గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
53-హనుమాన్ చాలీసాకు ఇంగ్లీష్ అనువాదం వ్యాఖ్య రాసిన –నిత్యానంద మిశ్రా
ఉత్తర ప్రదేశ్ లో లక్నో కు చెందిననిత్యానంద మిశ్ర సైంటిస్ట్ కుటుంబం లో 24-8- 1982 న జన్మించాడు .తండ్రి జే. డి.మిశ్ర కేమిస్త్రి లో పి హెచ్ డి.జునా గడ్ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ లో గ్రౌండ్నట్ రిసెర్చ్ డైరెక్టర్ .నిత్యానంద గుజరాత్ యూని వర్సిటి నుండిఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో ఇంజినీరింగ్ డిగ్రీ పొందాడు .ప్రస్తుతం ముంబాయ్ సిటీ గ్రూప్ లో ఉన్నాడు .
సంస్కృతం లో డిగ్రీ లేక పోయినా ఆ భాషను అనర్గళం గా మాట్లాడేవాడు .చాలాపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు ఎన్నో పుస్తకాలను అనువదించాడు .స్వామి రామభద్రా చార్య శిష్యుడు .నిత్యానంద మిశ్రా హనుమాన్ చాలీసా పై విపుల వ్యాఖ్యానం’’మహావీరీ ‘’ ఇంగ్లీష్ లో రాసి ప్రసిద్ధి పొందాడు తెచ్చాడు .తులసీదాసు చాలీసాకు ఇంగ్లీష్ లో దీనికి మించినది లేదని ప్రపంచవ్యాప్తం గా భావిస్తారు .ప్రతిపదానికి అర్ధం భావం తాత్పర్యం విశేష వివరణ ,స్వర లిపి ,నోటేషన్లుతో మహాద్భుతం అని పిస్తుంది .
నిత్యానంద మిశ్ర సంస్కృతం లో ‘’ప్రజ్ఞా చక్షు రామ భద్రా చర్య ‘’మరియు ‘’మహేశ్వర సూత్రేషు రామకధ’’,’’సంభాషణా సందేశ్ ‘’రాశాడు .
ఇంగ్లీష్ లో ‘’ఆల్గారిదమ్స్ ఇన్ ఎమెర్జింగ్ ఏసియన్ మార్కెట్ ,’’ఆధ్యాత్మ రామాయణం లో పాణినీయం ,గోస్వామి నారాయణ దాస అండ్ రామ భద్రాచార్య ,రామభాద్రాచార్య రచించిన శ్రీ భార్గవ రాఘవీయం ‘’కు సంపాదకత్వం వహించి ముద్రించాడు .మిశ్రా ప్రస్తుతం ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రికి స్టాటిస్టికల్ అనలిస్టు గా పని చేస్తున్నాడు .ఈతని తల్లి బయో కెమిస్ట్రీలో ఎం ఎస్ సి .చేసి కేంద్రీయ విద్యాలయం లో లెక్చరర్ .పెద్దక్క గాంధీ నగర్ ప్లాస్మా రిసెర్చ్ఇన్ స్టి ట్యూట్ లో సైంటిస్ట్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-17 –ఉయ్యూరు
.

