గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు
2-1-1925 న కాశ్మీర్ లోని శ్రీ నగర్ లో నీలకంఠ గుర్తు జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో అడ్వాన్సేడ్ సాంస్క్రిట్ వ్యాకరణం ,భాషా సాహిత్యాలలో పాండిత్యాన్ని పండిట్ లాల్ కాల్ లాంగూ ,,పండిట్ హరిభట్ట శాస్త్రి ,పండిట్ సర్వ దనద హాన్డూ,పండిట్ మహేశ్వర నాద నెహ్రు ,పండిట్ జానకి నాధ దార్ వంటి ప్రసిద్ధ గురువుల వద్ద అభ్యసించాడు .సంస్కృతం లో వరుసగా ప్రజ్న ,విశారద ,శాస్త్రి డిగ్రీలను శ్రీనగర్ సంస్కృత యూని వర్సిటి నుండి పొందాడు .ప్రభాకర్ డిగ్రీ సాధించాక ,సంస్కృతం లో బి. ఏ .కూడా అందుకొన్నాడు . సంస్కృత శైవ సాహిత్యాన్ని పండిట్ బాలాజీ నాధ ,పండిట్ స్వామి, లక్ష్మణ్ జు ల వద్ద అభ్యసించి ప్రావీణ్యం సాధించాడు .
కాశ్మీర్ లోని త్రాల్ లో ఉన్న ప్రభుత్వ సంస్కృత విద్యాలయం లో సంస్కృత టీచర్ గా ఉద్యోగం ప్రారంభించి ఉద్యోగం చేస్తూనే సంస్కృత హిందీలలో ఎం .ఏ .చదివి పాసైనాడు . జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ రిసెర్చ్ ,ప్రచురణ విభాగం లో సోయేర్ కాలేజి,అమర్ సింగ్ కాలేజి లలకు పని చేశాడు . ‘’గుర్తు’’ 18-12-2008 న అల్జీమర్స్ వ్యాధి తో మరణించాడు అనేక తీపి’’ గుర్తు’’లను మిగిల్చి .
గుర్తు సాధించిన సాహితీ విజయాలు అద్భుతమైనవి .సంస్కృత సాహిత్యం లోని చాలా వాటిని హిందీలోకి అనువదించాడు .అందులో ముఖ్యమైనవి –పరాత్రిశక వివరణ ను హిందీ వ్యాఖ్యానంతో ప్రచురించాడు .స్పందకారికను కల్లట వ్రుత్తి తోను ,హరేశ్వర మహాత్మ్యం ను ఆంగ్లానువాదం తోను ,పరమార్ధ సారం ను హిందీ వ్యాఖ్యతో ,సాంబ పంచాశిక ను క్షేమరాజ వ్యాఖ్యతోను ,ఉత్పలదేవుని శివ స్తోత్రావలి ని క్షేమరాజ వ్యాఖ్యానం తో ,సంస్కృత హిందీ భాషలలో ,క్షేమరాజు రాసిన పర ప్రవేశిక కు కాశ్మీరీ భాషలో వివరణ ,కాశ్మీర శైవ దర్శన బృహత్ కోశం ను రెండుభాగాలుగా ‘’నీలకంఠ గుర్తు’’ గుర్తుండి పోయేలా వెలువరించాడు ,కీర్తి గుర్తు మిగిల్చాడు .
సశేషం
సంక్రాంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-1-17 –ఉయ్యూరు
