వీక్లి అమెరికా -1

 వీక్లి అమెరికా -1
అమెరికా లో నార్త్ కరోలినా లో ఉన్న షార్లెట్ కు 6 రాత్రికి రావలసినవారం 7 మధ్యాహ్నానికి చేరాం .ఆ ప్రహసనం అంతా ముందే రాశా . ఇక నుంచి ప్రతి సోమవారం ఆ వారం లో జరిగిన విషయాలను ” వీక్లీ  అమెరికా ”శీర్షిక లో రాయాలనుకొని మొదటి వారం విషయాలు సంక్షిప్తంగా రాస్తున్నా .
  న్యూ యార్క్ లో వాషింగ్టన్ కు వెళ్లే జెట్ బ్లూ ఫ్లయిట్ 4 గంటలు లే ట్ అయినందున ప్రయాణీకులకు ఒక్కో టికెట్ కు 16 డాలర్ల ఫుడ్ ఐటమ్స్ ఫ్రీ గా కొనుక్కోమని కూపన్లు ఇచ్చారు .మాకిచ్చిన 32 డాలర్లకు మంచినీళ్లు  స్ఫ్రీ ట్ , కోలా, లే   మింట్ వగైరా కొన్నా . ఎమిరేట్ ఫ్లయిట్స్ లో ఫుడ్ బాగానే పెట్టారు జైన్ వెజిటేరియన్ అడిగాం .నానబెట్టినవి ఉడకబెట్టినవి సెనగలు బఠాణీలు పెట్టారు . బ్రేడ్ బటర్ మామూలే .కాఫీ పైనాపిల్ బాగానే ఇచ్చారు . న్యూయార్క్ నుంచి డి సి విమానం లో వాటర్ బాటిల్ ,చిప్స్ పాకెట్ ఇచ్చారు . కస్టమ్స్ క్లియరెన్స్ కూడా వేగంగానే జరిగింది . 6 నెలలు ఉండటానికి వీసా ఇచ్చారు . తోపుడు బండి -వీల్ చైర్ వలన చకచకా పనులు జరిగాయి .లేకపోతె ఎటు బయల్దేరి ఎటు వెళ్ళాలో తెలుసుకోవటం అగమ్యంగా ఉంటుంది . వాళ్ళూ మంచి వాళ్ళే దొరికారు . అయితే కొంతచేయి తడపాల్సి వచ్చింది అంతే తప్పదు . డిసి లో కారులో బయల్దేరి ఒక చోట కాఫీ తెచ్చుకొని తాగాం ఆ తర్వాత నాన్ స్టాప్ ప్రయాణం .
  షార్లెట్ రాగానే మా అమ్మాయి కాఫీ కాచి ఇచ్చింది . తాగి కొంత సామాను సర్దామ్ . దారిలో మైనేనిగారికి రెండు సార్లు ఫోన్ చేసాం లిఫ్ట్ చేయలేదు . భోజనం చేసి విశ్రాంతి తర్వాత మిగిలిన బాగేజ్ విప్పి సర్దేశామ్ . వరద పుస్తకం చదివా  5 పేజీలు . రాత్రి నిద్రపోదామని ప్రయత్నిస్తే కాళ్ళు కొంకర్లు పోయాయి భయమేసింది .నెమ్మదిగా మంచం దిగి కాసేపు నడిచి ,హాలులో సోఫాలో పడుకుంటే కొంత త గ్గి నిద్ర బాగా పట్టింది తరువాతనిద్రకు ఇబ్బందికలగ లేదు పిలిస్తే పలుకుతోంది .
  శనివారం  మైనేని గారు ఫోన్ చేశారు . సంధ్య పూజ డ్రైగా అంటే నీళ్లు లేకుండా పూలు లేకుండా చేశా . విజ్జి ద్యూటీకి వెళ్ళింది సాయంత్రం అల్లుడు అవధాని నన్నూ మా మనవళ్ళు ఆశుతోష్ పీయూష్ లను లక్ష్మి రవి ఇంటికి అరగంట డ్రైవ్ చేసి తీసుకు వెళ్ళాడు .అక్కడ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభి షేకం జరుగుతోంది .లక్ష్మి ద్సపతులను అయిదేళ్ల తర్వాత ఇదే మళ్ళీ చూడటం చాలా మర్యాదగా ఆహ్వానించారు . ఇక్కడ  హిందూ  సెంటర్ లో 16 ఏళ్ళు చీఫ్ ప్రీస్ట్ గా ఉన్న ఆరవాయన గ్రీన్ కార్డు రాగానే మానేసి వైదికం చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యం లో అభిషేకం జరుగుతోంది .ఉత్సాహ వంతులైన యువకులు మా అల్లుడూ స్వరం కలిపారు . 8 వ రుద్రంనుంచి నేనూ జత కలిశాను .అయేసరికి రాత్రి 8 అయింది .భోజనాలు ఏర్పాటు చేశారు 30 మందిదాకా వచ్చారు అమెరికన్ లేడీస్ కూడా  ఉన్నారు . లక్ష్మి దంపతులకు సరసభారతి ప్రచురణలు -సువర్చలాన్జనేయ శతక త్రయంకొ లచల సీతారామయ్య ,దైవ చిత్తం ,సిద్ధ యోగ పుంగవులు కానుకగా ఇచ్చాను .మా అమ్మాయి సాయంత్రం ఆరున్నరకు ద్యూటీఅయ్యాక యూని వర్సిటీ నుంచి మా పెద్దమనవాడు సంకల్ప్ ను పికప్ చేసుకొని వాళ్ళ అమ్మను  పెద్దకొడుకు శ్రీకేత్ ను తీసుకొని వచ్చింది .అందరం భోజనం చేసి ఇంటికి రాత్రి 9 30 కు చేరాం  రాత్రి కాసేపు వరద ను చదివా
  ఆదివారం  విజ్జికి సెలవు యధా ప్రకారం పట్టుబట్టకట్టి సంధ్య పూజాదులు చేశా . వీలున్నప్పుడల్లా వరద చదివా .ఇండియాకు ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడాం . సాయంత్రం మనవడిని రైల్వే స్టేషన్ దగ్గర దింపి మా అమ్మాయి నేను  సామ్స్ కు  వెళ్లి కావలసిన పాలు వగైరా కొని ఇంటికి వచ్చాము .
  ఇవాళ సోమవారం యధా ప్రకారం పూజ చేసి నాకు ఇచ్చిన లాప్ టాప్ సహాయం తో రాయటం మొదలు పెట్టా .ముందుగా అమెరికా ప్రయాణం లో పదనిసలు రాశా . మధ్యాహ్నానికి వరద చదవటం పూర్తి చేసేశా .సాయంత్రం దహగం లక్ష్మీ నారాయణ పై ఆర్టికల్ రాశా .
  కారీ నుంచి డా యల్లాప్రగడ సుబ్బారావు గారి మనవడు డా రామ మోహన రావు గారు ఫోన్ చేసి మాట్లాడారు .అయన బావ గారు డా. బండారు వారికి  హార్ట్ ఎటాక్ వచ్చి 3 స్టెంట్ లు వేయాల్సి వచ్చిందని ,ఇంటికి వచ్చారని కులాసా అని అందుకని మేము రాగానే ఫోన్ చేయలేక పోయానని అన్నారు .వారిది రేపల్లె .మా బాబాయి రాయప్రోలు శివరామ దీక్షితులు గారింటి ప్రక్కనే వారిల్లుట .బాబాయి పిన్నీ కొడుకు సుబ్బులు కూతురు పిచ్చాలు అందరూ బాగా తెలుసాయనకు . మా బాబాయి గొప్పతనం గురించి మురిసి పోతూ చెప్పారు ,
  మమ్మల్ని తాము వచ్చి వారింటికి కారీకి స్వయం గా తీసుకు వెడతామని ,మైనేని దంపతులనూ ఆహ్వానించానని అందరం అక్కడ కలుద్దామని అన్నారు చాలా సంతోషం అన్నారు . మన పుస్తకాలన్నీ మైనేని గారు పంపగా చదివానని గొప్ప కృషి అని అన్నారు .వారి బావగారు బండారు వారికే గీర్వాణ కవుల కవితా గీర్వాణం -మూడవ భాగం అంకితం చేయాలని మైనేని గారికి చెప్పటం నేను ఓకే అనటం ,దాని ముద్రణకు రామమోహన్ రావు గారే స్పాన్సర్ అని మైనేని గారు ముందే చెప్పారు .ఈ విషయం శ్రీ హేవిళంబి ఉగాది  వేడుకలలో ప్రకటించామని మీకు గుర్తు ఉండేఉంటుంది . అలాగే ”ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”పుస్తకాన్ని మైనేనిగారి బావమరిది గారు డా పరుచూరి రామ కృష్ణయ్యగారికి అంకితం చేస్తున్నట్లు దాని ముద్రణ ఖర్చు రామ క్రిష్నయ్య ఫౌండేషన్ ట్రస్ట్ స్పాన్సర్ గా ఉంటుందని ట్రస్ట్  నిర్వాహకులు శ్రీ పరుచూరి శ్రీనాధ్ గారు ఉగాది వేడుకలలో తెలియ జేసిన సంగతి మీకు తెలుసు .మంచి పనికి ఎందరు ఎన్ని విధాలుగా సాయం చేస్తారో మనకు తెలియదు వారి సౌజన్యం అలాంటింది .పుస్తకాలు ముద్రించాలని నేను రాయలేదు విషయాలు అందరికి తెలియాలని నెట్ లో రాశాను . అవి పుస్తక రూపం దాల్చటం యాదృచ్చికం దైవ నిర్ణయం ,సహృదయ  స్పందనం .నేను నిమిత్త మాత్రుడిని .  మేము షార్లెట్ వచ్చి అప్పుడే నాలుగు రోజులయింది .
 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.