గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 )
20-10-1956 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోజన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ ,బెనారస్ విశ్వ విద్యాలయం నుంఛి సోషియాలజీ లో ఎం .ఏ .తోపాటు సాహిత్యాచార్య ,ఆచార్య డిగ్రీలను లింగ్విస్టిక్స్ లో సంపూర్ణానంద్ సంస్కృత కాలేజి నుంచి అందుకున్నాడు .అదేయూని వర్సిటి నుండి పి.హెచ్ .డి.,డి.లిట్ లూ పొందాడు .సంపూర్ణానంద యూని వర్సిటి లో ఆధునిక భాషా శాఖలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ గా చేరి ,అందులోని యోగ సాధనా కేంద్ర ,శంకరాచార్య మండప్ లకు డిప్యూటీ డైరెక్టర్ గా పని చేశాడు .ఎందరో విద్యార్ధులకు రిసెర్చ్ గైడ్ గా వ్యవహరించి పరిశోధనలకు సహకరించాడు .
బౌద్ధ దర్శన మీమాంస ,చిత్ర చంపూ కావ్యస్య ససమీక్షణం సంపాదనం ,సంస్కృత ధ్వని విజ్ఞానం ,కావ్య శాస్త్రీయ పారిభాషిక్ శబ్దో౦కి నిరుక్తి (హిందీ )మొదలైన గ్రంధాలు రచించాడు ద్వివేది .ఆకాశవాణికి వార్తా సంపాదకుడిగా ,రాష్ట్రీయ ,మీర్జాపూర్ శ్రీ వేణీమాధవ పూర్ ట్రస్ట్ కు ట్రస్టీ గా ,కాశీ విశ్వేశ్వర దేవాలయ ఆచార్యునిగా ఉన్నాడు . జనవార్త హిందీ దైనిక్ పత్రికకు వారణాసి విలేకరిగా,రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ క్రమ శిక్షణ కమిటీ మెంబర్ గా సేవ చేశాడు .ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్చభారత్ అభియాన్ కు ప్రచారకుడిగా కమిటీ మెంబర్ గా ఉన్నాడు .
విద్యా ప్రాభవానికి తగిన పురస్కారాలు బిరుదులూ ద్వివేదీ అందుకున్నాడు .కేరళ ప్రజ్హాస్సి రాజా చారిటబుల్ ట్రస్ట్ ‘’ఆచార్య రత్న ‘’బిరుదునిచ్చి సన్మానించింది .చత్రపతి శివాజీ సమ్మాన్ ‘’వేద పండిత పురస్కారం ‘’అంద జేసింది .20 11 లో ‘’కాశీ గౌరవ అలంకార్ ‘’లభించింది .అదే ఏడాది భారత ప్రభుత్వం శ్రీ దేవీ ప్రసాద్ ద్వివేదీ కి ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందజేసి గౌరవించి సత్కరించింది.

