గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 )
కలకత్తా కన్జర్వేటివ్ హిందూ సంఘనాయకుడు ,మహా సంస్కృత విద్వాంసుడు రాదా కాంత దేవ్ మహా రాజా నవ కృష్ణ దేవ్ పెంపుడు కుమారుడూ ,రాజ్యానికి వారసుడు .సంస్కృత ,పర్షియన్ అరబిక్ భాషలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు .’’శబ్ద కల్పద్రుమ ‘’అనే సంస్కృత-సంస్కృత నిఘంటువును కూర్చినవాడు రాధాకాంత దేవ్ .దీని టాగూర్ వంశానికి చెందిన హర కుమార్ టాగూర్ అనే మరో ప్రసద్ధ సంస్కృత విద్వాంసుడు సహాయకారిగా ఉన్నాడు .ఈశ్వర చంద్ర గుప్త గారి పత్రిక ‘’సంబద్ ప్రభాకర్ ‘’లో దేవ్ చాలా ప్రయోజనాత్మకమైన వ్యాసాలు రాశాడు .హిందువులు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ,బాలికలకూ విద్య చాలావసరమని ప్రచారం చేశాడు .ఇన్ని మంచి భావాలున్నా దేవ్ సనాతన సంప్రదాయవాది .సతీ సహగమనం వాళ్ళ వంశం లో లేక పోయినా ప్రభుత్వం దాన్ని నిషేధించాలని ప్రయత్నించినపుడు వ్యతిరేకించాడు .లార్డ్ విలియం బెంటిక్ బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు 1829 డిసెంబర్ లో ఒక రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా సతీ సహగమనాన్ని రద్దు చేసినపుడు దేవ్ తనతోటి ఇతర సనాతన హిందువులతోకలిసి తండ్రి గోపీ మోహన దేవ్ స్థాపించిన ‘’ధర్మ సభ సంస్థ ‘’ద్వారా వ్యతిరేక ప్రదర్శనలు చేసి గవర్నర్ జనరల్ కు నిషేధ అజ్ఞను రద్దు చేయమని విజ్ఞాపన పత్రం సమర్పించాడు .8 3 ఏళ్ళు జీవించిన రాధా కాంత దేవ్ 1867 లో మరణించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-17 –ఉయ్యూరు

