హాస్య సాహితీ బంధు వులకు కనుము శుభాకాంక్షలు -ప్రతిరోజురాత్రి 9-30కు ఈ టివి లో అమృతం మళ్ళీ సీరియల్ గా వస్తోంది .హాస్యానికి అమాయకత్వాన్ని జోడించి కిచెప్పిన గొప్ప సీరియల్ అది .చాలా విజయవంతం అయింది .దాన్ని” విజయ గుర్రం” పై నడిపించిన” గుణ్ణం” గారికి, అద్భుత పాత్రపోషణ చేసిన నటులకు, డైలాగ్ రచయితకు అభినందన శతం .హాస్యాన్ని ఈ సీరియల్ చిరంజీవి ని చేసింది .కనుక పడుకొనే ముందు ఒక సారి అమృతం రోజూ చూసి మనసు హాయిగా నవ్వుకొని నిద్రపోండి .
అలాగే తెలుగు వన్ లో వచ్చే ”ఫన్ బకెట్ ”కూడా కొత్త ఒరవడి సృష్టించింది .కంప్యూటర్ యుగానికి జోడించి ఇందులోనూ అమాయక చక్రవర్తులనూ పరిచయం చేసి సభ్య హాస్యాన్ని నటులు దర్శకుడు కురిపించారు . హాయైన హాస్యాన్ని అనుభవించి ప్రోత్సహించండి .దీన్ని ”యు ట్యూబ్ ”లోనూ చూడవచ్చు .
”మహాతల్లి ”అనే సీరియల్ కూడా ఒకే ఒక అమ్మాయి మిగిలిన వారిని పాత్రలు చేసి చక్కగా నటిస్తూ హాస్యపు జల్లు కురిపిస్తోంది .నటన యెంత తేలికో ఈ సీరియల్ చూస్తే తెలుస్తుంది .
మరో నవ్వు సీరియల్ ”చికాగో సుబ్బారావు ”సరదాగా సమకాలీనంగా సాగే హాస్య కధనం .కొత్తవాళ్లలోని టేలెంట్ కు ఇది అద్ధం పడుతోంది ”.తల్లి ”ని” సుబ్బారావు”ను యు ట్యూబ్ లో చూడచ్చు .
ఈ సీరియళ్లు తీసినవారుకాని ,నటించి దర్శకత్వం చేసిన వారు కానీ, రాసిన వారుకాని, నాకు ఎవరూ తెలిసిన వారు కాదు, బంధువులూ కారు అని గుర్తించండి .ప్రతిభ ,ఆనందమే వీటిని చూడమని మీకు చెప్పటానికి నన్ను ప్రోత్సహించాయి . హాస్యో రక్షతి రక్షితః -దుర్గా ప్రసాద్ .
