గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 )
విష్ణు తీర్ధ అనబడే అడవి జయ తీర్ధాచార్య 1756 లో జన్మించి 50 సంవత్సరాలుమాత్రమే జీవించి 1806 లో మరణించారు .మహా విద్వాంసుడు, ముని, కవి,మధ్వాచార్య మత గ్రంధ వ్యాఖ్యానకర్త .సావానూర్ దగ్గర సిద్దాపురం లో జన్మించాడు .గురువు సత్యవ్రత తీర్ధ వద్ద సన్యాస స్వీకారం చేశాడు .గురువుగారితో కలిసి బృందావనం సందర్శించి ,కొప్పల్ కు 6 మైళ్ళ దూరం లో ఉన్న మదునూర్ లో తన బృందావనం లో చేరాడు .19 ఉద్గ్రంధాలు రాశాడు అందులో ముఖ్యమైనవి –భాగవత సారోద్ధార ,ఆజ్ఞాపత్ర ,ఆత్మ సుఖ బోధిని ,షోడశి ,చతుర్దశి ,అధ్యాత్మామృత తరంగిణి.
37-జాతీయ పండిత పురస్కార గ్రహీత ,ఆధునిక పాణిని –శివరామ దత్తాత్రేయ జోషి (1926 -2013 )
మహారాష్ట్రలోనికొంకన్ తీర రత్నగిరి కి చెందిన సంస్కృత మహా విద్వాంసుడు మహా వ్యాకరణ వేత్త శివరామ దత్తాత్రేయ జోషి .కుటుంబం సంస్కృత పండిత కుటుంబం .చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన అభాగ్యుడు .1958 లో కళావతి భగవత్ అనే సహచర విద్యార్ధిని వివాహం చేసుకొన్నాడు .87 ఏళ్ళ వయసులో జోషి 29-7-2013 న మరణించాడు .
ప్రాధమిక విద్య పూనా లో బాబాయి మహేశ్వర శాస్త్రి జోషి వద్ద నేర్చాడు .20 ఏళ్ళకే సంస్కృత వ్యాకరణాన్నిమదధించి సారం గ్రోలాడు .బెంగాల్ ,బరోడా ,పూనా యూని వర్సిటీలనుండి అనేక డిగ్రీలు సాధించాడు.పూణే సంస్క్రుతకాలేజిలో లెక్చరర్ గా జీవితం ప్రారంభించి 1947-55 లో ప్రిన్సిపాల్ గా సేవ చేశాడు .1950 లో డేనియల్ ఇంగాల్స్ వద్ద టీచర్ గా చేరి ,తన విద్యా సంపత్తితో అభిమానం పొంది ,సంప్రదాయ పద్ధతిలో సంస్కృతం అభ్యసించటం వలన 19 55 లో బి ఏ .చదివి డిగ్రీ పొంది హార్వర్డ్ యూని వర్సిటీలో ఫెలోషిప్ సాధించాడు .1960లో హార్వర్డ్ నుంచి ఇంగాల్స్ గైడ్ గా ‘’సంస్కృత నిఘంటు అర్ధ విచారణ’’(సాంస్క్రిట్ లెక్సికల్ సెమాంటిక్స్ )పై పరిశోధన చేసి పి. హెచ్.డి . పొందాడు.
1960 లో ఇండియాకు తిరిగివచ్చి పూనా దక్కన్ కాలేజిలో సంస్కృత నిఘంటు విభాగం లో చేరాడు .1964 లో పూనా యూని వర్సిటి లో ‘’సెంటర్ ఆఫ్ అడ్వాన్సేడ్ స్టడీ ఇన్ సాంస్క్రిట్’’ లో రీడర్ గా పని చేశాడు .1970 లో సంస్కృత ,ప్రాకృత భాషాశాఖాధ్యక్షుడైనాడు .1974 నుంచి 1987 వరకు సెంటర్ ఫర్ అడ్వాన్సేడ్ స్టడీ ఇన్ సాంస్క్రిట్ కు డైరెక్టర్ గా ఉన్నాడు .1987 నుంచి దక్కన్ కాలేజి సంస్క్రుతనిఘంటు ప్రాజెక్ట్ లో పని చేశాడు .1971 నుంచి ఒక ఏడాది హార్వర్డ్ యూని వర్సిటి లోను ,1976-77 లో నాగోయా యూని వర్సిటి విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు .
జోషి పతంజలి మహా భాష్యానికి 11 భాగాల వ్యాఖ్యానం రాశాడు .పాణిని వ్యాకరణానికి 15 భాగాల వ్యాఖ్యానమూ రచించాడు .1991లో భారత రాష్ట్ర పతి చేత జాతీయ పండిత పురస్కారాన్ని అందుకున్నాడు. ‘’ఆధునిక పాణిని’’ గా జోషీని భావిస్తారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-17 –ఉయ్యూరు

