికతో పుష్కరాలను నిర్వహించారని అభినందించారు. కృష్ణా పుష్కరాలు మతాలకు అతీతంగా జరిగాయని.. ముస్లింలు, క్రైస్తవులు కూడా పుష్కర స్నానాలు చేయడం అభినందనీయమన్నారు. Also Read: 2 పుష్కరాలు, సింధు గోల్డ్ మెడల్, థ్యాంక్స్: వచ్చినవారితో సంకల్పం చేయించిన చంద్రబాబు ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సేవ చేయడం, స్వచ్ఛంద సంస్థలు యాత్రికులకు అన్నదానం చేయడం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. ఇక డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ పుష్కర విధుల్లో మృతి చెందిన పోలీసు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. పుష్కరాల్లో సాంకేతికను ఎక్కువగా వినియోగించుకున్నామని ఆయన తెలిపారు. ఈ విజయం వెనుక అందరి కృషి దాగి ఉందని చెప్పిన ఆయన రాబోయే రోజుల్లో అన్ని శాఖలతో సమన్వయంతో కలిసి ముందుకు సాగుతామని అన్నారు. సీఎం ప్రోత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. Post Comment Ads by Revcontent From The Web Today Mumbai Girl Gets 4 Shades Fairer in 14 Days by Using This 1 Weird Old Trick! Just Copy & Paste To Make Rs. 2,25,000/Month Indian Millionaires Trying To Ban This Program No Diets Or Gym: Melt All
వీక్షకులు
- 1,107,569 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

