కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే )
తీరికగా పేపర్ చదువుతున్నా .పక్కింటి పడుచు కుర్రాడు పరిగెత్తుకొచ్చి వగరుస్తూ కుర్చీలో కూల బడి ‘’అంకుల్ !నాకో హెల్ప్ చేయాలి ‘’అన్నాడు .వాడికి నేనంటే చనువు .తరుచూ వచ్చిపలకరిస్తాడు . నా మెయిల్స్ చదువుతాడు .ఫేస్ బుక్ లో కావలసినన్ని లైకులు పెట్టి కిక్కెక్కిస్తాడు .వాట్స్ అప్ లో ఓహ్ వాట్ యే బ్రిలియంట్ ఐడియా వాట్ఎ పెర్సేప్షన్ !కంగ్రాట్స్ ‘’వంటివి బాగా దట్టిస్తాడు .కనుక నా అభిమాని అని వేరే చెప్పక్కర్లేదు .నా ప్రచార సారధి ఒక రకంగా అని గర్వం ఫీలౌతాను వాడిని చూసి .డప్పు కొట్టే వాడంటే ఎవరికి ఇష్టం ఉండదు?నేనేం ఎక్సెప్షన్ కాదు .సరే అసలు విషయం వదిలేసి శాఖా చంక్రమణం చాలా చేశాను ‘’ఇంతకీ నీకు నేనేం హెల్ప్ చేయాల్రా ?’’అడిగాను .’’ఏం లేదంకుల్ .వెరీ సింపుల్ . నాకు కొన్ని బూతుల్లాంటి తిట్లు రాసి పెట్టాలి ‘’అన్నాడు జంకు లేకుండా .’’నేనేం ఆత్రేయనో ,వేటూరినో అను కొన్నావా ఇదే౦ తెంపరి తనం ?’’అన్నా .’’తప్పుగా అర్ధం చేసుకోకండి అంకుల్ .అవన్నీ పాత బడి పోయాయి .’’అన్నాడు ‘’అసెంబ్లీ లో మనవాళ్ళంతా పన్నెండో నంబర్ భాష రెచ్చి పోయి మాట్లాడుతున్నారు కదా ఇంకా ఏం నేర్చుకోవాలి ?’’అన్నా .’’వాటికి ఎక్స్పైరీ డేట్ అయి పోయింది అంకుల్ ‘’అన్నాడు సంకోచం లేకుండా .’’ఈ మధ్య ‘’ట్ర౦ప్ ట్రంపెట్ వాయించి నట్లు కంపు కొట్టేట్లు అందర్నీ ఉప్పూ పత్రీ లేకుండా తిడుతున్నాడు కదా .రికార్డ్ చేసుకో లేక పోయావా ‘’అడిగా.’’లాభం లేదంకుల్ .అవి మరీ పచ్చిగా ఉన్నాయి ‘’అన్నాడు .’’అమెరికా స్కూల్ కుర్రాళ్ళు రెచ్చిపోయి తిట్టుకొంటారని విన్నా.ట్రై చేయలేక పోయావా ?’’అన్నా. ‘’అదీ అయింది అంకుల్ .నాకు లేటెస్ట్ గా ,సాంకేతికంగా, లైట్ గా కావాలి ‘’అన్నాడు .’’పోనీ యు ట్యూబ్ లో ఫన్ బకెట్ చూడక పోయావా ?అందులో కర్రోడు ,జుట్టు పోలిగాడు సరదాగా మంచి బూతులలాంటివే తిట్టుకొంటారుగా .నేనూ సరదాకి చూస్తాను ‘’అన్నాను .’’అవన్నీ నిన్నటి తిట్లన్కుల్ .నాకు మీరైతే అతి లేటెస్ట్ తిట్లు రాయగలరని నమ్మకం .అంతే .నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం వద్దు ఇప్పటికే అరగంట వాయించారు ,ఇక మొదలు పెట్టి రాసి నాకు అర్జెంట్ గా మెయిల్ చేయండి ప్లీజ్ అంకుల్ ‘’అన్నాడు .’’అంత కొంపేం మునిగింది ?’’అన్నా .’’సాయంత్రం పోటీ ఉందన్కుల్ .మీ వన్నీ నావిగా చేసి పోటీ లో పార్టిసిపేట్ చేయాలి .గెలిస్తే ప్రైజ్ కూడా ఉంది .ఆ ప్రైజ్ మీకే ఇస్తా అంకుల్ నాకొస్తే ‘’అని ఊరించాడు .ములగ చెట్టు ఎక్కాక ,సుబాబుల్ చివరున్నాక ఇక తప్పించు కో లేనని తెలుసుకొని ,వాడిని కెలకటం బుద్ధి తక్కువని ఇక తప్పదని’’ పంచాంగ’’ రచనకు ఉపక్రమించా .;
1-ఒరే నీ కంప్యూటర్ లో కాకరకాయా
2-ఓరి నీ లాప్ టాప్ లో నా ఎర్ర టవలూ
౩-ఓసి నీ ఐ పాడ్ లో ఐస్ క్రీమూ
4-ప్రోగ్రాం రాయమంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించినట్లు
5-కంట్రోల్ సిస్టం రా అంటే కండోం సిస్టమా అని అడిగినట్లు
6-సిస్టం ఉందా అని అడిగితే సిస్టర్ ఉందన్నాట్ట ఒకడు .
7-నీ రిమోట్ లో కమోడూ
8-డేటా పంపించారా బేటా అంటే బాటాషూ పంపినట్లు
9-లూమ్స్ అంటే ఏమిట్రా అంటే హాండ్ లూమ్స్ బ్రదర్ అన్నట్లు
10-అనలాగ్ అంటే అనంతనాగ్ తమ్ముడు అన్నట్లు
11-ఓరి నీ డిజిటల్ మెమరీలో డీజిలాయిలూ
12-ప్రాసెస్ చేయరా బాబూ అంటే ఫ్రాడ్ చేసిన౦త ఫీలింగే౦ట్రా
13-ఓసి నీ కీబోర్డ్ లో నా జడ పిన్నూ
14-జాయ్ స్టిక్ అంటే అదేదో బూతనుకొని వంకర్లు తిరుగుతావేంటే
15- మానిటర్ తెమ్మంటే మానీటర్ ను తెచ్చినట్లు
16-ఓసి నీ స్క్రీన్ మీద నా ఫేస్ పౌడరూ
17-ప్రింటర్ ఉందా అంటే ప్రింట్ చేసేవాడ్ని పట్టుకొచ్చినట్లు
18-స్కాన్ చేసి పంపరా అంటే స్కాంకాగితాలు పంపాట్ట ఒకడు
19-ఇన్ పుట్ ఉందా అంటే మెలికలు తిరుగుతావేంటే
20-ఓరి ఎంకమ్మా ఔట్ పుట్ అంటే లాప్ టాప్ తీసి బయట పెట్టటం కాదహే .
21-లాగిన్ అవమంటే లాగు లోపల వేసు కోవటం కాదురా ఎర్రి పప్పా
22-లాగవుట్ చేయమంటే బయటికెళ్ళి లాగూ విప్పాట్ట నీ బోటి చవట
23-టచ్ స్క్రీన్ ఉందా అని అడిగితె స్కిన్ టచ్ చేసి చేబుతానన్నదిట ఒక ఎర్రి బాగుల్ది .
24-సోర్స్ ఉందా అని అడిగితె మచ్చలు పోవటానికి మందు రాసుకొన్నట్లు
25-నీనెట్ వర్క్ లో నా బాస్కెట్ బాలూ
26-ఓరి నీ మోడెమ్ లో కన్డోమూ
27-ఆర్టి ఫీషియల్ ఇంటలిజెన్స్ గురించి చెప్పరా అంటే ఆర్టీసీ ఇంటలిజెన్స్ గురించి చెప్పినట్లు
28-నీ సిస్టం లో హార్డ్ వేర్ పోయిందిరా అంటే హార్డ్ వేర్ ఇనపకొట్టు కెళ్ళి వేయించు కోస్తాను అన్నట్లు
29-వాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే మెత్తని బట్టలు కట్టే ఇంజనీర్ అనుకోని కులికిందట ఒక కలికి .
30-ఫర్మ్ వేర్ అంటే బట్టలు బిగుతుగా కట్టుకోవటం కదా మామా అన్నాట్ట
31-అబాకస్ అంటే అబార్షన్ చేయించు కోమన్నంత కంగారెందుకే
32- అనలాగ్ అంటే లాగూలు కూడా ఏమన్నాఅనగలుగుతాయా అన్నా? అన్నట్టు
33-ఇప్పుడంతా డిజిటల్ రా అంటే నేను ఎప్పటినుంచో డిటర్జెంట్ వాడుతున్నానన్నాట్ట
34-వాక్యూం క్యూబ్ అంటే ఐస్ క్యూబ్ కి అన్నా? అని అడిగినట్లు
35-ఈ మెయిల్ పంపరా అంటే అదెందుకు ఆ మెయిల్ లో పంపుతాలే అన్నట్లు
36-గిగా బైట్ అంటే –కుక్కలేకాక గిగాలు కూడా బైట్ చేస్తాయా అని అడిగినట్లు
37-పుస్తకాలు కొనటం దండగ ఈ బుక్ లో హాయిగా చదువుకో వచ్చు అంటే అవి బజార్లో ఎక్కడ దొరుకుతాయని అడిగినట్లు
38-పైతన్ లాంగ్వేజ్ అంటే పైతన్ పాము భాష అని భయపడినట్లు
39-ఓసి నీ ఫేస్ బుక్ లో నా టెక్స్ట్ బుక్కూ
40-వాట్స్ అప్ చూడరా అంటే ‘’వాటీజ్ అప్పా ‘’అని పైకి చూసి’’ ఫాను మామా’’ అన్నట్టు.’
ముళ్ళ మీద కూర్చున్నఫీలింగ్ తో ఇవన్నీ రాసి పక్కింటి నా ఫాన్ కుర్రాడికి అర్జెంట్ గా మెయిల్ పంపి ఊపిరి పీల్చుకున్నా .మాఘమాసం లో ఈ తిట్ల పురాణం ఏమిటి అని, కీర్తి కక్కూర్తికి చెంపలేసుకొని , ప్రాయశ్చిత్తంగా మళ్ళీ ఒకసారి అరుణ పారాయణ చేసి స్థిమిత పడ్డా .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
—
గబ్బిట దుర్గా ప్రసాద్

