గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982 )
కృష్ణ కాంత హా౦డీక్ అస్సాం రాష్ట్రం లో జోర్హాట్ నగరం లో ‘’టాల్ అహం ‘’వంశం లో20-7-1898 న జన్మించాడు. తండ్రి రాజ బహదూర్ తారాకాంత హాండీక్.గౌహతిలోని కాటన్ కాలేజి , కలకత్తా సంస్కృత కాలేజి ,కలకత్తా ,ఆక్సఫర్డ్ బెర్లిన్ యూని వర్సిటీలలో 1913 నుంచి 1927 వరకు లో చదివి గ్రీక్ ,లాటిన్ ,ఫ్రెంచ్, జెర్మని ,రష్యన్ ,ఇటాలియన్ ,స్పానిష్ మొదలైన 8 విదేశీ భాషలలోను ,సంస్కృత , ప్రాకృత ,పాళీ మొదలైన 5 స్వదేశీ భాషలలోనుమొత్తం 13 భాషలలో భాషా వేత్త అయ్యాడు .
హా౦డీక్- గౌహతి యూని వర్సిటి వ్యవస్థాపక వైస్ చాన్సెలర్ గా 1948- నుండి 57 వరకు తొమ్మిదేళ్ళు పని చేశాడు .దీనికి ముందు జోర్హట్ లో జే. బి .కాలేజి వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా1930- నుండి 48 వరకు 8 ఏళ్ళు ఉన్నాడు .జోర్హాట్ లో హేమలత హా౦డీక్ మెమోరియల్ ఇన్ స్టి ట్యూట్ ను స్థాపించాడు . అనేక విద్యా సంస్థల స్థాపనకు చేయూత నిచ్చాడు. విద్యా వ్యాప్తికి హాండీక్ కృషి అద్వితీయం .తాను సేకరించిన 11 ప్రపంచ భాషలలోని అరుదైన గ్రంధాలను గౌహతి యూని వర్సిటికి ధారాదత్తం చేసి అందరికి అందుబాటులోకి తెచ్చాడు .వీటి కాపీ రైట్ హక్కులను పూనా లోని దక్కన్ కాలేజి పి. జి. అండ్ రిసెర్చ్ సెంటర్ కు ,మహారాష్ట్ర లోని జైన సంరక్షా సంఘ్ కు ,అహమ్మదాబాద్ లోని ప్రాకృత టెస్ట్ సొసైటీకి అందజేశాడు .
1937 లో గౌహతి లో జరిగిన అస్సాం సాహిత్య సభకు 39 ఏళ్ళ వయసులో హాండీక్ అధ్యక్షునిగా వ్యవహరించి తన దక్షతను నిరూపించుకొన్నాడు .1951 లో లక్నో లో జరిగిన 16 వ ఆల్ ఇండియా ఓరి యెంటల్ కాన్ఫ రెన్స్ లో క్లాసికల్ సాంస్క్రిట్ విభాగానికి ప్రెసిడెంట్ గా ఉన్నాడు .1961 లో శ్రీనగర్ లో జరిగిన ఈ సభకు జనరల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు .7-6-1982 న 94 వ ఏట మరణించాడు .ముఖ్యమైన మూడు గ్రంధ రచనలను చేశాడు -1-శ్రీ హర్షుని నైషధ చరిత -2-యశస్టికా అండ్ ఇండియన్ కల్చర్ 3-ప్రవర సేనాస్ సేతు బంధ .
అస్సాం కు చెందిన సంస్కృత విద్వాంసుడు ,ఇండాలజిస్ట్ ,బహుభాషా వేత్త ,వితరణ శీలి అయిన కృష్ణ కాంత హాండీక్ సేవలకు భారత ప్రభుత్వం 1955 లో పద్మశ్రీ ,1967 లో పద్మ భూషణ్ పురస్కారాలు అందజేసి, సత్కరించి, గౌరవించింది.
సశేషం
కనుమ శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-17 –ఉయ్యూరు

