— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
31-పద్మశ్రీ వేద కుమారి ఘాయ్
16-12-19 31 న జమ్మూలో ప్రతాప్ మొహల్లా లో జన్మించిన వేద కుమారి ఘాయ్ పాఠ శాల విద్య జమ్మూలోనే పూర్తి చేసి ,పంజాబ్ యూని వర్సిటి నుంచి 1953 సంస్కృతం లో ఎం .ఏ .పాసై,భారతీయ ప్రాచీన చరిత్ర ,సంస్కృతీ లో కూడా 1958 లో ఎం. ఏ ,పాసై ,బెనారస్ హిందూ యూని వర్సిటి నుండి సంస్కృతం లో 1960 లో పి .హెచ్. డి.సాధించింది .సంస్కృత విద్వాంసుడైన రాం ప్రతాప్ ను వివాహమాడింది .
జమ్మూలోని పెరేడ్ లో ఉన్న మహిళా ప్రభుత్వ కళాశాలలో సంస్కృత లెక్చరర్ గా వ్రుత్తి లో ప్రవేశించి ,జమ్మూ యూని వర్సిటి లోని పోస్ట్ గ్రాడ్యు యేట్ స్థాయి సంస్కృత శాఖ హెడ్ గా 31-12-1991 న రిటైర్ అయ్యేవరకు పని చేసింది .1966 -67.లోను, 1978 -80కాలం లోను డెన్మార్క్ లోని కోపెంహాగ్ యూని వర్సిటి ఇన్ స్టి ట్యూట్ లో లెక్చరర్ గా సంస్కృత పాణిని వ్యాకరణాన్ని ,సాహిత్యాన్ని బోధించింది .ఆమె డోగ్రి భాష లో మహా విద్వాంసురాలు .హిందీలోను పండితురాలు .సాంఘిక సేవలోను వేదకుమారి ముందున్నది .అమరనాధ దేవాలయం బోర్డ్ లో ఆమె సభ్యురాలు కూడా .
వేదకుమారి ఘాయ్ సంస్కృత విద్వత్తు కు కేంద్రప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందజేసి సత్కరించింది .భారత రాష్ట్రపతి గౌరవ పురస్కారమూ అందుకున్నది .సామాజిక సేవకు గుర్తింపు లభించి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం స్వర్ణ పతాకాన్ని అందజేసింది .1997 లో సంస్కృత సేవకు ప్రెసిడెంట్ అవార్డ్ లభించింది .2005 లో ‘’డోగ్రా రత్న ‘’,2009 లో జీవిత సాఫల్య పురస్కారం ,2010 లో ’’స్త్రీ శక్తి పురస్కారం ‘’అందుకున్న విదుషీమణి వేద కుమారి ఘాయ్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-1-17 –ఉయ్యూరు
