గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 )
2-1-1947 న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించిన రహస్ బిహారీ ద్వివేది సంస్కృతం లో ఆచార్య (ఎం.ఏ .)సాహిత్య రత్న ,ఎం .లిట్ డిగ్రీలు పొందాడు .1960లో వచ్చినసంస్కృత ఇతిహాస పద్యాల (ఎపిక్ పోయెమ్స్ )పై పరిశోధన చేసి జబల్పూర్ రాణి దుర్గావతి యూని వర్సిటి నుండి 1977లో పి హెచ్ డి.అందుకొన్నాడు .తరువాత జబల్ పూర్ యూని వర్సిటి లో సంస్కృత ఆచార్యునిగా చేరి ,తన సర్వీస్ కాలం లో 16 మందికి డాక్టోరల్ డిగ్రీ సాధించటానికి మార్గ దర్శకం వహించాడు .విద్యా తృష్ణ తీరక’’ విద్యా వాచస్పతి ‘’ డిగ్రీని కూడా అందుకొన్నాడు .
సంస్కృత ,హిందీ ,ఇంగ్లీష్ భాషలలో చాలా గ్రంధాలు రాశాడు .వివిధ అంశాలపై 50 కి పైగా పరిశోధనా పత్రాలను రచించాడు .ముఖ్యమైన రచనలు -1-సంస్కృత మహాకావ్యోం కా సమలోచానాత్మక్ అధ్యయన్(१९६१-१९७०)అంటే 7 వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై విశ్లేషణాత్మక పరిశోధన 2-పి హెచ్ డికోసం రాసిన దిసీస్ ‘’1947-1970 కాలం లోని సంస్కృత ఇతిహాసపద్యాలు’’లో 156 శ్లోకాలను ఉదాహరించాడు .3-అర్వాచీన సంస్కృత మహాకావ్యాను శీలనం .అంటే ఆధునిక సంస్కృత ఇతిహాసాల సమీక్ష అనే 134 పేజీల రచన 4-సాహిత్య విమర్శ (రిసెర్చ్ పత్రాల సంపుటి )5-స్వస్తి సందేశ్ 6-స్వరిత సందేశ్ 7-సంస్కృత వాణి మయే విజ్ఞాన్8-తీర్ధ భారతం (భారతీయ యాత్రా స్థలాలపై కవిత్వం )
రహస బిహారీ ద్వివేది కి 2012 లోసంస్కృత సేవకు భారత రాస్ట్రపతి గౌరవ పురస్కారం అందజేశారు .2016 లో ఉత్తర ప్రదేశ్ సంస్కృత సంస్థాన్ ‘’వాల్మీకి పురస్కారం ‘’అందజేసి సత్కరించింది .
సశేషం
రేపు 8-1-17 ఆదివారం ముక్కోటి (వైకుంఠ ఏకాదశి )ఏకాదశి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-17 –ఉయ్యూరు

