అక్షరం లోక రక్షకం
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు
– అక్షరం లోక రక్షకం
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,ఉయ్యూరు
’గీ’ర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంథావిష్కరణ సభ (100 వ సమావేశం )
ఆహ్వానం
సరసభారతి , రోటరీక్లబ్ ,ఉయ్యూరు సంయుక్తంగా నిర్వహిస్తున్నసరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచన ;’’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం(482 మంది సంస్కృత కవుల జీవిత ,సాహిత్య పరామర్శ )కీ శే లు శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి ,భవానమ్మదంపతులకు అంకిత మిస్తూ , శ్రీ మైనేని గోపాల కృష్ణ,శ్రీమతి సత్యవతి దంపతుల (అమెరికా )సౌజన్య సహకారాలతో వెలువడిన గ్రంథాన్ని4-12-20 16 ఆదివారం సాయంత్రం ,రోటరీ క్లబ్ ఆడిటోరియంలో ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు విష్కరణ చేసే సభలో పాల్గొని జయ ప్రదం చేయవలసినదిగా అతిధులకు ,సాహిత్యాభిమానులకు ,కవి పండితులకు సాదర గా ఆహ్వానం పలుకుతున్నాం .
కార్య క్రమం
4-12- 16 ఆదివారం మధ్యాహ్నం 4 గం ల నుండి -5 -30 గం వరకు
గీర్వాణ వైభవం (సంస్కృత సంస్కృతి)పై ప్రముఖ కవుల కవి సమ్మేళనం –
నిర్వహణ డా .గుమ్మా సాంబ శివరావు (తెలుగు శాఖాధిపతి ,లయోలా కళాశాల ,విజయవాడ )
సాయంత్రం 5 -30-నుండి 5-45 గం వరకు
‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం –ఆవిష్కరణ
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు ,గ్రంధ కర్త
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,సరసభారతి గౌరవాధ్యక్షులు మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు
ముఖ్య అతిధి ,గ్రంథావిష్కర్త –మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ,శాసన సభ ఉప సభాపతి
విశిష్ట అతిధులు –పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామ కృష్ణా రావు ,గీతం యూని వర్సిటి చాన్సెలర్ ,విశాఖ పట్నం
ప్రొఫెసర్ గబ్బిట ఆంజనేయ శాస్త్రి , న్యాయశాఖ ప్రొఫెసర్ , బెనారస్ హిందూ యూని వర్సిటి వారణాసి.
శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి ,న్యాయశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ – శ్రీ జగన్నాధ విశ్వ విద్యాలయం ,పూరి
గౌరవ అతిధి –డా .ధూళి పాళ రామ కృష్ణ ,సంస్కృత శాఖాధ్యక్షులు ,మేరీ స్టెల్లా కాలేజి ,విజయవాడ
మాన్య అతిధదులు – శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసన మండలి సభ్యులు
శ్రీ జి .వెంకటేశ్వర రావు సి .ఓ ఓ.,-కె సి పి.
ఆత్మీయ అతిధులు – ప్రముఖ టి వి ,సినీ నటి ,యాంకర్ ఝాన్సి (అమృతం ఫేం )
శ్రీ గుండు హనుమంత రావు ,ప్రముఖ సినీ హాస్య నటులు ,(అమృతం ఫేం)
శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం
డా .జి వి .పూర్ణ చంద్ ,ప్రధాన కార్య దర్శి,కృష్ణాజిల్లా రచయితల సంఘం
శ్రీ చలపాక ప్రకాష్ ,రమ్య భారతి సంపాదకులు ,మరియు కార్య దర్శి,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం
సాయంత్రం 5- 45గం నుండి – 6 గం వరకు – గ్రంథ పరిచయం
డా .తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి ,రిటైర్డ్ ప్రిన్సిపాల్ ,శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల ,పొన్నూరు
సాయంత్రం 6 గం నుండి –రాత్రి 7- 30 గం వరకు –అతిధుల అభిభాషణం ,అతిధులకు సన్మానం
కార్య క్రమ నిర్వహణ -శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్య దర్శి
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు, మరియు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
రోటరీ క్లబ్ ప్రెసిడెంట్
పూర్తి వివరాలతో ఆహ్వాన పత్రికను నవంబర్ 15 లోపు అంద జేస్తాము
—
‘’’చందః పాద యుతాం నిరుక్త నఖరాం ,శిక్షాది జ౦ఘాన్వితాం
ఋక్సామోరుయుగా,మధర్వ జఘనా ,మధ్వర్యు వేదో ధరాం
తర్క న్యాయ కుచాం,పదస్మృతిభుజాం కావ్యార వి౦దాననాం
వేదా౦తామృత లోచనాం,భగవతీం వాగ్దేవతా మాశ్రయే ‘’.

