గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
95- సతీష్ చంద్ర విద్యాభూషణ్ (1870-1920)
మహామహోపాధ్యాయ డా సతీష్ చంద్ర విద్యాభూషణ్ 30-7-1870 న ఇస్లామిక్ బంగ్లాదేశ్ లో ఫరీద్ పూర్ లోని కాల్కువ గ్రామం లో జన్మించాడు తండ్రి పీతాంబర విద్యా వాగీశుడు ప్రముఖ సంస్కృత పండితుడు .అన్న విశ్వంభర జ్యోతిష్ర్ణవ ఇతనికంటే 12 ఏళ్ళు పెద్ద .మిడ్నపూర్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ గంగాధర ఆచార్య కుమార్తెను 18 89 లో పెళ్లి చేసుకున్నాడు .అయిదవ ఏటనే విష్యాభ్యాసం ప్రారంభించి తోటి వారిలో తలమానికంగా నిలిచాడు .ప్రవేశ పరీక్షలో ఆ డివిజన్ ఫస్ట్ వచ్చి నవద్వీప్ లో హిందూ స్కూల్ లో చేరాడు . 1888లో కలకత్తా యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్ష పాసై స్కాలర్షిప్ పొంది సిటీ కాలేజీలో చేరాడు .ఎఫ్ ఏ పాసై కృష్ణానగర్ కాలేజీ కు వలసవెళ్లాడు . 1892 లో సంస్కృతం లో బి ఏ ఆనర్స్ పొందాడు . 1893 లో కలకత్తా యూ ని వర్సిటీనుంచి ఏం ఏ సాంస్క్రిట్ డిగ్రీ సాధించాడు .నవద్వీపం లోని విదగ్ధ జనని సభ నిర్వహించిన సంస్కృత భాషా సాహిత్య పోటీలో విజయం సాధించి ‘’విద్యాభూషణ ‘’పొందాడు . 1893-నుండి రెండేళ్లు సంస్కృతకావ్యాలను మహామహోపాధ్యాయ అజిత్ నాధ న్యాయ రత్న వద్ద అభ్యసించాడు .సంస్కృత న్యాయ శాస్త్రాన్ని మహామహోపాధ్యాయ జరునాధ సార్వ భౌమవద్ద చదివాడు 1897 -1900 వరకు టిబెట్ భాషను ప్రముఖ లామా ఫంగ్ చాంగ్ వా0గ్ డాన్ వద్ద లాసా లో నేర్చాడు . 1901 లో పాళీ భాషను శ్రీలంక బర్మా షర్మాన్ వద్ద చదివి పాళీ లో ఏం ఏ సాధించాడు
1893 లో కృష్ణానగర్ సంస్కృతకాలేజిప్రొఫెసర్ గా చేరి ,బౌద్ధ సొసైటీ ఆధ్వర్యం లో పాళీ భాషలో పుస్తకాలకు సంపాదకత్వం లో ప్రచురించాడు 1897-90 వరకు డార్జిలింగ్ లో గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో టిబెటన్ -ఇంగిలీషు నిఘంటు నిర్మాణం చేశాడు . 1900 లో కలకత్తా వచ్చి కలకత్తా కాలేజీ సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు . 1906 లో గవర్నర్ జనరల్ మహా మహోపాధ్యాయ బిరుదు ప్రదానం చేశాడు 1908లో కలకత్తా యూనివర్సిటీ పి హెచ్ డి నిచ్చింది . 1910 లో సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్ అయ్యాడు
సతీష్ చంద్ర 1897 లో బెంగాల్ భాషలో ఆత్మతత్వ ప్రకాశం రాశాడు .తరువాత వరుసగా భవభూతి అండ్ హిజ్ డ్రామా ,లంకావతారసూత్ర ,,కాత్యాయన్స్ పాళీ గ్రామర్ , టిబెటన్ ప్రీమియర్ రెండుభాగాలు ,రత్న నౌట్ట ,,నోట్స్ ఆన్ రత్నావళి గ్రిమ్స్ ఫోనెటిక్ లా ఆఫ్ ఇండో-యూరోపియన్ లాంగ్వేజెస్ ,బుద్ధ స్తోత్ర సంగ్రహ ,స్రగ్ధర స్తోత్ర ఆఫ్ సర్వజ్ఞ మిత్ర ,హిస్టరీ ఆఫ్ మిడీవల్ స్కూల్ ,ఆఫ్ లాజిక్ ,అమరకోశ సాంస్క్రిట్ విత్ టిబెటన్ వెర్షన్ రెండుభాగాలు ,అమరాఠికా కామధేను ,అవధాన కల్పలత ,న్యాయ సూత్ర ఆఫ్ గౌతమ , బై లింగ్యువల్ ఇండెక్స్ ఆఫ్ న్యాయ బిందు ,హిస్టరీ ఆఫ్ ఇండియన్ లాజిక్ మొదలైన ఉద్గ్రంధ రచయిత సతీష్ చంద్ర .-25-4-1920 న యాభై ఏళ్లకే మహామహోపాధ్యాయ సతీష్ చంద్ర విద్యాభూషణ్ పరమపదించాడు ..
96-తాంత్రిక బౌద్ధ గ్రంథ రచయిత-సర్వజ్ఞ మిత్ర (8 వ శతాబ్దం )
స్రగ్ధర సూత్రం రాసిన సర్వజ్ఞ మిత్ర కాశ్మీర్ వాడు .ఇదిటిబెటన్ తాంత్రిక దేవత తార అనబడే శ్రోలమ పై చెప్పిన 37 మంత్రాల సముదాయం .దీనికి జైన రక్షితుడు స్రగ్ధరా స్తోత్ర టీకా అనే వ్యాఖ్యానం రాశాడు .ఆనాటి ప్రభువుకు సహాయకారిగా ఉన్న విక్రమశిల బౌద్ధారామం లో భిక్షువు .రక్షితుడు రాసిన వ్యాఖ్యానాన్ని బట్టి సర్వజ్ఞ మిత్ర కాశ్మీర్ కు చెందిన మహా కవి దాత .తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేసి దేశ సంచారం చేస్తూ వజ్రముకుటు ని రాజ్యం లో ప్రవేశించాడు .దారిలో అతిపేదబ్రాహ్మణుడు కూతురి పెళ్ళికి డబ్బు లేక బాధ పడటం చూశాడు .ఆ బ్రాహ్మణుడు మ హా దాత అయినాసర్వజ్ఞ మిత్ర ను దర్శించి తన గోడు చెప్పుకొందామనుకొని ఆయనే సర్వస్వము దానం చేసి భిక్షాపాత్ర, పైన ఉత్తరీయం తో తిరుగుతున్నాడని తెలిసి హతాశుడయ్యాడు .దయాళువైన సర్వజ్ఞుడు ఓదార్చి తాను తప్పక సాయం చేస్తానని మాట ఇచ్చాడు .అదే సమయం లో రాజు వజ్రముకుతటుడికి ఒకడు ఆయన కోరికలన్నీ తీరాలి అంటే అప్పటికప్పుడు వంద శరీరాలనుండి వేరు చేయబడిన కపాలాలపై కూర్చుని స్నానం చేస్తే తీరుతాయి అని సలహా ఇచ్చాడు .అప్పటికే 99 సంపాదించిన రాజు సర్వజ్ఞమిత్రనుఅతని బరువుతో సమానమైన బంగారంతో తూకం వేసి కొని కొని వందా పూర్తి చేశాడు .ఆ బంగారాన్ని అంతటిని సర్వజ్ఞుడు ఆ పేద బ్రాహణుడికి దానం చేసేశాడు
సేకరించిన వందమందిని సర్వ్జ్ఞమిత్ర తో సహా వధ్యస్థలానికి రాజభటులు తీసుకు వెళ్లారు .తప్పించుకొనే దారి తోచక సర్వజ్ఞుడు 37 స్రగ్ధరా శ్లోకాలు ఆర్య తారా దేవిపై ఆశువుగా చెప్పాడు .అకస్మాత్తుగా వందమంది మృత్యువు నుంచి తప్పించుకొని స్వగృహాలకు చేరారు .సర్వజ్ఞుని మహా భక్తికి ఆశ్చర్యపోయిన రాజు క్షమాపణ వేడి శిష్యుడైపోయాడు .ఇలాంటిదే మరొకధ సర్వజ్ఞమిత్రాపై టిబెటన్ భాషలో ప్రచారం లో ఉంది .దీనిప్రకారం సర్వజ్ఞుడు కాశ్మీర్ లో పుట్టినా నలంద విశ్వ విద్యాలయ విద్యార్థి ..అక్కడ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు .స్రగ్ధరా స్తోత్ర టీకలో సంస్కృతంలో రాజుపేరు వజ్ర ముకుటుడు పేరుకు బదులు ‘’శరన ‘అని టిబెటన్ భాషలో ‘’పాగ్ సాం సాన్ జంగ్ ‘’’అంటారని ఉన్నది .సర్వజ్ఞ మిత్ర కాలం ఎనిమిదవ శతాబ్ది పూర్వార్ధంగా నిర్ణయించారు
.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

