గీర్వాణకవుల కవితా గీర్వాణం -3-
41-రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి
1950 లో జన్మించిన వెంపటి కుటుంబ శాస్త్రి మహా భారతీయవిద్యా వేత్త .20 03నుంచి 20 08వరకు భారతీయ సంస్కృత సంస్థాన్ కు వైస్ చాన్సలర్ గా పని చేసిన సర్వ సమర్ధుడు .అంతర్జాతీయ సంస్కృత అధ్యయన సంస్థకు అధ్యక్షుడు .15 వ ప్రపంచ సంస్కృత మహా సభ నిర్వహణ కమిటీ సభ్యుడు .’’వైడర్ అసోసియేషన్ ఆఫ్ వేదిక్ స్టడీస్ ‘’గవర్నింగ్ బోర్డ్ మెంబర్ కూడా .టోరినో నుండి ప్రచురింపబడే ‘’ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాంస్క్రిట్ స్టడీస్ ‘’జర్నల్ కు ‘’ఇండో లాజికా టార్నీషియా’’సంపాదక వర్గం లో ఉన్నాడు .భారతీయ వేదాంతం పై విపరీతమైన అభిమానం .అందులో అద్వైత వేదాంతం అంటే మహా ఇష్టం .సంస్కృత మహాకావ్యాలపై మహా అభిమానం .లెక్కలేనన్ని మోనో గ్రాఫులు ,ఆ౦ధాలజీలు రాశాడు .అద్వైత వేదాంతం పై ఎన్నో పరిశోధన పత్రాలు రాసి సమర్పించాడు .భారత దేశం లోని అనేక రాష్ట్రాలు శ్రీ శాస్త్రి ని ఆహ్వానించి ప్రసంగాలు చేయించి బిరుదప్రదానం చేసి సత్కరించాయి .కెనడాలోని విండ్సర్ యూని వర్సిటి శాస్త్రి గారి సంస్కృత భాషా వ్యాప్తికి చేసిన కృషికి పురస్కారం అందజేసింది .
ఇంతకంటే ఈ మహానుభావుని గురించి వివరాలు తెలియ లేదు .బహుశా వీరు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందినవారు అని నా అభిప్రాయం . వారు కాళిదాస మహాకావ్యాలపై సంస్కృతం లో చేసిన ప్రసంగాలు యు ట్యూబ్ లో చూసి ఆనందించవచ్చు . ప్రస్తుతం శాస్త్రి గారు గుజరాత్ రాష్ట్రం లో వేరావల్ లో ఉన్న శ్రీ సోమనాద్ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ గా ఉన్నారు .
మీకెవరికైనా శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారి గురించి ఇంకా ఏమైనా విశేషాలు తెలిస్తే నాకు తెలియ జేయండి .తరువాత చేరుస్తాను .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-17 –ఉయ్యూరు

