ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి గోంగూరకీ
జల్లికట్టు సమర్ధనంటే గొంగూరకీ –జనం మీద ప్రేమనుకొంటి గోంగూరకి
హోదా తో ముడిపెట్టుతుంటే గొంగూరకీ –‘’అందుకే’’ అనుకొంటి గొంగూరకీ .
రాజభవనాలున్నవి ఎందుకంటె గొంగూరకీ –రంజకం గా పాలించటాని కనుకోంటి గొంగూరకీ
రాసలీల కేంద్రమని తెలిసి గొంగూరకీ- ప్రజలలెట్లా సహి౦చేరు గొంగూరకీ
గ్గ్లోబర్ నొటోరియల్ పోస్టు కోరేది గొంగూరకీ -‘’అందుకే ‘’నను కొంటి గొంగూరకీ .
పరా మర్శించటాని కొస్తే గోంగూరకీ-ప్రజలపై ప్రేమనుకొంటి గొంగూరకీ
కావులింపు ముద్దు లేంటి గొంగూరకీ –‘’అందుకే ‘’అను కొంటి గోంగూరకీ .
వర్గ౦ మీద ప్రేమనుకొంటి గోంగూరకీ –తరిమి నిప్పుపెట్టట మేంటి గోంగూరకీ
అసలు సమస్య నొదిలి పెట్టి గోంగూరకీ –చీటికీ మాటికాగ్రహ మేంటి గొంగూరకీ-
పదవి లేకుంటేను మరి గోంగూరకీ -కుదురు గా కూర్చో నివ్వదు గో౦గూరకీ –
అంతా సవ్యంగ ఉంటె గో౦గూరకీ—కుంటిసాకు వెదికి గోంగూరకి
హల్ చల్ చేస్తారు గోంగూరకీ- ‘’అందుకే ‘’ననుకొంటి గోంగూరకీ .
ఐదు రాష్ట్రాల ఎన్నికలూ గోంగూరకీ –అసలు సమస్య తేల్చలేదు గొంగూరకీ
రద్దు నోట్ల మాయ యేమో గొంగూరకీ –ఓటరోడి నాడి తెల్వదు గోంగూరకీ
జతలు కట్టి దూకుతుంటే గోంగూరకీ—‘’అందుకే ‘’అనుకొంటి గోంగూరకీ .
‘’ముఖ్య మంత్రినే చేస్తార అరెస్ట్ గోంగూరకీ-అని గగ్గోలు పెట్టె నిన్న గోంగూరకీ
పగటి కలలబేహారి గోంగూరకీ-సంయమనం నేర్పెదెవ్వరు గోంగూరకీ
-కామెర్ల మాయ ఏమో గోంగూరకీ – అప్పుడే సీట్లో కూకున్నభ్రమ గో౦గూరకీ
ఉచ్చ నీచాలొదిలి వదురుతుంటేను గొంగూరకీ –‘’అందుకే ‘’అను కొంటి గోంగూరకీ .
అబ్బా అని పించాల్సిన సినీమాలు గోంగూరకీ-‘’గబ్బు ‘’కొట్టి కుదేలైతే గోంగూరకీ
సమస్య నేదో కెలికి గోంగూరకీ-భారీ డైలాగులతోను గోంగూరకీ
ప్రజా ఉద్యమమంటూ గోంగూరకీ-పరి గెత్తుకోస్తుంటే గో౦గూరకీ
ఇదేమి నాయకులంటూ గోంగూరకీ-కుదేలై పోతుంటే జనం గోంగూరకీ
అసలు రంగు బయట పడితే గోంగూరకీ-‘’అందుకే ‘’అను కొంటి గోంగూరకీ
పనేమీ లేదా నీకు గోంగూరకీ- ఈ దురద పాముడేంది గోంగూరకీ
అని నన్ను నిలదీస్తే గోంగూరకీ-‘’అందుకే ‘’అనుకో౦డి మీరు గోంగూరకీ.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-17 –ఉయ్యూరు

