ఎర్ర నాయుడు గారికి ఈ group లో గల తెలుగు బాంధవులకు, మేధావులందరికి నమస్కారం. తెలుగు తీరైన భాష. పలకడం తేలిక. కేవలం పెదాలు, నాలుక ఉపయోగించి దాదాపుగ అన్ని పదాలు పలకొచ్చు. ముక్కు, చెవులు, నాభి నుండి ఊపిరి మొదలైన వాట్ని ఉపయోగించి అధిక శక్తి నుపయోగించ నవసరం లేకుండ పలకొచ్చు. ఉదాహరణకు “ష” అనే పలుకుకు ఇంగ్లీష్ special,ocean,patient, shall, shunt, shirt ,mission, machine లో ఎన్ని spellings ఉన్నాయో గమనించండి. అలాగే “పంతులు” అనే పదం తమిళంలో రాస్తే “బంతులు” “పందులు” “బందులు” “పంతులు” అని 4 రకాలుగ చదవచ్చు. భాషే కాకుండ తెలుగు లిపి కూడ తెలివిగ రూపొందించబడిందని అనిపిస్తుంది.
ఉదాహరణకు అన్ని గుడి అక్షరాలకు వలె “యి”కి గుడి గుర్తు ఉండదు. ఒక వేళ గుడి గుర్తు ఉంటే “య” లో ని సున్న పొరబాటున చిన్నదిగ రాస్తే “మి” అని చది వే అవకాశం ఉంది. బహుశా అందుకని గుడి తీసి వేసి ఉంటారు. కన్నడ లో ఇప్పటికీ వారు “యి” కి వాడతారు. అలాగే “ద-ధ” “ప-ఫ” వంటి కొన్ని అల్ప, మహా ప్రాణులకు ఏక రూపాక్షరాలుంటాయి. ఐతే “బ-భ” లలో “బ” తలకట్టుండదు.ఒక వేళ తలకట్టుంటే కొద్ది తేడాతో (రాతలో)”చ” గ పొరబడే అవకాశముంది. అలాగే “మనయవరలకత”లకు మాత్రమే ఒత్తు అక్షరాలు వేరుగ ఉంటాయి. మిగిలిన వాటికి తలకట్టు రహిత అక్షరాలనే ఒత్తు అక్షరాలుగ ఉన్నాయి.ఎందుకంటే వాడుకలో 80%—90% ద్విత్వ, సంయుక్తాక్షరాలు ఈ అక్షరాలలోనే ఉంటాయి. అంటే ఎక్కువగా పునరావృతమయ్యే ఒత్తక్షరాలకు అక్షరమంతా రాసి సమయంవృథా చేయకుండు నట్లు లిపి రూపకల్పన జరిగినట్లుగ మనం భావించవచ్చు. అలాగే మీరు జాగ్రత్తగ గమనించండి గుణింతాలకు ఉపయోగించే అచ్చుల గుర్తులన్నీ కూడ ఆ అచ్చులలోనే నిబిడీకృతమై ఉన్నాయి. ఈ మెయిల్ కింద పొందుపరిచిన చార్టును గమనించండి మీకే అర్థం ఔతుంది. ఈ ప్రక్రియ మనకు తెలిసిన( తమిళ, కన్నడ, మళయాళ, హిందీ) భాషలలో కనబడదు. మన తెలుగు లోనే కనబడుతుంది. కేవలం మనతెలుగే కాకుండ ఏ ఇతర భాషలనైన తేలికగ నేర్చుకొనే వెసులుబాటుతో లిపి రూపకల్పన జరిగిందని కొందరంటారు. విశ్వభాషగ పరిగణింపబడే సంస్క ృతం కంప్యూటర్ భాష అనువైనదిగ చెబుతారు. మరి అలాంటి సంస్క ృత భాష అక్షరాలకంటే కూడ ఇంకా ఎక్కువ మన తెలుగులో ఉన్నాయంటారు. అందుకే గాబోలు తెలుగు వాడు ప్రపంచంలోని ఏ భాషనైనా సులభంగా నేర్చు కొని వారిలాగే పలకగలుగుతున్నాడనిపిస్తుంది.
ఇన్ని విశిష్ఠతలున్న మనతెలుగు భాషను మన చిన్నారులకు నేర్పలేక పోతున్నామంటే నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. తప్పుల్లేకుండ ప్రశ్నపత్రాన్నే రూపొందించుకోలేక పోతున్న మనం టెక్స్ట్ బుక్ప్ నెలా రూపొందించుకొంటాం. కాకపోతే ఉద్యోగార్థులు ప్రశ్నలకు సమాధానాలు రాస్తారు కాబట్టి తప్పులు దొరుకుతున్నాయి. మరి టెక్స్ట బుక్సో. మరి అదే పిల్లలు మూగజీవాల్లా బలైపోతున్నారు. అసలైన మేధావులు అడుగున ఉండి పోయి సూడో మేధావులు అందలెక్కడం వలననే ఇలాంటి పాట్లు జరుగుతున్నాయి.ఒకటో తరగతి తెలుగు వాచకం మీకు అందుబాటులో ఉంటే ఒక సారి చూడండి. “ఇ” వేరు దాని గుణింతపు గుర్తు గుడి(ం) వేరన్నట్లుగ ముందు గుడి(ం)మీద తరువాత “ఇ”మీదపాఠాలు రూపొందించారు. రెండవ తరగతిలోనే గుణింత సహిత సంయుక్తాక్షర ప్రక్రియ ఒక తంతులా పూర్తి చేశారు. మూడో తరగతి చివరగాని ఆ ప్రక్రియ అర్థం కాదు.ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వయోజన శాఖ వారు రూపొందించిన “చదువుకొందాం-1 & 2” చూడండి. అచ్చుల గుర్తులు పరిచయం చేసేటప్పుడు ఔత్వం(ౌ) గుర్తే పరిచయబడలేదు. మరి వారికి చదువెలా అబ్బుతుంది. ఇక అద్యాపకుల ప్రతిభ పైనే విద్యార్థుల భవిత ఆధారపడుతుంది. ఐతే తుపాకే పుచ్చుదైతే సైనికుడేం చేయగల్గుతాడు.
అందుకనే నేను అన్నీ సమీక్ష చేసుకొని ఒక క్రమ పద్ధతిలో పాఠాలు తయారు చేశాను. అంటే అచ్చుల క్రమంలో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడిదీర్ఘం……… విధంగా రూపొందించాను
1.పాఠం- అచ్చులు హల్లుల పరిచయం+100 పైగా పదాలు
2.పాఠం-పై పాఠం అక్షరాలు+ దీర్ఘాక్షరాలు వాటి పదాలు
3.పాఠం-అచ్చులు+హల్లులు+దీర్ఘాక్షరాలు+గుడి అక్షరాలు పదాలు
ఇ లా 14 పాఠాలుంటాయి. నేనిప్పటికే పెద్దవారిపై అమలు పరచి చూశాను. రోజుకు 2 గం॥ చొ॥న 30 రోజులలో చదవ గల్గుతున్నారు. పిల్లలకైతే మరో 15 రోజులు పట్టవచ్చు. వారికి రాయడం కూడ అభ్యాసం చేయించాలి కాబట్టి. ఈ క్రింద 4 పట్టికలు పొందు పరుస్తున్నాను. చూడండి. 1వది సమగ్ర వర్ణ పట్టిక. జాగ్రత్తగ గమనించండి.అందులో అచ్చుల్లోనే గుణింత గుర్తులు నిబిడీకృతమై ఉండడం, సారూప్యత లేని గుణింతాక్షరాలు వేరే రంగులో చూపడం, తేడాగా ఉండే “మనయవరలకత” ల ఒత్తక్షరాలు చూపడం జరిగింది.2,3 పాఠాలు దీర్ఘం, గుడి అక్షర పదాల పట్టికలు
భవదీయుడు
ఆనంద నాయుడు.వై
ఏలూరు.

