గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
15-6-1976 న శ్రీమాన్ పరాశరం భరద్వాజ లక్ష్మణాచార్య శ్రీమతి జయలక్ష్మి దంపతులకు శ్రీ భావనారాయణాచార్యులు జన్మించారు .’’శ్రీ వైఖానస నిగమాగమిక ప్రవర’’ ఉత్తీర్ణులై ,సంప్రదాయ జ్యోతిష వాస్తు లలో పాండిత్యం సాధించారు .
కృష్ణా జిల్లా నిమ్మకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులుగా 1992 –నుండి 2000వరకు పనిచేశారు .తరువాత గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ఆస్థాన పండితులుగా 2000-2009 వరకు ఉన్నారు .పిమ్మట తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వ విద్యాలయ వైఖానస ఆగమ అసిస్టంట్ ప్రొఫెసర్ గా 2009 నుండి ఉద్యోగిస్తున్నారు .
ఆచార్యులవారి గురు పరంపర –మహా భాష్యా౦త వ్యాకరణ శిరోమణి ,విద్యా భూషణ ,శ్రీ నైమిశారణ్య ఆలయ నిర్మాత శ్రీ పరాశరం వెంకట రామాచార్యులు ,శ్రీ హయగ్రీవ పాదు కాంతానుస్టాన తత్పర ,ఆగమ ,శిల్ప జ్యోతిష వాస్తు ఆయుర్వేద వైద్యాలంకార శ్రీ వేదాంతం అనంత పద్మనాభాచార్యులు ,శ్రీ వైఖానస ఆర్ష విద్యా వాచస్పతి ,దత్త పీఠ ఆస్థాన పండితులు ,వైద్య విద్వాన్ ,శ్రీ శాస్త్ర పురాణ శ్రీ అగ్ని హోత్రం శీనివాసాచార్యులు .
తిరుపతి వేద విశ్వ విద్యాలయం ప్రచురించిన ‘’వైష్ణవార్చన సార సంగ్రహం ‘’కు సంపాదకులు గాఆచార్యులవారున్నారు . .అదే యూని వర్సిటి ప్రచురించిన ‘’వనౌషధి నిఘంటు ‘’నిర్మాణానికీ సంపాదకత్వం వహించారు .తిరుపతి వేదిక్ యూని వర్సిటి వారి ఆగమ సమన్వయ సదస్సుకు కన్వీనర్ ,ఎడిటర్ .తిరుపతి పరాశర పబ్లికేషన్స్ వారి ‘’రామ మహిమాన్వేషణం’’ తెలుగు రచనకు ముఖ్య సంపాదకులు.శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయ ‘’ద్రువార్చ యజ్న విధి ‘’కి సంపాదకులు .
ఆచార్యులవారి బిరుదులు –సత్కారాలు -1993 లో ముఖ్యమంత్రి శ్రీ ఎన్. టి .రామారావునుంచి ‘’ఉత్తమ అర్చక ‘’చెన్నైలోని తిరువలిక్కేని నుండి ‘’శ్రీ వైఖానస ఆగమ వాచస్పతి ,’’మైసూర్ దత్త పీఠాదిపతి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి నుంచి ‘’శ్రీ దత్త వెంకటేశ్వర దేవాలయ మహా సంప్రోక్షణ’’ పురస్కారం అందుకున్నారు .
విద్యావారధి శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంపాదకులుగా ,శ్రీ పరాశరం భావనారాయణా చార్యులుగారు ఉపసంపాదకులుగా శివ పార్వతుల కల్యాణం గా ప్రముఖ శైవాగమ వేత్త ,వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడి ఆస్థానకవి ,గురు వరేణ్యులు ,శ్రీ చక్రార్చన ధురీణులు,అభినవ కాళిదాస బిరుదాంకితులుశ్రీ ములుగు పాపయారాధ్య కవి శ్రేస్టులు రచించిన ‘’కళ్యాణ చంపువు ‘’అనే అరుదైన సంస్కృత కావ్యాన్ని విశేషమైన ఉపోద్ఘాతం ,పరామర్శతో వెలువరించారు .దీనిని జైపూర్ లోని లిటరరీ సర్కిల్ ప్రచురించింది . ఈకావ్యం లో చంపూ లక్షణాలన్నీ సమగ్రంగా ఉండటమే కాక నవరస పోషణా జరిగింది .
ప్రస్తుతం తిరుపతి లోని తిరుచానూర్ లో శ్రీ పరాశరం భావనారాయణా చార్యుల వారు ఉంటున్నారు .
ఈ రచనకు ఆధారం –విద్యా వారధి ‘’శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఆదరం తో ఈ రోజే నాకు పంపిన వారి రచనలు 1-పూజా కుసుమాలు 2-మీరూ సంస్కతం నేర్చుకోండి 3-నవగ్రహ స్తుతిః తో పుస్తకాలతోపాటు పంపిన అరుదైన సంస్కృత గ్రంధం శ్రీ ములుగు పాపయారాధ్య విరచితమై తమ సంపాదకత్వం లో వెలువరించిన ‘’కళ్యాణ చంపువు ‘’కావ్యం . శ్రీ శాస్త్రిగారికి కృతజ్ఞతలు అందజేస్తున్నాను .
శ్రీ ఆచార్యులవారి ఫోటో జతచేశాను చూడండి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-1-17- ఉయ్యూరు

