వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5
మల్లినాదునిపై ప్రచారం లో తెలుగు కన్నడ కధలు
సంస్కృత శతావధాని ,భు గ్రంధకర్త శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి ‘’సంస్కృత మాఘ కావ్యము –ఆంధ్రీ కృతులు ‘’అనే అంశం పై పరిశోధించి పి హెచ్ డి పొందారు .అందులో మల్లినాధుని పై ప్రచారం లో ఉన్న ఒక కధను ఉదాహరించారు .మల్లినాధుడు చిన్నతనం లోచదువు ,సంధ్యా లేక అల్లరి చిల్లరగా తిరిగేవాడు .ధనవంతుదికొడుకు కనుక పెళ్లి అయింది అత్తారింటికి వెడితే భార్య బావ మరదులు అతని విద్యా గంధ హీనతను యెగతాళి చేశారు .చివరికి సూటీపోతటీగా భార్య ‘’ఎన్ని మాటలు అన్తేనేం రోకలి చిగురిస్తుందా ?’’ముసలః కిసలాయతే’’?అని దెప్పి పొడిచింది .తనస్వగ్రామం వెళ్లి భార్య అన్నమాటలలో అర్ధాన్ని పండితులనదిగి తెలుసుకొని ,పట్టుదలపెరిగి తాను మహా సంస్కృత విద్వాంసుడు కావాలని నిర్ణ యించుకొని కావ్య నాటక అలమ్కారాది శాస్త్రాలను ,పదవాక్య ప్రమాణాలను దీక్షగా గురువులవద్ద చదివి గొప్ప విద్వాంసు డై అత్తారింటికి దారేది అని వెళ్లి నిజంగానే రోకలి చిగురించింది అనే అర్ధం వచ్చేట్లు ‘’ముసలః కిసలాయతే ‘’అని ‘’ భార్యతో అన్నాడు .భార్తవిద్వాట్టుకు భార్య పరవశం చెంది ,ఆతనితో అత్తారింత్కి కాపురానికి వెళ్లి సుఖ జీవనం గడిపింది .సూరి అనిపించుకొన్న మల్లినాధుని పాండిత్యాన్ని కొడుకు కుమారస్వామి ‘’త్రిస్కంద శాస్త్ర జలదిం చులుకీకురుతేస్మ యః ‘’అని కీర్తించాడు
కన్నడ దేశం లో మరో కద ప్రచారం లో ఉంది .ఇలాంటి కధలను కన్నడ కవి రచయితా అవధాని డా ఆర్ గణేష్ ‘’కవితే గోండు కధే ‘’అనే పుస్తకం లో నిక్షిప్తం చేశాడు .వీటిని ‘’దంత కద ‘’అన్నారు.కన్నడ దేశం లో చిన్న పిల్లల పుస్తకాలలో మల్లినాదునిపై ఒక కద చేరింది .మల్లినాధుడు బాల్యం లో చదువు పై శ్రద్ధ లేకుండా జులాయిగా ,రంగేళీ గా తిరిగిన సంపన్న యువకుడు .ధనికుడు కనుక పిల్లల తండ్రులు వెతుక్కుంటూ వచ్చి తమ పిల్లను అతనికిచ్చి పెళ్లి చేయాలని ఉవ్విల్లూరేవారు .ఒకాయన విద్యా వతి అయిన తన కూతుర్ని విద్యా విహీనుడైన మల్లి నాదునికిచ్చి వివాహం చేశాడు .పెల్లియ్యాక కాని భార్యకు తన భర్త విద్యా గంధం లేని వాడని తెలియ లేదు.ఒక రోజు ఇద్దరూ రోడ్డుపై వాహ్యాళికి వెడుతుంటే రోడ్డుమీద పడ్డ ఒక పువ్వును చూసి మల్లినాధుడు ఆమెతో ‘’ఆ పువ్వు ఎంత అందంగా ఉందొ చూశావా ?అని దాని అందాన్ని గురించి పొగిడాడు అప్పుడామే ‘ఎంత అందమున్నా అది వాసన లేని పువ్వు దైవ పూజకు పనికి రాదుకదా “’క్ని నర్మ గర్భం గా అన్నది .ఆమె మాటల భావం అర్ధమై విద్యా లో మహా పండితుదవ్వాలనే బలమైన కోరిక కలిగింది .
గురుకుల వాసం చేస్తూ విద్య నభ్యసించాలని నిశ్చయించుకొని ఒక మహా పండితుని గురుకులం లో చేరాడు గురువు మల్లినాధుని దీక్షకు సంతోషించి పరీక్షించే నెపం తో గురుపత్నికి మల్లినాదునికి పెట్టె ఆహారం నెయ్యి తో కాఉండా వేపనూనేతో చేసి వడ్డించమని ఆదేశించాడు .ఆమె రోజూ అలాగే చేసేది పూర్తిగా చాడువు పై మనసు కేంద్రీకరింప బడిన మల్లినాదుడికి రుచి విషయం పట్టేదికాడు .చదువు పై ఏకాగ్రత తప్ప వేరే దృష్టి లేదు
ఒక రోజు గురువు గారి ప్రక్కనే కూర్చుని గురు పత్ని వడ్డిస్తుంటే భోజనం చేయ సాగాడు .రుచిలో తేడా ఉందని గ్రహించి గురుపత్నితో ‘’మాతా!ఆహారం చాలా చేదుగా ఉందేమిటి ?’’అని అన్నాడు .ప్రక్కనే ఉన్న గురువు చిరు నవ్వు నవ్వి శిష్యుడి బుజం తట్టి ‘’నాయనా ! రోజూ మీ గురుపత్నినినెయ్యి బదులు వేపనూనె తో తయారు చేసిన ఆహారమేనీకు పెట్టమని ఆదేశించాను ఆమె అలాగే చేసింది చదువు ధ్యాసలో నువ్వు రుచి గ్రహించకుండా ఇంతకాలం తిన్నావు .ఇప్పుడు నువ్వు పరిపూర్ణ విద్య సాధించావు ఇక ఇక్కడ ఉండాల్సిన పని లేదు ఇంటికి వెళ్ళ వచ్చు ‘’అన్నాడు .గురువు గారి ఔదార్యానికి తనను అంతటి విద్వాంసునిగా మలచినందుకు కృతజ్ఞత తెలిపి,అనుజ్న పొంది ఇంటికి చేరాడు .భార్యా కుటుంబం అందరూ ఎంతో సంతోషించారు .మహా విద్వాంసుడైన మల్లినాద సూరి కాళిదాస మహాకావ్యాలకువ్యాఖ్యానం రాయటం ప్రారంభించాడు
భర్త పాండిత్యానికి ఆశ్చర్య పడిన భార్య ఒక రోజు తనపై ఒక శ్లోకం రాయమని మల్లినాధుని కోరింది .ఆయన తటపటాయిస్తూ శూర్పణఖ తో పోలుస్తూ ఒక శ్లోకం ‘’రామ వైరి భగినీవ రాజసే ‘’అనే శ్లోకం చెప్పాడు .భార్యకు ఎక్కడో కాలింది.ప్రతీకారం తీర్చుకోవటాని ఎదురు చూస్తోంది .మల్లినధుడు తన వ్యాఖ్యానాలలో ‘’ఇత్యర్ధః ‘’-ఇదీ అర్ధం అని ,ఇతి భావః ‘’-ఇదీ దీని తాత్పర్యం అని ఎక్కువగా వాడటం అలవాటు. మామూలు సంభాషణనూ వ్యాఖ్యానాలపై పూర్తీ దృష్టితో ఉండటం వలన ఇవి వచ్చేవి .ఒక రోజు మల్లినాధుడు అన్నం లోకి ఎం చేశావు అని భార్యను అడిగితె ,ఎన్నాళ్ళనుంచో రిపార్టీ ఇవ్వాలని ఎదురు చూస్తున్న ఆమె వెంటనేసమాధానంగా శ్లోకం లో –
‘’ఇత్యర్ధ క్వధితం చైవేతి భావ తే మనం తధా- సంజీకృతేదయ భుక్త్యార్ధం తుష్యతాం భావదాశయః ‘’అని చెప్పింది- దీని భావమేమి మల్లినాద –అనుకొంటే –‘’ఉడికిన ఇత్యర్ధ మజ్జ గేహులి అని భావం .ఇదే మధ్యాహ్న భోజనం హాయిగా ఆరగించి ఆనందించండి ‘’అన్నది .మల్లి నాధుడు తన భార్య పాండిత్యానికి బహుశా గర్వ పడే ఉంటాడు
మల్లినాద సూరి తాతగారు కోలాచల౦ సుబ్బా శాస్త్రిగారు కర్నాటక రాష్ట్రం ధార్వాడ్ జిల్లాలోని మహేంద్ర గడ నివాసి అని ,కన్నడ ,మరాటీ భాషలలో ఎన్నో హరికధలు రాశాడని అవి నీతి బోధకాలుగా ఉన్నందున ఇప్పటికీ జనం నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయని ,ఆయన తండ్రి నిజాం రాజ్యం లోని అనే గొందే సంస్థానం లో దివాన్ అని అది విజయనగర సామ్రాజ్యం లో భాగం అని ఆ వంశానికి చెందిన వాడే బళ్ళారి వాసి సంఘ సంస్కర్త విద్యా వివేక సంపన్నుడు వితరణ శీలి ,న్యాయవాది అయిన కోలాచలం వెంకట రావు గారని ,ఆ వంశానికి చెందిన బళ్ళారి లాయర్ శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు నాకు జులైలో పంపిన ‘’కోలాచలం ఫామిలీ ఆఫ్టర్ మల్లినాద ‘’అనే జిరాక్స్ కాగితాలలో ఉంది.దీనితో మల్లినాదుని కాలం, ఆయనపై ప్రచారం లో ఉన్న కట్టుకధలకు స్వస్తి చెప్పి ఆయన వ్యాఖ్యాన వైఖరిని ,బహుశాస్త్ర పాండిత్యాన్ని గురించి తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-16 –ఉయ్యూరు .

