వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -19
ఇతిహాస పురాణాలపై మల్లినాధుని పట్టు
మల్లినాధ సూరి మహాకావ్యాలు ఇతిహాసాలు అయిన రామాయణ ,మహా భారతాల ,పురాణాల ప్రకరణాలను విస్తృతంగా తన వ్యాఖ్యానాలలో ఉదహరించాడు .గతకాలపు సంఘటనలను కవులు ప్రస్తావిస్తే ,వాటిని సమర్ధించటానికి ఇతిహాస పురాణాల విషయాలతో నిగ్గు తేల్చాడు .విశ్వామిత్ర మహర్షి బల అతిబల విద్యలను రామ లక్ష్మణులకు ఇచ్చాడన్న దాన్ని సమర్ది౦చటానికి రామాయణ శ్లోకం –‘’క్షుత్పిసానే న తే రామ భవిష్యేతే నరోత్తమ –బలాతిబలాం చైవ పఠతః పది రాధవ ‘’ఉదాహరించాడు .రఘు వీరచరిత 11 అధ్యాయం 75 వ శ్లోకం పై వ్యాఖ్యానిస్తూ రామాయణం లోని అయిదు శ్లోకాలలు వరుసగా పేర్కొన్నాడు –-‘’తే గావా పర్వతం రామ కైలాసం దాతు మండితం –అగ్ని౦ నియోజన మాసుః పుత్రార్ధం సవా దేవతాః .మహా భారతం నుండి కూడా చాలా శ్లోకాలను ఇంద్రుని ఆయుధ సంపత్తి పై పేర్కొన్నాడు .రఘువీర చరితం 11-42 పై వ్యాఖ్యానిస్తూ మహా భారతం లోని –‘’బాహుం సవజ్రం శక్రస్య క్రుద్దాస్య స్త౦భయతు ప్రభుః’’
మల్లినాధుని పురాణ పాండిత్యానికి ముగ్దులవుతాం .వాటినుంచి విస్తృతంగా ఉదాహరణ లిస్తాడు .కుమార సంభవం 4-41 శ్లోకం పై వ్యాఖ్యానిస్తూ’’ బ్రహ్మ పురాణ౦’’ నుంచి హిమాలయ పర్వత ఉత్పత్తిని ఉటంకి౦చాడు-‘’యజ్ఞార్ధం హి మయా సృస్టో హిమవానచలేశ్వరః .’’శివ పార్వతులు ఒకరికొకరు విడరాని బాంధవ్యం ఉన్నవారని చెప్పటానికి సాక్ష్యం గా ‘’వాయు పురాణం ‘’లోని –‘’శబ్ద జాత మశేషం తు ధత్తే శర్వస్య వల్లభా –అర్ధ రూపం యధాఖిలం ధత్తే ముగ్దేందు శేఖరః ‘’శ్లోకాన్ని ఉదాహరించాడు .అలాగే ‘’త్వస్ట’’ సూర్యుని ప్రకాశాన్ని తగ్గించటానికి అతన్ని పదును పెట్టె యంత్రం పై సాన పట్టాడన్న విషయాన్ని’’మార్కండేయ పురాణం ‘’నుంచి -విశ్వ కర్మాత్వనుజ్ఞాతః శాకదీయే వివస్వతా –భ్రమ మారేష్య తత్తేజః శతనాయోపచకమే ‘’శ్లోకాన్ని చెప్పాడు .ఒక్కొక్క సారి మల్లినాధుడు పురాణ కధలను సూటిగా ఉదాహరించాకుండానే తెలియ జేశాడు .స్కందుని నివాసం’’ దేవ గిరి ‘’అని మాఘ కావ్య వ్యాఖలో చెప్పాడు .
క్రౌంచ పర్వతం బ్రద్దలైన విషయాన్ని సూరి తెలియ జేశాడు కాని అది ఏ పురాణం లో ఉందొ చెప్పలేదు –‘’పురా కిల –‘’భ్రుగు నందనేన స్కంధస్య స్పర్ధయా క్రౌ౦చాశిఖ రిణామతి నిశితా విశిఖ ముఖేన –హేలయా మృత్పిండ భేదం భిత్వా తత్ ఏవ క్రౌంచ కోపాదేవ సాధ్యః మముజ్జ్హ్రుం భితే కస్మిన్నపి యశః క్షీరనిదౌ నిర్విలమపి జగజ్జాల మాప్లావితి తామితికదా శ్రూయతే ‘’.మరో సందర్భం లో రావణుడు తన తలలో 9 తలలను శివునికి అర్పించడాన్న దానిని శిశుపాల వధ ,ఉత్తరరామ చరిత వ్యాఖ్యలలో పురాణ గాధను తెలియ జెప్పాడు –‘’పురా కిల –రావణః కామ్యే కర్మణి పశుపతి ప్రాణనాధ నవ శిరస్యగ్నౌ హుత్వా దశ మారంభే సంతుస్టాంతస్మాత్ కైలాసాది పత్యం వప్రే ‘’.మల్లినాధుడు కనీసం రెండు సార్లుశివుని స్థానం లో బ్రహ్మనియమింప బడినట్లు తెలియ జేసే పురాణ గాధలను తెలిపాడు కాని యేపురాణంలోనిదో చెప్పలేదు –1-‘’పురా కిల –‘’భగవాన్ దూర్జటిః బాణ ప్రేమ్ణా బాణాభిధానం హరి మభి యుజ్య నిర్జత్ ఇతి పౌరాణిక వదంతి .
2-పురాకిల –‘’భగవాన్ సత్యభామా ప్రీతయే బలాదింద్ర లోకదపహృత్య పారిజాత౦ నిజ గృహ ద్వారే పితావానితి కధానాను సందేయా ‘’
ఈవిధంగా మల్లినాధుని పురాణం గాధలన్నీ కరతలామలకం అని స్పష్ట మౌతోంది .వీటిని గురించి చెప్పేటప్పుడు ‘’పోరాణికం’’అని ‘’కదా ‘’అనే మాటలు ,లేక వాటికి సమానార్ధమిచ్చే బహుళ ప్రచారం లో ఉన్న పదాలు వాడాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-16-ఉయ్యూరు

