15-8-1921 న జన్మించి 15-8-2,000న 79 వ ఏట చనిపోయిన కె.కైలాస నాద కురుక్కాల్ శ్రీలంకలో జాఫ్నా జిల్లా నల్లూర్ లో తమిళ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .ప్రాధమిక విద్య నల్లూర్ లోని మంగయార్క రాసి విద్యాలయం లో పూర్తీ చేసి ,జాఫ్నాలోని తిరునల్వేలి కాలేజిలో చదివి ,లండన్ మెట్రిక్ ,ఇంటర్ మీడియెట్ పాసయ్యాడు .పెరడేనియాలోని సిలోన్ యూని వర్సిటిలో సంస్కృతం పాళీ లాటిన్ ఇంగ్లీష్ జర్మన్ ,ఫ్రెంచ్ భాషలు నేర్చి పండితుడయ్యాడు .ఆయన సంస్కృత గురువు ప్రొఫెసర్ బెట్టీ హేమన్ .గురువే స్నేహితుడు ,గైడ్ అయ్యాడు .1948 లో సంస్కృత ఎం ఏ .డిగ్రీ పొంది అదే యూని వర్సిటిలో సంస్కృత లెక్చరర్ గా చేరి పని చేశాడు .
భారతీయ ఇతిహాస ,పురాణ కాలాలపై పరిశోధన చేసి ‘’ఏ స్టడీ ఆఫ్ ఎపిక్ అండ్ పురాణిక్ పీరియడ్స్ ‘’ధీసిస్ రాసి 19 60 లో డాక్టరేట్ పొందాడు .యూనివెర్సిటి ఆఫ్ సిలోన్ రివ్యు లో చాలా పరిశోధనాత్మక వ్యాసాలు రాశాడు .1974 లో జాఫ్నా యూని వర్సిటీలో మొట్టమొదటి సారిగా ‘’డిపార్ట్ మెంట్ ఆఫ్ హిందూ సివిలిజేషన్ ‘’ఏర్పడినపుడు దాని అధ్యక్షుడిగా పని చేశాడు .ఆర్ట్స్ ఫాకల్టి కి ‘’కో-డీన్ ‘’గా 1976-78 మధ్య ప్రొఫెసర్ ఎస్.గామ్లత్ తో కలిసి పని చేశాడు .ఫైన్ ఆర్ట్స్ అనే రామనాధన్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమి కి హెడ్ అయ్యాడు .
శ్రీల౦క ,ఆస్ట్రేలియాలలో చేసిన ఎన్నో యజ్ఞాలకు ముఖ్య పురోహితుడుగా వ్యవహరించాడు .శ్రీలంకలోని పుట్లాం జిల్లాలోని మున్నేశ్వరం దేవాలయానికి ముఖ్య పూజారులలో ఒకరుగా ఉన్నాడు .శ్రీలంక లోని ‘’పంచ ఐశ్వర్య దేవాలయాలలో’’ ఇదొకటి .
సంస్కృత గ్రంధాలపై హిందూ సంస్కృతీ నాగరకత లపై విస్తృత పరిశోధన చేశాడు కైలాసనాధ కురుక్కాల్ .శ్రీలంకలో ఇతర దేశాలలో జరిగిన చాలా సెమినార్లలో పాల్గొని వీటిపై పైశోధన వ్యాసాలూ రాసి సమర్పించాడు .1997 లో లండన్ లోని ‘’శ్రుతి లయ సంఘం ‘’పంచ ఐశ్వర్యం పై ఒక నృత్యనాటకాన్ని ప్రదర్శించాలని సంకల్పించి ,కైలాసనాధ కురుక్కాల్ ను సంప్రదిస్తే తానూ ఒక ఐశ్వర దేవాలయం తో సంబంధం ఉన్నవాడుకనుక ఆ సబ్జక్ట్ పై కూలంకషంగా రిసెర్చ్ చేసి విషయాలను సమగ్రంగా అందజేసి వారికి సహకరించాడు .లండన్ లోలండన్ యూని వర్సిటి లోగాన్ హాల్ లో 16-10-1999 న ‘’పంచ ఐశ్వర్యం ‘’నృత్య నాటకం ప్రదర్శించారు .గొప్ప స్పందన లభించి కురుక్కాల్ వైదుష్యానికి బహుదా ప్రశంసలు లభించాయి .ప్రదర్శనకు కొద్దికాలం ముందే కురుక్కాల్ భార్య పరమపది౦చింది .అయినా లండన్ వెళ్లి ప్రదర్శనలో పాల్గొని అందరి అభిమానం పొందాడు
1988 లో జాఫ్నా యూని వర్సిటి కురుక్కాల్ కు డిలిట్ఇచ్చి గౌరవించింది .అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్స్ వారు గౌరవించి సత్కరించారు .1993 లో శ్రీలంక ప్రభుత్వం ‘’వేదాగమ మామణి’’బిరుదునిచ్చి సన్మానించింది .1998 లో కురుక్కాల్ రిటైర్ అయ్యాక కూడా జాఫ్నా యూని వర్సిటి ఆయన్ను ‘’ప్రొఫెసర్ ఎమిరిటస్ ‘’గా గౌరవించింది .
శ్రీలంక లో హిందూ కర్మకాండ అధ్యయనం లో ,నిర్వహణలో కురుక్కాల్ అద్వితీయుడు .శ్రీలంకలో ఉన్న అతి కొద్దిమంది బ్రాహ్మణ కుటుంబాలు అవసరం వచ్చినప్పుడు ఆయన సలహా సంప్రదింపులు తీసుకొంటూ హిందూ ధర్మ విధులను నెర వేరుస్తారు .
కురుక్కాల్ –సంస్కృత ఈజీ ట్యూటర్ ,హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ ,రిట్యువల్స్ ఇన్ శైవ టెంపుల్స్ ,హిందూ కల్చర్ -సమ్ దాట్స్ ‘’వంటి వి చాలా పుస్తకాలు రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-17 –ఉయ్యూరు

