బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా
పెద్ద నోట్ల రద్దుతో బుర్రతిరిగి మైండ్ బ్లాంకై
బ్యాంకుల వద్ద నల్ల కుబేరులు క్యూలు కట్టి
నల్లదనం వదిలించు కొంటారని ఆశపడితే
బంకుల్లోనే ఉండి పోయి వెక్కి రిస్తూ నల్లమాలచ్చి
బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అని పాడుతోంది .
‘’నల్ల’’వారి బదులు వేతనజీవులైన ‘’తెల్లకాలర్ ‘’వాళ్ళు
‘’కాలర్లెస్’’మాత్రమేకాక బడుగు జీవులే బ్యాంకుల వద్ద
పడిగాపులు పడుతూ కష్టార్జితమైన తెల్ల సొమ్మునే
హడావిడిగా భద్ర పరచుకొంటున్నారే తప్ప
నల్లదనం బయటికే రాలేదింకా
పైగా ఫిఫ్టీ ,సెవెంటీ పెర్సెంట్ అంటూ ఊరింపు
మధ్యలో దళారీలు ,అప్పుడే దొంగానోట్లూ వచ్చి వాలిపోతుంటే
బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అంటూ నం. పా.సా .పాట పాడుతున్నాడు .
క్రమశిక్షణ గల మన సైన్యం పాక్ పై
సర్జికల్ ఆపరేషన్ చేసి విజయవంతమైంది
ఆర్ధిక క్రమ శిక్షణ లేని దేశం లో అరాచక
అస్తవ్యస్త పరిస్థితి ఇన్నేళ్ళుగా రాజ్యమేలుతుంటే
స్వచ్చ భారత్ అంటూ ఫోటోలకోసం
పోజు లిచ్చే నాయక గణం భజనే తప్ప
క్రియా శూన్యమై నోరు వెళ్ళ బెడుతుంటే
చేస్ట లుడిగి యెన్ ఫోర్స్ మెంట్ కాడి పారేస్తుంటే
ప్రభుత్వాన్ని శాసించేది ‘’మనీ డాన్ ‘’లేనని అర్ధమై
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ died చందమై
సంస్కరణ చట్టు బండలై వెక్కి రిస్తుంటే
ప్రజావస్తను చూసి ఈ వ్యవస్థ జాలితో పాడుతోంది
బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అంటూ వెక్కిరింపుగా
.
నిన్న రాసిన ‘’మోతాదు మించిన మోదుడు’’కవిత చదివి స్పందించిన శ్రీ మైనేని గోపాలకృష్ణగారు (అమెరికా )’’బోల్తా కొట్టి౦దిలే మోడీ పిట్టా’’అంటూ పాతపాటను జ్ఞాపకం చేస్తూ కామెంట్ రాశారు. అదే శీర్షికగా నేను ఈ కవిత రాసినందుకు శ్రీమైనేని వారికి కృతజ్ఞతలతో –
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-12-16 –ఉయ్యూరు

