—
గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3
94-స్వామి సత్యసంగా నంద సరస్వతి -(1953_
1953 లో పశ్చిమ బెంగాల్ చందర్ నగర్ లో జన్మించిన స్వామి సత్య సంగానంద సరస్వతిని ‘’స్వామి సత్సంగీ ‘’అని గౌరవంగా పిలుస్తారు.చిన్నతనం నుంచి ఆధునిక సంప్రదాయం వేషభాషలలో పెరిగినా ఆమెకు అనేకమైన ఆధ్యాత్మికానుభవాలు దర్శనమవటం తో అన్నీ పరిత్యజించి స్వామి సత్యానంద సరస్వతి గురువు అనుగ్రహం తో దశమి విధానం లో 6-7-19 82 లో సన్యాసిని అయింది .తరువాత గురువు సత్యానందం తోకలిసి దేశమంతటా విదేశాలలోని విస్తృతంగా పర్యటించింది .గురువు అనుగ్రహం పుష్కలంగా లభించటంవలన మంత్రం తంత్ర వేదం తత్వ శాస్త్రాలలో మహా నిధి అయింది .యోగం తంత్రం లపై అద్భుతమైన గ్రంధాలు రాసి వాటికి అందరికీ కరతలామలకం చేసింది .ఆమె రాసిన ‘’విజ్ఞాన భైరవ తంత్ర ‘’చాలా ప్రసిద్ధమైంది .శ0కరాచార్యుల వారి ఆధ్యాత్మిక గ్రంధ0 సౌందర్య లహరి కి అనుభూతిపరమైన గొప్ప వ్యాఖ్యాన0 రచించింది .’’తత్వ శుద్ధి ‘’అన్న ఆమె గ్రంధం చాలా వ్యాప్తి చెందింది .’’ది తాంత్రిక్ సైన్స్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్ ‘’గ్రంధం లో ఆంతరిక శుద్ధిని చక్కగా వివరించింది .పరంపరాగతం గా వస్తున్న యోగ తంత్రాలను ఆధునికకాలానికి అన్వయిస్తూ ఆమె చెప్పిన తీరు బహుధా ప్రశంశనీయం
19 89 లో స్వామి సత్యానందం తన అంతర్ దృష్టిలో దర్శించిన జార్ఖండ్ లోని రిఖియా అనే ప్రదేశానికి వెళ్లి అక్కడ నిర్జన ప్రదేశం లో ఒక ఆశ్రమాన్ని నిర్మించి యోగ సాధన చేయాలని సంకల్పించాడు .అదే సత్యానందం తపోభూమి అయింది .దానికి దారి రోడ్డు ఫోను కరెంట్ కూడా లేని అతి చిన్న ప్రదేశం . 21 వ వ శతాబ్దపు ఆధునీకతకు కు అత్యంత సుదూరం లో ఉన్నది .1 989 లో రిఖియా గ్రామం దర్శించి గురువుగారి రాకకు అన్ని ఏర్పాట్లు చేసింది .అప్పటినుంచి అక్కడే ఉండిపోయి సమాజం చేత బహిష్కరింపబడిన సమాజం దృష్టిలో లేని అదో జగత్ సహోదరులకు అన్నీ తానె అయి వారి సర్వతోముఖాభి వృద్ధికి తీవ్రంగా కృషి చేసింది .ఆ ఆశ్రమానికి శివానంద మఠం అని పేరుపెట్టింది .ముంగేరులో ఉన్న ఆ ప్రాంతం ఆమె అవిరళ కృషివలన గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది .
2007 లో సత్య సంగానంద సరస్వతి రిఖియా పీఠ్ కు పీఠాధిపతి అయింది .శివానంద సరస్వతి బోధించిన సేవ ,ప్రేమ దానం అనే మూడింటిని త్రికరణ శుద్ధిగా అనుసరించి అక్కడి ప్రజల భౌతిక ఆధ్యాత్మిక అభి వృద్ధికి అంకిత భావం తో కృషి చేస్తోంది .గురు వరేణ్యులైన శివానంద సత్యానంద సరస్వతుల అడుగు జాడలలో నడుస్తూ దేశ విదేశాలలో వారి భావ ధా రను వ్యాప్తి చెందిస్తూ గురువుకు తగిన శిష్యురాలుగా సేవలందిస్తోంది .
సశేషం
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలతో –
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా
