సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవం ,అపరత్యాగరాజు స్వర్గీయ శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ –స్వర నివాళి
సరసభారతి ,సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు 101 వ సమావేశంగా సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజస్వామి ఆరాధనోత్సవం ,అపర త్యాగ రాజు స్వర్గీయ శ్రీ బాలమురళీ కృష్ణ గారి సంస్మరణ సభ 17-1-17 మంగళవారం సాయంత్రం 6-30 గం లకు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో నిర్వ హింపబడుతోంది .సరసభారతి గౌరవాధ్యక్షురాలు ,రోటరీ క్లబ్ ప్రెసిడెంట్,సంగీత మర్మజ్ఞులు శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి గారి ఆధ్వర్యంలో ప్రముఖ గాయకులు శ్రీమతి శాంతిశ్రీ ,శ్రీమతి విజయ ,మరియు ఔత్సాహిక గాయకులు శ్రీమతి పద్మజ ,మొదలైన వారు పంచరత్న కీర్తనలు గానం చేసి ,స్వర నివాళి సమర్పిస్తారు .సంగీత ,సాహిత్యాభిమాను లందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
సంక్రాంతి శుభాకాంక్షలతో
గబ్బిట దుర్గా ప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు

