గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం )
3-బాలికా పంచాశికా –
ఇది కూడా 53 ముక్తకాలవంటి శ్లోకాలున్న లఘుకావ్యం .సమాజ స్వరూప చిత్రణలో ఆమె విశ్వ రూపం చూడవచ్చు .చివరి పంక్తి ‘’యఏతజ్జానీహి బాలికే ‘’(బాలా ఇది తెలుసుకో )అనే మకుటం .ఉద్వేగం ఉత్సాహం అన్యాయాన్ని సహించలేని స్థితి ఇందులో ఉన్నాయి .దీనికీ నాగరలిపి ,తెలుగు లిపి లో శ్లోకాలు, ఆంగ్లం లో వారమ్మాయి శ్రీమతి లలితా సుభాషిణి చక్కనిఅనువాదం ,కృతీ స్వీకర్త డా .రామానుజా చార్యులవారే స్వయం గా చేసిన తెలుగు అనువాదం ఉన్నాయి .ఈ కావ్యాన్ని కేవలం 24 గంటల వ్యవధిలో రాసినట్లు ప్రభావతీ దేవి గారు చెప్పుకున్నారు .
ముందుగా తన గురు దేవులకు ‘’సుబ్రహ్మణ్య సమారంభాం శ్రీ రామ స్వామి మాధ్యమాం-భీమ సేన నృసి౦హా౦ తాం వందే గురు పరంపరం ‘’అంటూ భక్త్య౦జలి ఘటించారు .
మొదటి శ్లోకం లోనే పెద్ద బాంబే పేల్చేశారు –‘’నాస్తి మాతృ సమా దేవీ –నాస్తి భ ర్త్రుసమో యమః –నాస్తి సుహ్రుత్సమో బన్ధుః- ఏతజ్జానీ హి బాలికే ‘’
భావం –అమ్మకు సాటి దైవం లేదు భర్తకు సాటి యముడూ –‘’లేడు ,మిత్రుని వంటి బంధువూ లేడు.లోకంపోకడ తెలుసుకో బాలికా .
6 వ శ్లోక౦ –‘’పుత్రక్షేమార్ధినీ మాతా –సుఖం త్యజతి సర్వదా –భ్రుశం స్నిహ్యత్య మూన్ దృష్ట్వా – ఏతజ్జానీ హి బాలికా
భావం –పిల్లల సుఖం కోసం తన సుఖాన్ని త్యాగం చేసి బిడ్డ సంపూర్ణ -తుస్టి కి ఆనందించే అమ్మ సంగతి తెలుసుకో బాలికా
9-‘’యత యోపి భవా పేతాః-జననీం చానమన్-అకుర్వన్ మృత సంస్కారాన్ —‘’
భావం –బంధ విముక్తులైన సన్యాసులు కూడా అమ్మప్రేమకు దాసోహమై ,ఆమెకు మృత సంస్కారాలు చేశారు –అలాంటి అమ్మ స్థానం తెలుసుకో అంటూ శంకరా చార్య వృత్తాంతాన్ని పరోక్షంగా చెప్పారు .
16-‘’ జన్మ దత్వా పిత పుత్రాన్ –యది నా వేక్షతే తదా –మృత తుల్యోహి స జ్ఞేయః –‘’
భావం –పిల్లల్ని కనగానే కాదు ,ప్రేమగా పెంచినవాడే తండ్రి –కానప్పుడు చచ్చినవాడితో సమానం అని లోక ప్రవృత్తిని చూపారు .
20-అంగా దంగా త్సుతో జాత –ఇతీదం వచనం పితా –యది నాద్రియతే తంతు –‘’
భావం –పుత్రుని గాఢా శ్లేషణం తో పులకించని తండ్రిమృతప్రాయుడే అంటూ శాకుంతలం లో శకుంతల దుష్యంతుని తో అన్నమాటల భావాన్ని పొందు పరచారు (పుత్ర గాత్ర పరిష్వంగ సుఖమ్ము మేలు )
22-‘’చాతుర్వర్ణ్యం మయా సృస్ట –మితీదం తు హరేర్వచః –అదృశ్వోయుజ్యతే నైవ —‘’
భావం –నాలుగే కులాలనునాడు కృష్ణుడు చెబితే నేడు నాలుగు వందలై నాయి .అందుకే కులం ఒక చీడపురుగు
25- ‘’ఉద్యోగ పాఠశాలాసు –సర్వత్రాసన రక్షణం –తేన విజ్నో విన స్టార్ధః—‘’
భావం –ఉద్యోగం విద్యార్జన లలో రిజర్వేషన్ల వలన తెలివి తేటలకు స్థానం లేదు .
30-‘’విరుద్ధ వచనైః క్రుత్యైః-యో హితం స హరిణా తుల్యః —
భావం –సమ్మెలు ,ధర్నాలు చేస్తూ సామాన్యుని చంపే వైద్యుడు శ్రీహరి తో యెట్లా సమానమౌతాడని ప్రశ్నించారు –వైద్యో నారాయణోహరిఃఅన్నదానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ‘’’’హరీ’’, ‘’మని’’ అనిపిస్తున్నారు ‘’అని భావం .
35 –కామ క్రోధ జనిశ్చాయం –ఈర్ష్యా దాస్య సహోదరీ –గూఢ హాని కరో హ్యేషః—‘’
భావం –‘’బాధ’’ గురువు తలిదండ్రులు కామక్రోధాలు .సోదరి ఈర్ష్య .గూఢ హాని వ్రుత్తి ‘’అని బోధగురువులకంటే బాధ గురువులెక్కువై చేటు తెస్తున్నారని జ్ఞానోదయం చేశారు .అలాగే ఉపదేశ ధర్మం వదిలేసి సమదృష్టి లేక పక్షపాత దృష్టి తో ఉన్న వాడే నేటి గురువుగా చలామణి లో ఉన్నాడని మరో శ్లోకం లో దెప్పారు .మరో దానిలో డబ్బూ’’ పొగడ్తల డప్పూ’’లతో శిష్యుడు గురువును కొనేస్తున్నాడు ,గురువూ శిష్య వశుడై పోతున్నాడని ఆవేదన చెందారు .
40-‘’పాశ్చాత్య వనితాః దృష్ట్వా –అస్మన్నాగరకాధమాః-లజ్జా హీనాశ్చ బాదంతే—‘’
భావం –పాశ్చాత్య దేశాల నుండి వచ్చే స్త్రీ పురుష యాత్రికులను లజ్జా హీనులైన మన పౌరులు బాదిస్తున్నారని ‘’మూర్ఖాః’’అనే ఈకవితలో ఆవేదన చెందారు .అందుకే వారు మనదేశానికి రావటం తగ్గించేశారు అని మరో కవిత చెప్పారు .దీనికే కొనసాగింపుగా –
44 –శ్లోకం –విదేశీ యేష్విదం కృత్యం –విదిత్వా దోష సంయుతం –పరాభవాన త ముఖాః—‘’
భావం –విదేశీయులను ఈ విధంగా మన వారు అవమానిస్తుంటే మన నాయకులు తల ది౦చు కొంటున్నారు అమ్మాయీ తెలుసుకో .
4 5 –‘’హిందూ ధర్మస్య రక్షార్ధం –యతనీయం వివేకిభిః-తద్వినాశే జగన్నాశః –‘’
భావం –హిందూ ధర్మాన్ని అందరూ కలిసి రక్షించాలి .అది నశిస్తే జగత్తే నశిస్తుంది అని తెలుసుకోవాలి .
అనైక మత్యం మన స్వంతం ,అమర్యాద మనరాజ్యం స్వమతా క్షేపం మన నైజం అయింది మన లక్షణమేమితో తెలుసుకో .అని మరో శ్లోకం లో ఎరుక కలిగించారు
4 9-శ్లోకం –‘’మంత్రేషు పరి వాదాశ్చ –వేదానామవమాననా –అస్మాకం తు స్వభావోహి –స్వభావో దురతిక్రమః ‘’
భావం –మంత్రాలను వెక్కిరించటం, వేదాలను అవమానించటం ,మనందరి స్వభావ మై పోయింది .దాన్ని దాటి రావాలి
53-చివరి శ్లోకం –‘’ప్రభుత్వంరక్షక భటః –న్యాయాదీ శ్చ భూమిపాః-ధర్మ౦ సర్వే పి రక్షంతు –నైకో పి స్యాదధర్మగః ‘’
భావం –అధర్మం నశించి ప్రభుత్వ రక్షక భటులు న్యాయాదీసులు ,అధికారులు అందరూ ధర్మాన్ని రక్షించాలని అంటూ ముగించారు .’’ధర్మో రక్షతి రక్షితః ‘’అన్న ఆర్యోక్తిని గుర్తుకు తెచ్చారు .
‘’ సంస్కృతం లో ఆదర్శ వాదం తో కూడిన స్త్రీ వాదసాహిత్యంలేని లోటును ప్రభావతీ దేవి పూరించి పురుషాధిక్య సమాజానికి సవాల్ విసిరారు’’అని శ్రీ బండారు దత్తాత్రేయ గారు రాసిన ముందు మాటలు నూటికి నూరు పాళ్ళు యదార్ధం .ఆధునిక భావాలకు నిలువెత్తు స్వరూపంగా దేవి భాసి౦చారు .
4- చివరి పుస్తకం-శశిరేఖా పరిణయం అనే 3 అంకాల రూపకం –
దీని పై స్పందించిన డా శివనూరి విశ్వనాధ శర్మగారు సంస్కృతం లో దేవిగారికి ఆశీరభినందనలు రాసి చివరగా
‘’శశి రేఖా విజయాఖ్య౦ రూపకమేవ తత్ప్రభావతీ దేవ్యా –రచితం రమణీయ తయా ప్రహసనమిహ రాజతాం సతం ‘’ అని మెచ్చుకొన్నారు .దీన్ని ప్రహసనం అన్నారు .
ఆమె బోధ గురువు డా బి నరసింహా చార్య ఆంగ్లం లో ;;శ్రీ ‘’అనే పేరుతొ ముందుమాట రాశారు . సంస్కృత రూపకం సమాజాన్ని చిత్రిస్తుందని ,ఇది దశ రూపకాలలో నాటిక విభాగానికి చెందినదని ,నాయిక శశిరేఖకు ఇందులో ప్రాధాన్యం ఉండటమే ఈ పేరు కు తగినదని ,ఇది విడంబన తరహా రూపకమని ,ఇందులో శశి రేఖ తో పాటు నారదుడు,విలేపన ,అజ్ఞానం అనే పాత్రలున్నాయని ,త్రిమూర్తులు సెల్ ఫోన్ లో సంభాషి౦చుకొంటారని ,ఈ రూపకం దేవి గారి సృజన అని ,ఇందులో వైదర్భి శైలి ఉందని ,హీరోయిన్ శశిరేఖా మూడులోకాలూ తిరిగి త్రిమూర్తులతో సహా అందరినీ ప్రశ్నలతో వేధించి ,తన లక్ష్య సాధనకు ధర్నాలు సమ్మెలు చేస్తుందని కనుక ఈ రూపకం సంప్రదాయ బద్ధమై కొత్త విషయానికి ఆధారమైనదని ఇందులో సమాజ క్షేమమే ముఖ్యమని రుజువు చేసిందని ,రచన సరళ సుందరం గా పాత్రోచితంగా జరిగిందని ,కద ప్లాట్ రచయిత్రి స్వంతమని ,,ఇందులో అద్భుత రసం చిప్పిలిందని సెంటిమెంట్ కు ప్రాదాన్యముందని ,యూనిటీ ఆఫ్ యాక్షన్,ప్లేస్ ,టైం ఉందని ,కాని కృత్రిమంగా ఉందని పించిందని అయినా హాయిగా చూసి చదివి ఆనందించ దగ్గ లక్షణం ఉందని ప్రేక్షకుల హృదయాలలోకి సూటిగా దూసుకు పోయే లక్షణం దీనిలో ఉందని ఫెమినిజం పై రచయిత్రి కున్న అభిమానం అంతస్రవంతిలా సాగటం గుర్తించాలని అణగ తొక్క బడిన వారి పక్షాన నిలి వారికి సానుభూతి చూపించటం హర్షించదగినదని సుప్రభాతాలతో మొదలైన దేవి సంస్కృత సాహిత్య యాత్ర అనేక దశలలో విస్తరిల్లి మహాకావ్య నిర్మాతగా వర్ధిల్లిందని కీర్తించారు .డా ఎస్ జి రామానుజా చార్యులు ఆమెను ‘’చైతన్య స్పూర్తి ‘’అని ఆశీర్వ దించారు . పుస్తకం లో ఈ రూపకానికి తెలుగు అనువాదమూ ఉండటం తో అందులోని భావం అందరూ గ్రహించే వీలు కలిగింది .చివరగా ప్రభావతీ దేవిగారి మనోభావం 54 వ శ్లోకం లో చక్కగా వివరించారు .మొత్తం రూపకం లో సంభాషణలే కాక 5 4 శ్లోకాలున్నాయి .అవీ సందర్భోచితంగా అమరాయి .
‘’న భవతు మత యుద్దో మాస్తు శాఠ్య ప్రకోపకః –న భవతు నర మేధో శ్రున్మాతిర్మస్తునృపాం
భావతువిమాలి చిత్తః సర్వదా తోష దాయీ –సకల సుజన మిత్రం ధర్మ వ్రుత్తోస్తు రాజా ‘’
భావం –మత యుద్ధాలు జరుగ కూడదు తీవ్రవాదం ప్రకోపించరాదు .నరమేధం జరగ రాదు .ఆకలి చావులు ఉండకూడదు .పాలకులు నిర్మల మనసుతో ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తూ అందరికి మిత్రులై ధర్మ చరితులై నడుచుకోవాలి .ఇదీ ఆమె ఈ రూపకం లో కోరుకొన్న ఉన్నత భావ లహరి .అలా జరగాలని జరుగుతుందని ఆశిద్దాం .
గొప్ప ప్రతిభా ,కవితా సామర్ధ్యం, ఊహ ,వర్ణన నైపుణ్యం .,సంస్కృతాంధ్ర సాహిత్యాలలో లోతైన అవగాహనా ,పురాణ వేద శాస్త్రాలలో నిష్ణాతృత్వం ఉన్న శ్రీమతి ప్రభావతీ దేవిగారు శాశ్వత కావ్యం ఆధునికభావాలతో సంప్రదాయంగా రచించి వాసి కెక్కాలని కోరుతున్నాను .వారిని ఈ తరానికి పరిచయం చేయటం నాధర్మగా అదృష్టంగా భావిస్తున్నాను .
‘’కవితా కన్యక గుణములు కవికన్న రసజ్నుడెరుగు కవి ఏమెరుగున్ –భువిలో కన్యక గుణములు ధవుడెరుగును కాక కన్న తండ్రే మెరుగున్’’అన్న పద్యాన్ని తన ‘’నామాట ‘’లో కోట్ చేసి, రసజ్ఞులు తన కావ్యాలను చదివి ఆన౦దిస్తే తాను ఆనందంగా మరో కావ్యారంభం చేస్తానన్నారు ప్రభావతీ దేవి .శుభం భూయాత్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-1-17 –ఉయ్యూరు

