– శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవం –ఆహ్వానం
3-9-16 శనివారం మధ్యాహ్నం 3 గంలకు సరసభారతి ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ వారితోకలిసి శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి(అమెరికా ) దంపతుల సౌజన్య సహకారాలతో శ్రీకోట సూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యులగురు పూజోత్సవం ,పబ్లిక్ స్కూల్ లో నిర్వహిస్తున్నాం .ముఖ్యతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ ,ఆత్మీయ అతిధులుగా ,శ్రీ కోటగురు పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖరశాస్త్రి ,శ్రీ గాయత్రి ప్రసాద్ శ్రీ సీతారామాంజనేయులు గార్లు కుటుంబాలతో పాల్గొంటారు . ,శ్రీ కోట మాస్టారి చిత్రపటానికి పుష్పహార సమర్పణ జరుగుతుంది .
ఆనాటి కార్యక్రమం లో శ్రీమైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) ఏర్పాటు చేసిన శ్రీ కోట సూర్యనారాయణ మాస్టారి ధర్మపత్ని కీశే .కోట సీతమ్మగారి ,స్మారక నగదుబహుమతి 10 ,000 రూపాయలను , ప్రతిభ ,పేదరికం ఉన్న శాంతి నికేతన్ హైస్కూల్ బాలికకు ,అలాగే ప్రతిభ ,పేదరికం ఉన్న ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ బాలునికి కీ శే .కోట సూర్యనారాయణ గురు వరేణ్యుల స్మారక నగదు బహుమతి10 ,000రూపాయలను సరసభారతి ద్వారా అందజేయబడుతుంది ,కోట సోదరులు తమ తలిదండ్రుల జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన స్మారక నగదు పురస్కారం 10 000రూపాయలను పేదరికం ప్రతిభా ఉన్నఇంటర్ విద్యార్ధికి వారి చేతులు మీదుగా అందింప జేయటం జరుగుంది .
రెండు రోజుల తర్వాత వచ్చే 5 వ దేదీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా 3 వ తేదీ ననే శ్రీ కోట మాస్టారి గురు పూజోత్సవ సందర్భంగా శ్రీ కోట సోదరులకు ,శాంతి నికేతన్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ మధుసూదన్ పిళ్లే శ్రీమతి విజయ లక్ష్మి దంపతులకు ,సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మిగారికి ,,ఇద్దరు పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులకు సత్కారం జరుగుతుంది ..
శ్రీ కోట మాస్టారి గురుపూజోత్సవ సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవానికి సాహిత్యాభిమానులు ,విద్యాభిమానులు విశేషంగా పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన
మనవి-ఇటీవలి కృష్ణా పుష్కరాలు , సందర్భం గా ప్రత్యేక ఆహ్వానపత్రం ముద్రింఛి అందజేయటానికి సమయం చాల నందున ఇదే ఆహ్వానంగా భావించి అందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
ఏం కె బాబు –ప్రిన్సిపాల్ –ఉయ్యూరు పబ్లిక్ స్కూల్
శ్రీ వినాయక చవితి మరియు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలతో
ఉయ్యూరు .
26-8-16

