నమస్తే -ఇది” సీతా రామయ్యాయణం ”తీపి గుర్తులు కానీ పిడకల వేట కాదు ఇంత విలువైన సమాచారం మన పుస్తకం లో మిస్ అయ్యాము కదా అని బాధ పడుతున్నా . అయినా ఇబ్బంది లేదు శ్రీ ప్రేమ్ చంద్ గారి ఫ్రెండ్ గారి ఆంగ్ల అనువాదం లో చేర్చవచ్చునేమో కనుక్కోండి . ఇలోఆంటీ మీ అనుభవాలు నాకు రాస్తూ ఉండండి అందరికీ పంపి భాగస్వాములను చేద్దాం -మీదు
2017-04-01 20:54 GMT+05:30 Gopala Myneni <gmyneni008@gmail.com>:
అయ్యా, శ్రీ దుర్గాప్రసాద్ గారూ : “కడుపులో కెలుకుతూంటే కక్కుంటే కక్కుంటే పోతుంది”, అనే సామె తను అడ్డం పెట్టుకుని ఈక్రింది విషయాలు మీకు చెప్పుకుంటున్నాను. వేరే ఆడ్ చేయమని కాదు, కరెక్ట్ చేయమని కాదు. నన్ను నమ్మండి . అవేమంటే:1) మా బావమరిది రామక్రిష్ణయ్య గారు ఆఖరు దశలో, మంచంమీద ఉండగా నాకు ఫోన్ చేయించి , “గోపాలకృష్ణ గారూ , మెడిటేషన్ ఎలా చేయాలో చెప్తారా అని అడిగితె అవాక్కయ్యి , తేరుకుని , తప్పక రాసి పాముపుతా లెండి అని చెప్పటం, ఆతరువాత నేను పనిచేసే యూనివర్సిటీ అఫ్ లూయివిల్ లో , ఇంగీష్ డిపార్ట్మెంట్ హెడ్ (అమెరికన్) మెడిటేషన్ మీద వారానికోసారి ట్రైనింగ్ క్లాస్ ఇస్తున్నట్లు తెలిసి, వాకబుచేస్తే తేలిందేమంటే , నా చిన్నపుడు మానాయనమ్మ నేర్పించిన “హరే రామ , హరే రామ , రామ, రామ, హరే, హరే” మంత్రాన్నే వల్లె వేయిస్తున్నారని తెలిసింది . అదే ప్రింట్ చేసి నేను రామకృష్ణయ్య గారికి అదే వ్రాసి , “అది మీ పేరు నే మంత్రంగా వాడు కోవచ్చును, చాలా ఈజీ , మర్చిపోవటానికి వీల్లేని మంత్రం” అని రాశాను. తదుపరి , ఫోన్ చేసి కూడా చెప్పాను . కొలది రోజులకే అయన స్వర్గస్తు లయ్యారు .2) కీ. శే. సీతారామయ్య గారు ఇండియా వచ్చినపుడు , నేను మొదటి సారి అమెరికా నుండి తిరిగి వచ్చి ఉయ్యూ రు మా వరండా లో మా నాన్న గారు నేను ఉదయం కూర్చుని ఉండగా , ఒకాయన రొప్పుకుంటూ వచ్చి మా నాన్న గారిని ఉద్దేశిస్తూ , ” అయ్యా రష్యా నుండి వచ్చిన అనంతరామయ్య గారి తమ్ముడు మిమ్మల్ని గురించి వాకబు చేశారు “, అని చెప్తే , నేను మా నాన్న గారు రిక్షా లో వెళ్లి అయన తోటలో ఇంటి వరండాలో , జనాలు చుట్టి ముట్టి ఉండడం చూస్తుంటే , వారి మనుమడి మమ్మల్ని తీసికొని వెళ్లి తాతగారి దగ్గర ఎదురుగా కుర్చీల్లో కూర్చోపెట్టారు . మానాన్న గారిని , “వెంకట నరసయ్య గారు , వారి అబ్బాయి గోపాలకృష్ణ ఆమ్నెరికానుండి తిరిగి వచ్చారు ” అని చెప్పగా , సీతారామయ్య గారు ఆశ్చ ర్యంగా ” చిన్నపుడు మనిద్దరం కలసి అన్నయ్య దగ్గర చదుకునే వాళ్ళం , గుర్తున్నానా నర్సయ్యగారూ , చాలా మారిపోయారు , ఎక్కడ్నించి , కు మ్మమూరు నుంచేనా రావడం ” అని అడిగితె , మా నాన్న గారు అయన ముఖంలో చూస్తూ “ఊఁ ” అన్నారు. అపుడు ఎవరో “లేదండీ , ఇపుడు ఉయ్యూరు లోనే ఉంటున్నారు ” అని చెప్పారు. అప్పటికే , మా నాన్న గారు మౌన ముద్ర దాల్చి మాట్లాడటం లేదు, అత్యవసరం అయితే కానీ. ఉదాహరణకు .ఉయ్యూరు లో ” బండెక్కు మామ ” అనే ఒక చిల్లర కొట్టు వైస్యులు ఉండేవారు . అయన వచ్చి మా నాన్న గారి తో “మా డా బా అమ్మకానికి పెట్టదల్చుకున్నామండీ , మీకేమైనా కొనే ఉద్దేశ్యం ఉందా “, అంటే “ఊ ” అనటం మా అమ్మగారు విని , ఆయన్ను తిప్పిపంపించేయటం లాంటివి ఎన్నో. డబ్బంతా హరించుకు పోయి , మా అమ్మ గారి మిగిలిన దాని తో మా చదువులకూ ఇంటి ఖర్చుకూ సతతమవుతుం డేవారు . నాన్న గారికి ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లుగా , పిలిస్తేనే స్నానం , భోజంనం చేయటం చేసేవారు . అయన గారు, ఉయ్యూరు బిల్డింగ్ సొ సై టీ కి , గన్నవరం జైలు విసిటింగ్ కమిటీ (జైళ్లలో ఉన్నవారిని హింసకు గురి చేయకుండా ఉండేందుకు)కి ప్రెసిడెంట్ గా ఉండేవారు . ఆ కమ్యూనికేషన్స్ మెయిల్ లో వస్తే చూడకుండానే పారవేయటం చూసి రెసిగ్నే షన్ చేయించాము . ఇదంతా వేరే విషయం , దారి మళ్లింది .సీత రామయ్య గారు నన్ను “అమెరికాలో నేనుండగా (అంటే అయన ఉండగా ) నల్ల వాళ్ళను బాగా వెలివేసి వారు , ఇపుడు కూడాఅ లానే ఉందా ” అని అ డి గితే , నేను నీళ్లు నమలడం చూసి . అయన ” తెలుగు లో ఎక్ష్ప్రెస్స్ చెయ్యటానికి ఇబ్బందిగా ఉంటె , ఇంగిలీషులోనే చెప్పండి” అని అచ్చ తెలుగులో అంటే అవాక్కయ్యాను . ఇంకా నానుండి ఏమీ మాట పిగల లేదు. నా అవస్థ చూసి వదిలేశారు . ఇంతలో యాకమూరు చొప్పరపు సుబ్బారావు (కెసిపి యూనియన్ ప్రెసిడెంటు ), ” అక్కడ , దేవుడ్ని నమ్మరంటగా , మనుషుల్ని 60 సంవత్సరాలు పైబడగానే చంపేస్తారంటగా ” అని ప్రశ్నలవర్షం (కమ్యూనిస్టుల పై వ్యంగ్య ధోరణిలో) కురిపించగా , సీతారామయ్యగారి సమాధానం :” ఇక్కడ మీరు నమ్మిచెడినవారూ లేరు, నమ్మక చెడిపోతే పొయ్యారు ” అంటే “రష్యాలో ” నమ్మక చెడిపోయినవారూ లేరూ , నమ్మిచెడిపోతే పొయ్యారు ” అంటారు . అదే తేడా “. మరి మీ రీడు ప్రశ్న ” 60 వయసు పైబడ్డ వాళ్ళ సంగతి , అదే నిజమైతే నేను బ్రతికి బట్టకట్టి మీముందుండటమే సమాధానం . నేను వేరే ఏమీ చెప్పనవుసరం లేదు ” అని ముగించారు.మాట్లాడినంత సేపూ , చార్మినార్ సిగరెట్ వేళ్ళ మధ్య కాలుతూనే ఉంది . అపుడపుడూ పొడిదగ్గు వస్తుంటే అన్నగారి మనుమడు ఎదో రసం ఇస్తూడేవారు . కాసేపటికి మేము తిరిగి రిక్షాలో ఇంటికి బయలుదేరి వెళ్ళాం .ఇవి సార్ నా గుర్తులు . ఇవి మీకు నేను నన్ను ఏమైనా పరిచయవాక్యాలు రాయ మంటే రాయ నందుకు ఇప్పటివరకూ అపుడపుడూ బాధిస్తూ గుర్తుకొస్తుంటాయ్ సార్. ఆఖరుకు మీరే ఎదో నాతరఫున వ్రాసి సరిపెట్టుకున్నాం. కనీసం నాకు తెలిసిన విధంగా వ్రాసి పంపినా మీరు దాన్ని ఎడిట్ చేసి పెట్టి ఉండేవారని ఇపుడు తెలిసివచ్చింది . నా కంటే, మా సిస్టర్ ఒకావిడ , ప్రేమచంద్ గారు వ్రాసింది చూసి , కొద్దిగా జెలసి(అసూయ ) తో .” వాళ్ళ నాన్న కన్నా , మన నాన్న కే ఎక్కువగా పరిచయంగా, అనంతరామయ్య గా రితో, సీతారామయ్య గారితో కూడా, మరి నువ్వెందుకు రాయ లేదు ” అని మందలించినట్లు గుర్తు.అయ్యా, నన్ను క్షమించాలి. “నేను ఇపుడు ఇoత హడావుడిగా అమెరికా ప్రయాణంలో ఉంటె ఈయన , రామాయణం లో పిడకల వేట లా , పానకం లో పుడ కలా” తగులుకున్నారు” అనుకుంటే మీ తప్పులేదు . ఇక మళ్లీ మీరు అమెరికా వచ్చి , విశ్రాంతి తీసికొని , టైం లాగ్ దాటి న తదుపరి మాట్లాడుకుందాం . అప్పటి వరకూ , మీ. గో

