వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -12
నిఘంటువులపై సాధికారత
మల్లినాధుడు అనేక నిఘంటువులు కోశాలనుంచి వాక్యాలను ఉదాహరించి తన వ్యాఖ్యానాలను సమర్ధించుకొన్నాడు .ఒక పదానికి తాను ఒక అర్ధాన్ని చెప్పాడు అంటే అది ఏ కోశాన్ని ఆధారం గా చేసుకొనిసమర్ధించి చెప్పాడో వివరంగా తెలియ జేశాడు .వ్యాఖ్యాతగా తాను సాధికారంగా ఆ పదానికి సరైన అర్ధం చెప్పగలిగాడు .సంస్కృత భాషలో దాదాపుగా ప్రతి పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి .కవి ఆ పదాన్ని ఏ అర్ధం తో,ఏమి ఆశించి వాడాడో వివరించి చెప్పాల్సిన పని వ్యాఖ్యాతది.వ్యాఖ్యాత ఆ అర్ధాన్ని నొక్కి చెప్పి ,అందులోని సూక్ష్మాన్ని ,నిగూఢ విషయాన్ని బహిర్గతం చేయాలి .అ అర్థాన్నే ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఎందుకు దానికే ప్రాధాన్యమిచ్చాడో సోదాహరణంగావివరించాల్సి ఉంది.మరి దీనికి ముఖ్య సాధికార ఆధారం నిఘంటువు లేక కోశమే . కనుక వ్యాఖ్యాత దీన్ని అభ్యంతర పెట్టి కాదనే వారి ని దృష్టిలో పెట్టుకొని ,అనర్హత గల అర్ధాలను చెప్పకుండా ,విమర్శ పాలుకాకుండా ,తనను తాను సమర్ధించుకోవాలి .దీనికి కోశమే శరణ్యం .అందుకని మల్లినాధుడు చాలా కోశాలు లేక నిఘంటువులను ఉపయోగించుకొన్నాడు .పాఠకుడి కి ఆ నిఘంటువులలోని వాక్యాలను ఆయన ఉదాహరిస్తూ వ్యాఖ్యానం చేస్తుంటే ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి ఈ విధంగా తన కాలానికి ఉన్న ప్రముఖమైన ఆ కోశాలను చదువరికి అతి సన్నిహితం చేయటానికి సూరి ఎంతో కృషి చేశాడు . .ఏయే కోశాలలనుంచి ఎన్ని ఉదాహరణలు ఇచ్చాడో చెప్పాలంటే అదొక చేంతాడంత లిస్టు అవుతుంది .అయినా మల్లినాద మనీష తెలుసుకోవాలి అంటే అదే దారి .
అమర కోశాన్ని –శిశుపాల వధకావ్య వ్యాఖ్య లో మొదటి సర్గలో 45 సార్లు ,రెండులో 35 సార్లు ,మూడులో 23 సార్లు ,నాలుగులో 30 సార్లు ,అయిదులో 36 సార్లు ,ఆరవ సర్గలో 28సార్లు ఏడులో 2 సార్లు ,ఎనిమిదిలో 19 సార్లు ,తొమ్మిదిలో 18 సార్లు ,పదిలో అప్ద్దేనిమిది సార్లు ,పదకొండులో పదిహేడు సార్లు ,పదిహేడులో పదహారు సార్లు ,పద్దేనిమిడిలో ముప్ఫై ఆరు సార్లు ,పందోమ్మిడిలో ముప్ఫై మూడు సార్లు ,ఇరవైలో ఇరవై ఒక్క సారి ఉదాహరించాడు.
కిరాతార్జునీయం లో మొత్తం 297 సార్లు ,రఘు వంశం లో 462 సార్లు ,కుమార సంభవం లో 146 సార్లు ,నైషధం లొ6 24 సార్లు ,మేఘ దూతం లో 80 సార్లు ,భట్టికావ్యం లో 111సార్లు ఉపయోగించాడు.
‘’ వైజయంతి కోశం ‘’ను శిశుపాల వధలో 99 సార్లు ,రఘువంశం లో ఒకే ఒక్కసారి ,కిరాతార్జునీయం లో 4 7సార్లు ,కుమారసంభవం లో 60 సార్లు ,మేఘ దూతం లో 3 సార్లు ఉదాహరించాడు .
‘’శబ్దార్నవం ‘’నుశిశుపాల వధలో 8 సార్లు ,కిరాతార్జునీయం లో 4 సార్లు ,భట్టికావ్యం లో 1 సారి ,రఘువంశం లో 83 సార్లు ,కుమారసంభవం లో 5 సార్లు ,నైషధం లో 2 సార్లు పేర్కొన్నాడు .
‘’క్షీరస్వామి వ్యాఖ్యానాన్ని’’ శిశుపాల లో 2 ,మేఘ లో 2 ,కిరాత లో 3 సార్లు భట్టిలో 1 ,రఘు లో 20 ,కుమార లో 5 సార్లు ,ఉదాహరించాడు
‘’హారావళి ‘’విశ్వ ప్రకాశిక ,హాలాయుధ కోశ ,విశ్వకోశ ,శాశ్వత కోశ,యాదవ కోశ ,భట్తమల్ల వ్యాఖ్య ,లనుంచి కూడా విస్తృతంగా కోట్ చేశాడు .ఇన్ని కోశాలను ఆకలింపు చేసుకొని సందర్భాన్ని బట్టి ఉదాహరించాడు అంటే మల్లినాధుని మనీష ఎంత గొప్పదో తెలుస్తోంది అని పి జి లాల్యే విమర్శక శిఖామణి గుది గుచ్చి ఒక చోట చేర్చి విపులంగా చెప్పాడు . ధర్మ శాస్త్రాలవిషయాలను వ్యాఖ్యానించ వలసి వస్తే మల్లినాధుడు ‘’మను ధర్మ శాస్త్రాన్ని’’,’’ కామందకాన్ని’’ ఆదారం చేసుకొని వ్యాఖ్యానించాడు .కనుక నిఘంటు ,కోశాలపై మల్లి నాదునికి అద్వితీయ వైదుష్యం సాధికారత ఉన్నాయని వీటన్నిటి వలన తెలుస్తోంది .”కోశమయ జీవి ”అనచ్చు సూరిని . సంస్కృత సాహిత్య శాస్త్రాలలోని అన్ని విభాగాలపై ఆయన పాండిత్యం మహోత్తమమం .కవులు మహా విద్వాంశులు కనుక వ్యాఖ్యాతలు కూడా అంతటి లేక అంతకు మించిన విద్వాంసులై ఉండాలి .మల్లినాద మనీష ఆయన చేసిన వ్యాఖ్యానలలోని ప్రతి పంక్తిలోను దర్శనమిస్తుంది .సంస్కృత సాహిత్యం లో విభిన్న విభాగాలపై మల్లినాధుని వైదుష్యాన్ని తరువాత తెలుసుకొందాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-16 –ఉయ్యూరు .
.

