వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -11
మల్లినాధుని శ్రుతి వైదుష్యం
శ్రుతి అనగానే వేద సాహిత్యం అంతటికీ వర్తిస్తుంది .ఇందులో మల్లినాద సూరి పాండిత్య వైదుష్యాలను తెలియ జెప్పే కొన్ని విషయాలను తెలుసుకొందాం .రఘువంశ ప్రధమసర్గలోని 31 వ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ ‘’దక్షిణా ‘’పదానికి వివరణ నిస్తూ బ్రాహ్మణం లోని ఒక విషయాన్ని ఉదాహరించాడు .-
‘’యజో గాంధర్వ స్తస్య దక్షిణా అప్సరసః –దక్షిణాయా దాక్షిణ్యం నామార్త్విజో దక్షిణత్వం పాపకత్వం
తే దక్శంతే దక్షిణాంప్రతిగ్రుహ్ణ’’
సూర్యుడు సాయం వేళ అగ్ని లో ప్రవేశిస్తాడు అని వివరించటానికి ఒక వేద వచనాన్ని ఉదాహరించాడు –
‘’సౌరం తేజః సాయమగ్నిం ప్రకమతే –ఆదిత్యో వా అస్తం యన్నగ్ని మను ప్రవిశతి –అగ్ని ర్వా ఆదిత్యః సాయం ప్రవిశీతి ‘’ కుమారుని ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక దాన్ని(కొటేషన్) ఉల్లేఖించాడు –
‘’ఏష అనృణీ యః పుత్రీ యత్వా బ్రాహ్మ చారీవా ‘’
‘’యదా సాంఖ్య ‘’అనే భావాన్ని వివరిస్తూ మతానికి సంబంధించిన సహాయకాలను ఉపయోగించుకొన్నాడు .ఎక్కువభాగం మీమాంస లోని చర్చలను ఉల్లేఖించి ,బ్రాహ్మణ పాఠ భాగాలను సంయోజనం చేస్తూ వాటి క్రమసంబందాన్ని విస్పష్ట పరచాడు.ఉపనిషత్ వాక్యాలను ఉదాహరించి భావం బలీయం చేశాడు .దేవతలు విష్ణుమూర్తి పై చెప్పిన స్తోత్రాలను చెబుతూ గతి ధర్మానికి ఉపనిషత్ వాక్యాలను చూపించాడు –‘’తమేవం విదిత్వా తి మృత్యుమేతి నాన్యః పంధా విద్యతే యనాయ ‘’అని రఘువంశం లో –‘’’’ఆత్మా వా రదమేక ఏవాయం పంధా విద్యతే యనాయ ‘’అని కుమార సంభవం రెండవ సర్గ లో –‘’సమవేదే నాస్తమయే గీయతే ‘’కుమారా సమ్భవ౦ 8 వ సర్గలో చెప్పాడు .
వ్యాకరణ పాండిత్యం
మల్లినాధుని వ్యాకరణ పాండిత్యం అవధులు లేని సముద్రమే .కొన్ని వ్యాకరణ గ్రందాలలోతులు తరిచి చూశాడు .అవి ఆయనకు వాచోవిధేయాలయ్యాయి .మనం ఇప్పుడు చెప్పేమాట ‘’ఫింగర్ టిప్స్ ‘’పై వ్యాకరణ సూత్రాలుంటాయి ఆయనకు .అత్యధికంగా పాణిని సూత్రాలను ఉదాహరించాడు .పదం యొక్క అర్ధాన్ని పూర్తిగా వివరిస్తే తప్ప ఆయనకు సంతృప్తి ఉండదు .అదీ మల్లినాదీయం .పతంజలి ,కైయాట,వృత్తికార లనుండి మూడు ఉదాహరణలు ముందు తెలుసుకొందాం .
ఉదాహరణ –మునిద్ర తాది త్యత్ర యద్యపి మునిద్ర తస్య మేనకాయా అనీప్సిత త్వాత్ ‘’కారణానార్ధ నాప్మీప్సితః ‘’ఇతి నాపాదానత్వం తయ్యాపి క్రుతోద్యమామితి మానసప్రవేశో త్కర్తవ్యతాత్ ధ్రువ మపాయే పాదనం ఇత్యపాదానత్వమేవ స్యాత్ ‘’
1-యత్రామిధ్యా సంప్రన్య నివర్తతే తచ్చ ధృవం పాయేపాదానం ఇతి ప్రసిద్ధం (కుమారసంభవ వ్యాఖ్యానం-5-3 )
2-విశ్వ యోనే రితి షష్టీ తస్యానంతర మితి భాష్యేదర్శనాత్ ‘’ (.’’’’’’’’ 6-9 )
3-అలమితిపర్యష్య ర్ధగ్రహణం ఇతి భాష్యకారః ‘’(మేఘ దూత వ్యాఖ్య -44)
రఘు వంశం లో ‘’విశ్రామయ ‘’కు అర్ధాన్ని వృత్తికార ఆధారం గా తెలియ జేశాడు .శ్ర ను దీర్ఘం చేయటం గత్యంతరం లేక చేయటమేనని ఇది ‘’వ్యవస్థిత విభాస ‘’కు చెందుతుందని ,కొన్ని ‘’స్లిస్ ‘’లాంటి మూలాలు ఉపసర్గ లున్నప్పుడు సకర్మకాలౌతాయని చూపించాడు .
‘’విశ్రామయ విశ్రమయ ఇతి హస్తపాఠే ‘’జానీ మ్రుస్ట ఇతి మిత్వే మితాం హ్రస్వ ఇతి హ్రస్వః –దీర్ఘపాఠే మితాం ఇతి సూత్రే వా చిత్త విరాగే ఇత్యతో వా ఇత్యను వర్త వ్యవస్థిత విభాషా శ్వ ణాత్వాద్ హ్రస్వ భావః ఇతి వ్రుత్తి కారః ‘’(రఘు వంశ వ్యాఖ్య )
అలాగే ‘’ఉభ ‘’కు బదులుగా ‘’ఉభయ ‘’ను వాడటం విషయం లో రఘు వంశ వ్యాఖ్యలో వివరించాడు .ద్విరేఫనుసమర్ధిస్తూ కయ్యాటుని సూత్రంతో సమర్ధించాడు .వామనుడిని కనీసం 12 సార్లు మల్లినాధుడు ఉదాహరించాడు ..ముఖ్యంగా ‘’అగ్రపాద’’భావ నేత్ర జన్మా ,బింబాధర మొదలైన సంయోగ పదాలలో వామనుడిని బాగా వాడుకొన్నాడు .’’అతర్జాయత్ ‘’క్రియను సమర్ధించే ‘’ఆఖ్యాత చంద్రిక ‘’లోని సూత్రాన్ని వివరించాడు .కొన్ని సార్లు మల్లినాధుడు గ్రంధ కర్తపేరు చెప్పకుండానే వారి సూత్రాలను ఉదాహరిస్తాడు .’’విత౦త్రిః’’మొదలైన వాటిలో విసర్గ లోపాన్ని సమర్ధించాడు .-‘’అవి తస్తుతాన్త్రిభ్య ఈః’’ఇతి పత్నీ దాతో రైణాదిక ఈ ప్రత్యయః విభావాన్న —‘’ఇలా చెప్పుకొంటూ పోతుంటే ఎన్నెన్నో ఉన్నాయి .అని లాల్యే పండితుని వ్యాఖ్య .
సశేషం
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -15-11-16 –ఉయ్యూరు

