ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9
18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్
30-5-1815 న జన్మించిన ఆటో వాన్ బోహ్ట్ లింక్ జర్మనీ ఇండాలజిస్ట్ ,సంస్కృత విద్యా వేత్త .అయన అద్భుత కార్యం సంస్కృత నిఘంటు నిర్మాణం .రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ లో జన్మించాడు .ఓరియెంటల్ భాషలు-అరబిక్ ,పెర్శియన్ సంస్కృతం లను సెయింట్ పీటర్స్ బర్గ్ యూని వర్సిటిలో అధ్యయనం చేసి తర్వాత జర్మని వెళ్లి బెర్లిన్, బాన్ యూని వర్సిటీలలో 1839నుండి మూడేళ్ళలో పూర్తీ చేశాడు .,1842 లో మళ్ళీ పీటర్స్ బర్గ్ చేరి రాయల్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ కు సభ్యుడుగా ఎన్నికై ,1860 లో రష్యన్ స్టేట్ కౌన్సిలర్ అయ్యాడు .తర్వాత ప్రీవీ కౌన్సిలర్ అయ్యాడు .1868 లో జర్మని లోని జేనా చేరి తర్వాత లీప్జిగ్ లో స్థిర వాసమేర్పరచుకొని 1-4-1904న చని పోయే దాకా అక్కడే ఉండి పోయాడు .
19 వ శతాబ్దపు ఓరిఎంటలిస్ట్ లలో పేరెన్నిక గన్నవాడు ఆటోవాన్ .భారతీయ భాషలపైనా ,తులనాత్మక భాషాధ్యయనం పైనా గొప్ప నిష్ణాతుడు .మొదటి గొప్ప రచన పాణిని అస్టాధ్యాయిని ఇంగ్లీష్ లోకి అనువదింఛి జర్మన్ వ్యాఖ్యానం రాయటం .ఇది ఒక రకంగా ఫ్రాంజ్ బొప్పా ఫైలలాజికల్ విధానాలపై కామెంటరి .ఇదికాక బోపదేవుని వ్యాకరణాన్ని ,ఛాందోగ్య ఉపనిషత్ ,బృహదారణ్యక ఉపనిషత్ లను తర్జుమా చేసి వ్యాఖ్యానం కూడా రాశాడు .సంస్కృత –జర్మని నిఘంటువుణు 7 భాగాలలో తయారు చేశాడు .సంస్కృత ఉచ్చారణ పై రాశాడు .దండి కావ్యాదర్శాన్ని అనువదించాడు
19-ప్రాకృత నిఘంటువును అనువదించిన –జోహాన్ గార్గ్ బూలర్
జోహాన్ గార్గ్ బూలర్ 19 -7-1837 న రెవరెండ్ జోహాన్ జి .బూలర్ కు హానోవర్ లోని బోర్స్తల్ లో జన్మించాడు .హానోవర్ గ్రామర్ స్కూల్ లో లో చదివి ,గ్రీక్ ,లాటిన్ లలో మహా పండితుడయ్యాడు .గోటేన్జన్ యూని వర్సిటిలో చేరి దియాలజి, ఫిలాసఫీ ,క్లాసికల్ ఫైలాలజి ,సంస్కృతం జెంద్,పెర్షియన్ ,అరెబిక్ , ఆర్మీనియన్ భాషలు అధ్యయనం చేశాడు .1858 లో తూర్పు భాషలలోను ,ఆర్కియాలజీ లోను డాక్టరేట్ పొందాడు .గ్రీక్ భాషలోని ‘’టేస్ ‘’అనే ప్రత్యయం పై దిసీస్ రాసి ప్రచురించాడు .అదే ఏడాది సంస్కృత వ్రాత ప్రతుల పరిశీలనకోసం పారిస్ వెళ్ళాడు .తర్వాత లండన్ వెళ్లి 1862 వరకు ఉన్నాడు .ఈ కాలం అంతాఇండియన్ ఆఫీస్ లో ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటీ లోని బోడ్లియన్ లైబ్రరి వేద వ్రాత ప్రతుల అధ్యయనం లోనే గడిపాడు .మొదట్లో ప్రైవేట్ టీచర్ గా పని చేసి తర్వాత విండ్సర్ కాజిల్ లోని క్వీన్స్ లైబ్రరి కి అసిస్టంట్ గా ఉన్నాడు .
1862 లో గోటేన్జన్ లైబ్రరీకి అసిస్టంట్ గా వెళ్లి ,మాక్స్ ముల్లర్ ద్వారాఆహ్వానం అందుకొని బనారస్ సాంస్క్రిట్ కాలేజి లో చేరటానికి వెళ్ళాడు . ఈలోగాప్రోఫేసర్ మూలర్ ద్వారా బాంబే ఎలి ఫెంటైన్ కాలేజి లో ప్రాచ్యభాషల ప్రొఫెసర్ గా ఆహ్వానమూ అందుకొని వెంటనే బొంబాయి వెళ్లి1863 ఫిబ్రవరి 10 న చేరాడు .అప్పుడు అక్కడ ప్రముఖ న్యాయ శాస్త్ర విద్యా వేత్త కాశీనాద్ త్రయంబక్ తెలంగ్ విద్యార్ధిగా ఉన్నాడు .మరుసటి ఏడాది బూలర్ ఫెలో ఆఫ్ బాంబే యూని వర్సిటి అయ్యాడు .రాయల్ ఏషియాటిక్ సొసైటీ లో సభ్యుడయ్యాడు .188౦ వరకు ఇక్కడే పని చేశాడు .ఇక్కడున్న కాలం లో బెర్లిన్ కేంబ్రిడ్జ్ ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటీలకు అరుదైన విలువైన పుస్తకాలను సేకరించి పంపాడు .
1878 లో అతి ప్రాచీనమైన ప్రాకృత వ్యాకరణం ‘’పైయాలచ్చి ‘’నిఘంటువును అనువదించాడు .వివరణ కూడా రాశాడు .ఆపస్తంభ ధర్మ సూత్రాల అనువాదానికీ సహయం చేశాడు .8-4-1898 న లేక్ కాన్స్తాన్స్ లో మునిగి చనిపోయాడు .బూలర్ ఇతర రచనలు –ది రూట్స్ ఆఫ్ దాతుపాఠ.ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ ఖరోస్తి ,డైజెస్ట్ ఆఫ్ హిందూ లా కేసెస్ ,పంచతంత్ర ,కేటగిరి ఆఫ్ సాస్క్రిట్ మాన్యు స్క్రిప్ట్స్ ,దశ కుమార చరిత్ర ,విక్రమార్క చరిత్ర ,ఇన్స్క్రిప్షన్స్ ఫ్రం ది కేవ్స్ ఇన్ బాంబే ప్రెసిడెన్సి ,ది లాస్ ఆఫ్ మను ,మొదలైన సుమారు 20 రచనలు .
20- మైత్రాయణీయ ఉపనిషత్ అనువదించిన –వాన్ బుటెనాన్
జోహాన్నెస్ ఆద్రినాస్ బెర్మార్దాస్ వాన్ బుటెనాన్ 21-8-1928 న ది హేగ్ లో జన్మించిన డచ్ ఇండాలజిస్ట్ .చికాగో యూని వర్సిటిలోఫిలాసఫీ ఫైలాలజి చదివి .కెరీర్ చివరలో మహా భారతం పై మక్కువ ఎక్కువ చూపాడు .1953 లో డాక్టరేట్ పొందాడు .వెంటనే ఇండియా వెళ్లి మూడేళ్ళున్నాడు .1959 నుంచి 61 వరకు యుట్రేక్ యూని వర్సిటిలో ఇండియన్ ఫిలాసఫీ రీడర్ గా ఉన్నాడు .నెదర్ లాండ్స్ పై మోజు పోయి ,చికాగో యూని వర్సిటి నుండి ఆహ్వానం రాగా చేరి 21-9-1979 న చనిపోయే దాకా అక్కడే పని చేశాడు .అమెరికాలోని అనేక మంది విద్యావేత్తలకు గురుత్వం వహించిన ఖ్యాతి వాన్ బుటెనాన్ ది .ఆయన ప్రముఖ శిష్యులలో జేమ్స్ ఎల్ ఫిట్జెరాల్డ్ ,వాల్టర్ ఓ కేల్బార్ ,మైకేల్ డివిల్స్ బ్రూస్ సల్లినాన్, బ్రూస్ లింకన్ వంటి వారున్నారు .1963 లో రాయల్ నెదర్లాండ్స్ అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కు కరస్పాండెంట్ అయ్యాడు .
బుటేవాన్ రచనలు –టేల్స్ ఆఫ్ ఎన్శేంట్ ఇండియా ,ది మైత్రాయణీయ ఉపనిషత్ ,ది ప్లేస్ ఆఫ్ ఎన్శేంట్ ఇండియా ,రామానుజ ఆన్ భగవద్గీత ,యామునాస్ ఆగమ ప్రామాణ్య ,ది మహాభారత -3 భాగాలు ,భగవద్గీత ఇన్ ది మహా భారత .సాంఖ్యం మీద మూడు పెద్ద వ్యాసాలు ,పంచ రాత్ర నామ విశిస్టత మీద ఆంగ్ల వ్యాసం రాశాడు
.
సశేషం
గాంధీ జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-10-16 –ఉయ్యూరు
.