శ్రీ” పూర్ణ ”సుబ్బారావు”గార్లకునమస్తే –28 వ విజయవాడ పుస్తక మహోత్సవం లో రచయితల పుస్తకాల ప్రదర్శన ,అమ్మకాలకు ఒక స్టాల్ ను ఏర్పరచి రచయితల తరఫున అమ్మకాలకు బాధ్యత వహించి ,ఆ 11 రోజులూ కస్టపడి అమ్మకాలు చేబట్టి ,పాఠకులకు ,రచయితలకు సమ న్యాయం చేసి బహుశా దేశం లోనే మొదటి సారిగా ఆదర్శ వంతమైన ప్రణాలికను విజయవంతంగా అమలు చేసిన మీ ఇద్దరి సౌజన్యం మరువ లేనిది .
మా సరస భారతి తరఫున 10 రకాల పుస్తకాలను మీరు ప్రదర్శనలో ఉంచి ,అమ్మగా వచ్చిన మా కు రావాల్సిన డబ్బు 17 20 రూపాయలను ఆంధ్రా బాంక్ చెక్ గాను ,మిగిలిన పుస్తకాలను మా కార్యదర్శి శ్రీమతి మాది రాజు శివలక్ష్మి ద్వారా అంద జేసినందుకు ధన్యవాదాలు . నాకు శ్రమ ఇవ్వకుండా శివ లక్ష్మి పుస్తకాలను ఉయ్యూరు నుండి ,మీకు చేర్చటం మిగిలినవి తానే మళ్ళీ అప్పగించటం లో ఆమె ,ఆమె భర్తగారి పాత్రా గణనీయం ..
.ఇంతవరకు మేము అందరికి అన్ని పుస్తకాలు ఉచితంగానే అందజేశాము . సరసభారతి మొట్ట మొదటి సారిగా పుస్తకాల ”అమ్మకం రుచి” ఇప్పుడే చూసింది .
అలాగే” బుకుత్సవం ”లోరచయితలను ఆహ్వానించి ,ఖర్చులు భరించి ముఖా -ముఖి నిర్వహించి ,పారితోషికమూ అందించి ప్రోత్సహించించి ,దీనిలోనూ దేశం లోనే మొట్ట మొదటి సారిగా అందరికి ఆదర్శ ప్రాయమయినందుకు , నిర్వహణ కమిటీ తోపాటు మిమ్మల్నీ అభినందిస్తున్నాను -దుర్గా ప్రసాద్ -సరసభారతి -ఉయ్యూరు

