మూగబోయిన ‘మురళి’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 November 2016
విశాఖపట్నం (కల్చరల్), ఆరిలోవ, నవంబర్ 22: ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసుడు, నటుడు, గాయకుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ ఆకస్మిక మరణం సంగీతాభిమానులను హతాశులను చేసింది. తెలుగు సంగీత ప్రియుల గుండెల్లో చిరస్మరణీయులై ఎన్నో భక్తి గీతాలు, 25వేలకు పైగా కచేరీలు చేసిన బాలమురళి కర్నాటక సంగీతంతో పాటు పలు సినీ గీతాలను ఆలపించారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులతో ఆయన్ను గౌరవించింది. సంగీత కళానిధి బాలమురళికి విశాఖ నగరంతో విడదీయరాని అనుంబధం పెనవేసుకుంది. బాలమురళి సంగీత ప్రపంచాన్ని శాసించే స్థాయిలో విశాఖ నగరంలో పలు కచేరీలు చేశారు. దశాబ్ధాల బాలమురళి సంగీత ఝరికి విశాఖ వాసులు పులకించారు. 1995- 16లో నగరంలోని విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను స్వర్ణ కిరీటంతో సత్కరించారు. అదే సంస్థ కళా,సాంస్కృతిక రంగంలో విశేష సేవలందించిన వారికి స్వర్ణ కమలం ప్రధానం చేయాలని నిర్ణయించింది. సంస్థ తొలి ప్రయత్నంలో 2002లో బాలమురళిని నాదవిద్యాభారతి బిరుదుతో పాటు స్వర్ణ కమలంతో సత్కరించింది. అనంతరం 2010 జూలై 6న బాలమురళి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పోర్టు కళావాణి ఆడిటోరియంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన తన సంగీత గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. తిరిగి 2015 జూలై 24న లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డుల ద్వారా బాలమురళిని విశాఖ వాసులు ఘనంగా సత్కరించుకున్నారు. అంతకు ముందు 2013లో గీతం కళాశాల వేదికగా జరిగిన ఇండియన్ ఎకనామిక్స్ అసోసియేషన్ జాతీయ సదస్సు సందర్భంగా బాలమురళి గాత్ర కచేరీని ఏర్పాటు చేశారు. తన జీవిత చరమాంకంలో విశాఖ కేంద్రంగా ఉన్న విజయ్ నిర్మాణ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.
దేశం గొప్ప సంగీత విద్వాంసుని కోల్పోయిందని సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు అభిప్రాయపడ్డారు. బాలమురళితో కలిసి తాను ఆకాశవాణిలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సంగీతంలో ఆయనకు తెలియని గమకాలు లేవని అన్నారు.
ప్రఖ్యాత సంగీత కళాకారుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. దక్షిణాది సంగీతానికి బాలమురళి అందించిన సేవలు ఆయన్ను చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో నిలుపుతాయన్నారు. విశాఖలో ఆయన పలు సంగీత కచేరీల్లో పాల్గొన్నారని అన్నారు.

