వరద ´లో తేలి (రి )న తేట ఊట

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -1

1-బెల్లం కొండ రామ దాసు ´త్రిపుట ´కవితలో
´నాడు శాంతి వివస్త్రగా వీధి వెంట నడిచింది లేదు -మనసు చెట్టుకు ఉరితాడుకట్టి మనిషిని ఉరితీసింది లేదు -అమ్మని మారు పేరు పెట్టి తనివి తీర తిట్టుకుంది లేదు -నిప్పు మండుతూ ఉండేది -నీతి నిండుగా ఉండేది
నేడు-పాపం పట్టు పరుపులా పరుచుకుంది -ఇప్పుడు నిన్ను చూస్తూ నన్ను చూడవు -నేను నిన్ను గుర్తించను . కళ్ళలో గుడ్డి  ముళ్ళు మొలిచాయి -మన మధ్య మెయిలు రాళ్లకు అందని దూరం ఉంది-నదిలో రెండు శవాలు -అలా కలిసాం .-నీ గొంతు గుడ్లగూబ వినిపిస్తూనే ఉంది ´
2-దేవర కొండ బాల గంగాధరతిలక్ -స్వయం కృషితో ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు .దీనికి కారకుడు పాలగుమ్మి పద్మ రాజు …ఒకసారి వరద ´వచనకవిత్వం మిల్లు ఖద్దరు లాంటిది ´అని తిలక్ కు జాబు రాస్తే ´ఇంత చక్కని పదం నాకు తట్టలేదు ´అని జవాబు రాశాడు . ఈడిపస్ నాటకాన్ని తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేశాడు తిలక్ .కానీ చేయలేదు చేస్తే అబ్బూరి రామకృష్ణా రావు ప్రదర్శించి ఉండేవారు .
3-పాలగుమ్మి పద్మ రాజు -పద్మ రాజు చిన్నతనం లో రాసిన కవిత్వం విని చెళ్లపిళ్లవారు ´నువ్వుకవిత్వం రాయగలవు .నీకు సామర్ధ్యం ఉంది పో ´అని ఆశీర్వదించారు . అతనిమీద కవిత్వం చెప్పమని జలసూత్రం అడిగితె -´వీడెవడి పా .ప. రా -ఊయేల ఊపరా -చనుబాలు చేపరా ´అని చెప్పాడు వరద .
4-బైరాగిని కవిత్వం లోకి దించిన పాపం నాదే అన్నాడు వరద .కవిత్వాన్ని నమ్మకుండా ఆరాధించినవాడు బైరాగి
5-శిష్ట్లా ఉమామహేశ్వరరావు -´ప్రాహ్లాద కవిత్వ ´వ్యాప్తి కోసం తంటాలు పడ్డాడు .శ్రీ శ్రీ ఇష్టపడేవాడుకాదు ´శాంతిని ´అనే పత్రిక నడిపాడు ఉమాయ్ .సైన్యం లో కూడా చేరాడు .ఎప్పుడూ ఫుల్ గ మందు కొట్టి ఊగిపోతూ ఉండేవాడట .నవయుగాని కి తాను  ద్రష్ట అని భ్రమించేవాడు .ఒక రోజు ఉమాయ్ ,శ్రీ శ్రీ లు మద్రాస్ డేవిడ్ కపే  లో మాటమాటావచ్చి చొక్కాలు పట్టుకున్నారట . ఆ కోపం లో శ్రీ శ్రేణి చంపేదాకా నిద్రపోను అన్నాడట
  ´వెర్స్ లిబర్ ´అనేది శిష్ట్లా తోనే ప్రారంభం .కానీ అందులో పరిపూర్ణ ప్రావీణ్యం సంపాదించకుండా ప్రయోగాలు చేశాడు అంటాడు వరద .ఆంగ్ల సాహిత్యాన్ని అవపోసన పట్టాడుకాని తెలుగు సాహిత్యం లో ప్రవేశం తక్కువ ఉమాయ్ కి ..తెలుగు సాహిత్యం లో నిర్దేశిస్తున్న నవీన మార్గానికి మార్గదర్శి అనే అహంభావం ఉన్నవాడు .మార్గ దర్శిగా ఉన్నాడుకాని అందులో ప్రయాణించలేకపోయాడని వరద బాధ .,శివ శంకర శాస్త్రి,విశ్వనాధ కితాబిచ్చారు .ఆతను రాసిన కొద్దికవితలు కలకాలం నిలిచిపోయేవే ;´జ్ఞాపకాలు ´అనే గీతం  వెర్స్  లిబ్ర్  ´లో తలమానికం ఎజ్రా పౌండ్ గుర్తుకొస్తాడు . శతాబ్ది చైనా కవి ´రిహాకు ´రాసిన పాటల్ని ఉమాయ్ ఇంగిలీషు లో అనువదించాడు .అందులో ´నదీ వ్యాపారి భార్య ,ఉత్తరం ´అద్భుతం .ఆతను చదివే తీరు చాలా గొప్పగా ఉండేది .ఆతను తాదాత్మ్యం చెంది పాడుతుంటే గుండె కదిలి కరిగిపోయేది అన్నాడు వరద
´జ్ఞాపకాలు ´లో కొన్ని చరణాలు -నా పేరు లీల -ఆ ఊరి గోల పడలేక నేను పొరుగూరొ  -చ్చాను -అందాలావాడే అడవిలో  ముంచాడు -అందర్నీ తలచుకొని అల్లాడుతున్నాను —´ఉయ్యాలలో పిల్ల ఉబుసులేలేవు -నా చన్నులో పాలు జున్ను లెత్తాయే -హాయమ్మ కెవ్వరూ హాయన్న వారూ -నీలాల సంద్రములో నిప్పచ్చరం నేలపై -రాయినై అహల్యనయ్యాను -శ్రీరామ చంద్ర మూర్తీ రామ రామ నా పేరు లీల ´
6- కుందుర్తి ఆంజనేయులు -విశ్వనాధ శిష్యుడు ఆన్జనేయులు మా ర్క్సిస్టు అయ్యాడు .అనిసెట్టి బెల్లం కొండా లతో కలిసి కొత్తరకం గా రాసేవాడు శ్రీశ్రీ సంప్రదాయ మాత్రాఛందసునే వాడాడు . కుందుర్తి అభ్యుదయ కవిత్వం లోకి దిగాడు .గురువుగారి చాదస్త0 పట్టుకున్నది.  తనది ´వచన కవిత్వం ´అన్నాడు
´మీరందరూ రాయటం మానేశారు .మొత్తం నా మీదే పడింది భారం ´అన్నాడు వరద తో .సాధించి తీరుతానన్నాడు .వరద ´నీకు ప్రతిభ ఉంది భాష మీద అధికారం ఉంది .వ్యర్థం చేసుకోకు .నీ సంగతి నువ్వు చూసుకొనిరాణించు ´అని వరద సలహా ఇచ్చాడు .వచనకవితలో భారత ,భాగవతాలు రాస్తే అది నిలబడుతుందని ఊహించాడు .వచనకవిత రాసిన ప్రతివాడి నీ బుజం తట్టి ప్రోత్సహించాడు .భావకవిత్వం పై ఎలర్జీ పెంచుకున్నాడు .యెంత వచనకవితా రాసినా విశ్వనాధపై ఆరాధనా భావం ఇసుమంతకూడా తగ్గలేదు .ఆయన కవిత్వాన్ని ఆరాధిస్తూ చిరస్మరణీయ పద్యం చెప్పాడు కుందుర్తి –
´నీ వాంధ్రాఖిల నీవృతా దృతుడవై నీలో కవిత్వాపగల్ -ప్రోవుల్ పడ్డ రసాత్మవై మృదులంతా ముగ్ధంబులున్ -భావ ప్రౌఢములైన నీ పలుకులాస్వాదించి ,నీ
ఈ వైదగ్ధ్యము లోన  నొక్కను వుగా  నీ కావ్య ముప్పొంగితిన్ ´అని కీర్తి శిఖరం ఎక్కించాడు . ఈ పద్యాన్ని నేను నిరుడు ఫిబ్రవరి లో బెజవాడలో జరిగిన విశ్వనాధ సాహితీ వైభవం ´సదస్సులో నా పరిశోధన పత్రం ´విశ్వనాధ -యువతపై ప్రభావం ´లో ఉదాహరించాను ..
   కుందుర్తి ´హంస యెగిరి పోయింది ´ఖండిక అతని ప్రతిభా సంపదకు గీటు రాయి అన్నాడు వరద .దీనిలో  మనిషికి కవిత్వానికి కావాల్సింది మానవత్వం కానీ మార్క్సిజం కాదు అని రుజువు చేశాడు కుందుర్తి .మరో సారి గురుపాదుల అడుగు జాడలలో నడిచాడు  . 

7- జల సూత్రం రుక్మిణీనాథ శాస్త్రి -ఒక సారి ద్రౌపదీ మాన సంరక్షణ నాటకం చూస్తున్నారు జరుక్ శాస్త్రి , వరద వగైరా ,ద్రౌపది ´సహించరా సహింతురా ´అని పాడుతోంది.  జరుక్ వెంటనే పేరడీగా ´రమింతురా రమింతురా రాజాధిరాజుల్ ´అని గట్టిగా పాడాడు .ప్రక్కవాళ్ళు కేకలేసినా ఆగలేదు . పాండవ పక్షపాతి నోర్ముయ్ అన్నాడు శాస్త్రి .వరద ´నువ్వే నోర్మూసుకో ´అన్నాడు అందరూ గోల చేశారు .పోదాం పద అని బయటికి దారి తీశాడువరద ఆగలేక శాస్త్రి ´ద్రౌపది వీ ళ్ల పెళ్ళాం గాఉల్ను  ´అన్నాడు .అంతే అందరూ కలిసి బలవంతాన ఇద్దర్నీ  హాలుబయటికి నెట్టేశారు ´ఈ వెధవలకి సాహిత్యం మజా ఏం తెలుసు ?;´అన్నాడు శాస్త్రి -ఇంటికి వెళ్లి ఈ విషయం అంతా  చలం గారికి చెప్పారు .ఆయన నవ్వుతూ చింతా దీక్షితులుగారికి చెప్పి శాస్త్రితో ´ఈ దేశం లో పబ్లిక్ గా యెగతాళి చేయరాదని ఇప్పటికైనా తెలుసుకున్నావా ´అన్నారు .
  స్వామి శివ శంకర శాస్త్రి ఒక పద్యం లో ´నీవు స్త్రీ జాతి యందు జనించు కతన ´అని రాస్తే జరుక్ ´అదేం జాతి అయ్యా ఎక్కడైనా విన్నావా ´అని నవ్వి అబ్బూరి రామకృష్ణారావు బందరులో చెప్పిన పద్యం చదివాడు –
´చాలా సామ్యంబు కలదట సాహితీ స -భాపతికిని ,మన ´రాసభా´పతికిని -అర్ధ మెరుగని శబ్దమ్ము లతడు మోయు -తావి ఎరుగని గంధ మీతడు వహించు ´అన్న పద్యం చదివితే చలం గారు పకపకా నవ్వారు .
  జరుక్ రాసినవి చాలా కాలగర్భం లో కలిసిపోయాయి .రాసినవి అచ్చు వేయాలనే తపన ఉండేదికాదు .శాస్త్రీమీద వరద ´రుక్కుటేశ్వర శతకం ´రాశాడు -శతక  మంజరి లోని వివిధ శతకాలలో పంక్తులు తీసుకొని శాస్త్రికి అన్వయించి ´రుక్కుటేశ్వరా ´అని తగిలించి రాసిన శతకమిది  .ఇందులో ఒక్కటే వరద   సొంత పద్యం.  ఇదొక కొత్త ప్రయోగం . అందరూ మెచ్చారు .దీన్ని శ్రీ శ్రీ స్తే ఎక్కడో పారేశాడు .
´వైదికులు పరిభాష ´అనే విషయం పై పెద్ద పుస్తకం రాసే ప్రయత్నం చేశాడు జరుక్ .శాస్త్రిపై వరద చెప్పిన పద్యం బాగుంది –
´దూకుడు దూకుడై నడక దుందుడు కొప్పగ చూపు ,నోట,వై
 దికుల పల్కు వేట ,కర దీపముగా సిగరెట్టు  దాల్చి ,మా
ఈ కవి మూక జేరితివి ఇంతటితో సరిపెట్టి మమ్ము ,కా
ఫీ  కయి కొంప పీకకు ,శపింపకు ,చంపకు రుక్కుటేశ్వరా ´
  తర్వాత ఎప్పుడో శ్రీశ్రీ ,ఆరుద్ర కలిసి రుక్కుటేశ్వర శతకం ప్రారంభించి కొన్ని పద్యాలు  అచ్చేశారు .అందులో మొదటిది –
´వచియించె´వరద ´లోగడ -రచియింతునని ఋక్కుటేశ్వర  శతక మును ,మే
 మచలిత ధైర్యమ్మున నా -మ చౌర్య మొనరించినాము మన్నించు జరూ ´
  శాస్త్రి అన్నిట్లోనూ వేలు పెట్టాడు అభ్యుదయకవులతో తిరిగాడు అతి వాస్తవిక ధోరణి అనుసరించాడు .ఇంగిలీషు రాలేదని బాధ గా ఉండేది .ఎన్నికలలో శ్రీ శ్రీ కి మతి పోయినప్పుడు శాస్త్రి చాలా బాధ పడ్డాడు . ´దారి తప్పిన పిల్ల ´అనే సుదీర్ఘ కావ్య ఖండాన్ని  రాస్తున్నట్లు వరదకు జాబు రాశాడు .రాశాడో లేదో తెలియదు .´మైల నిఘంటువు ´అనే పల్లె .పట్టణాల పేర్లు అశ్లీల పదాలకు పర్యాయ పదంగా సమకూర్చాడు శాస్త్రి . అదెక్కడాఅంతర్ధానం అయిందో తెలీదు. అతి వాస్తవిక ధోరణిలో ´లింగ తాండవం ´లఘుకావ్యం రాశాడు .దీన్ని శ్రీరంగం నారాయణ బాబు కు అంకిత మిచ్చాడు .ఇది చెప్పుకోదగ్గ కావ్యమన్నాడు వరద . ఇందులోని కవిత్వం అంతా  శ్రీ శ్రీకి కంఠతా వచ్చట.  రుక్మిణీనాథ శాస్త్రికి సాహిత్యం ముఖ్యంగా కవిత్వం పై ఉన్న అభిరుచి వైనం ఆ రోజుల్లో మారెవ్వ రికీ  లేదు అని వరద తీర్మానం చేశాడు .చెళ్ళపిళ్ళ వారి భాషలో ´జలసూత్రం అంత ´విన్నాణి ´ని మనం చూడం .
ఆధారం -వరద రాసిన ´కవన కుతూహలం ´
  సశేషం
 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.