గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3
93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి (1901-1994)
బ్రాహ్మణ కుటుంబం లో అర్చకత్వ శాఖలో 1901 లో జన్మించిన లక్ష్మణ శాస్త్రి జోషి 14 వ ఏటకృష్ణానదీ తీరాన ఉన్న దేవాలయాలకు నిలయమైన’’ వాయి ‘’గ్రామం చేరిసంస్కృతంలో , హిందూ ధర్మ తత్వశాస్త్రాలలో నిధి అయ్యాడు . అక్కడ సంస్కృత పాఠశాల నెలకొల్పాడు దీనిలో సంస్కృతం నేర్పటానికి ఆంద్ర నుంచి సంస్కృత పండితులు వచ్చేవారు . తర్క శాస్త్రం లో ప్రావీణ్యం పొంది తర్క తీర్ధ అయ్యాడు . భారత స్వాతంత్రానంతరం ఏం యెన్ రాయ్ వంటి వారి ప్రభావానికి గురై ,పాశ్చాత్య తత్వ శాస్త్రాన్ని అవలోడనం చేశాడు .ఆనాడు సంస్కృతం లో పేరున్నవారు ,వారిని అనుసరిస్తున్నవారు నిజమైన హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారా అనే ఆలోచనలతో ‘’వైదిక్ సంస్కృతీ చ వికాస్ ‘’అనే గ్రంధాన్ని 19 51 లో రాశాడు .ఇవి పూనా యూనివర్సిటీలో ఇచ్చిన ఆరు ఉపన్యాసాల సారాంశం .వేద సంస్కృతీ ఆవిర్భావం భారత దేశం పై దాని ప్రభావాలను ఇందులో వివరించాడు . ఆధునిక భారతీయులు భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్య నలిగి పోతూ దారి తెలియక బలహీనులై పోతున్నారని చెప్పాడు .దీనివల్ల సామరస్యం కోల్పోయి కులమత వర్గాలలో కూరుకు పోయారని వ్యధ చెందాడు . తన మేధో వికాసనాన్ని చూపినందుకు 19 55 లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు పొందాడు .సాంప్రదాయ చాందస భావాలను త్యజించాలని పిలుపు నిచ్చాడు జోషీ .
సంప్రదాయాన్ని ధిక్కరించి గాంధీ మహాత్ముని అనుచరుడై ఉద్యమించాడు .అస్పృశ్యత నివారణకు హరిజనుల దేవాలయ ప్రవేశానికి పూనుకొని సఫలుడయ్యాడు . హిందూ ధర్మం పై ఎవరికి ఏ సందేహం వచ్చినా జోషీ తీర్పు ఫైనల్ గా ఉండేది . 1932 లో ఆయన 29 వ ఏట స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలు లో పెట్టింది . జైలులో ఉండగా హిందూ ధర్మ పండితునిగా దేశవ్యాప్త కీర్తి పొందాడు .వినోబాభావే వాయి గ్రామం వచ్చినప్పుడు ఆయన సలహాతో కేవలానంద సరస్వతి వద్ద ఇంగిలీషు నేర్చాడు .గాంధీ గారు కోమటి కులానికి చెందిన తనకుమారుడు రామ దాసుకు బ్రాహ్మణ కులానికి చెందిన చక్రవర్తుల రాజగోపాలాచారి గారి కూతురు లక్ష్మి నిచ్చి కులాంతర వివాహం చేస్తే హిందువులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు .రెండవ గవర్నర్ జనరల్ గా ఉన్న రాజాజీ యువకుడైన జోషీ పండితుని ఈ వివాహం హిందూ ధర్మసమ్మతమమో వ్యతిరేకమో తేల్చి చెప్పమని కోరాడు .సర్వ శాస్త్ర పారంగతుడైన జోషి అది హిందూ ధర్మ సమ్మతమేనని తీర్పు చెప్పటమేకాక దగ్గరుండి వివాహం జరిపించి చరిత్ర కెక్కాడు .
19 60 లో మరాఠీ భాషా బి వృద్ధికోసం జోషీ ‘’మరాఠీ కోశం ‘’తయారు చేశాడు .’’విశ్వ కోశం’’ అనే విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేశాడు . .వేదమంత్రాల నాధారంగా మరా ఠీ భాషలో ‘’ధర్మకోశం ‘’రాశాడు .లక్ష్మణశాస్త్రి జోషీ విద్వత్తును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1976 లో పద్మ భూషణ్ ను ,19 92 లో పద్మ విభూషణ్ పురస్కారాల నిచ్చి గౌరవించింది .బాంబే యూని వర్సిటీ ఎల్ ఎల్ డి డిగ్రీ ప్రదానం చేసింది .ప్రధమ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రు ఉన్నత విద్యకు, భారీ పరిశ్రమలకు కేటా యిస్తున్న నిధులపై హర్షం వ్యక్తపరచిన దూర దర్శి జోషి . 94 వ వ ఏట 1994 లో జోషీ పండితుడు మహా ప్రస్థానం చెందాడు .
జోషీ పండితుడు ప్రప్రధమంగా సంస్కృతం లో ‘’శుద్ధి సర్వస్వము ‘’అనే గ్రంధాన్ని రాసి కులాంతీ కరణ ఎలా చేయాలో వివరించాడు . 26 భాగాలతో 18 వేల పేజీలతోక్రీ పూ 1500 కాలం నుండి 18 వ శతాబ్దం వరకు ఉన్నా హిందూ ధర్మాన్నిసకల వేదం శాస్త్రాలు వాటి వివిధ వ్యాఖ్యానాలు కూలం కషంగా అధ్యయనం చేసి నిగ్గు తేల్చి ‘’ధర్మ కోశం ‘’అనే ఉద్గ్రంధాన్ని రచించాడు . మరాఠీ భాష లో ‘’ఆనంద- మీమాంస’’ అనే గ్రంధాన్ని రసం సౌందర్యం లను చర్చిస్తూ రాశాడు . 1940 లో సంస్కృతం లో’’ హిందూ ధర్మం ‘’ గ్రంథ రచన చేశాడు .భారత ,పాశ్చా త్య దేశాలలో భౌతిక ప్రవ్రుత్తి తత్వ శాస్త్ర విధానాలపై తులనాత్మక పరిశోధన చేసి హిందూ యిజం జాద్వాడ్ పుస్తకం 1941 లో రాశాడు . 1958 లో ‘’వైదిక సాంస్కృతిచ వికాస్ ‘’గ్రంధం రాశాడు . .1 8 ఉపనిషత్తులను మరాఠీ లోకి అనువదించైనా సాహితీ మూర్తి జోషీ .
సశేషం
బాబాసాహెబ్ అంబే ద్కర్ జయంతి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

