గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య
1893 లో కర్నాటక రాష్ట్రం లో బిజాపూర్ జిల్లా లో కృష్ణానదీ తీరాన ఉన్న గలగలి గ్రామం లో రామాచార్య జన్మించాడు .సంస్కృతం లో మహా పండితుడు . రెండు మహాకావ్యాలు రాసిన మహాకవి .1981 లో 88 వ ఏట మరణించాడు .ఆయన గురుపరంపర –గలగలి కూర్మాచార్య, కృష్ణా కార్య ,సత్యధ్యానతీర్ధ స్వామీజీ .
రామాచార్య 1-యదు వంశ మహాకావ్యం 2-స్వరాజ్య రాత్నాకరః అనే రెండు మహాకావ్యాలను రచించాడు ఈ రెండూ కాక దేవీ వాసంతి ,కోహం అనే గద్య రచనలు చేశాడు .లఘుకావ్యాలుగా 1- దేవ మందిర క్రందనం 2-ముని-మేనక సంవాదః రచించాడు .పాహిమాం మురళీధర ,వెంకటేశశతకం గీతాలను ‘’సతి చింతామణి ‘’అనే సంస్కృత నవలను రాశాడు .కృష్ణకవి రాసిన అలంకార ముక్తావళి ,సత్యనాద తీర్ధ రచించిన రుగ్ భాష్య టీకా ప్రకాశ ,నరహరి తీర్ధ రచన యమక భారత టీకా ,పద్మనాభ తీర్ధుని శ్రీ గీతా తాత్పర్య నిర్ణయ ప్రకాశిక ,ఆనంద తీర్ధుని ఆహ్నిక కౌస్తుభ మొదలైన గ్రంధాలకు సంపాదకుడిగా పని చేశాడు .
ప్రయాగలోని భారతీయ సంస్కృత సంస్థాన పరిషత్ రామా చార్యకు ‘’మహా మహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరిస్తే,ఎడిటోరియల్ బోర్డ్ ఆఫ్ సంస్కృతం ‘’సాహిత్య రత్న ‘’ను,సనాతన ధర్మ మండలి ‘’అభినవ బాణ ‘’ను,అఖిల భారత సాహిత్య సమ్మేళనం లో ‘’కవికుల తిలక’’బిరుదు నిచ్చి సన్మానించాయి .సంస్కృత సేవకు రామాచార్య రాష్ట్రపతి పురస్కారాన్నీ అందుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-17 –ఉయ్యూరు

