గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 \
97- యక్ష ప్రశ్న నాటక రచయిత -జగ్గు సింగరార్య(1891-
జగ్గు తిరునారాయణ అయ్యంగార్ వెంగడాంబ కు 20-11-1891 న కర్ణాటకలోని మేల్కొటే లో జగ్గు సింగరార్య జన్మించాడు . .మైసూర్ మహారాజా సంస్కృతకాలేజి మేల్కొటే సంస్కృత కాలేజీలలో చదివాడు .సంస్కృతం లో అమోఘ పాండిత్యం సాధించి యదునాధ చంపు కృష్ణ కథారహస్య కావ్యం ,దాశరధి దర్శన కావ్యం ,,వెంకటే శ పాదా వలంబన స్తోత్రం ,కావ్యకల్పకం యక్షప్రశ్న నాటకం,శిబి వైభవం శౌరి శౌర్యం నాటకాలు ,ధర్మవ్యాధి దర్శనం ఏకాంకిక ,అతిమానుష స్తవం ,కావ్యకల్పకం మొదలైన , చాలగ్రంధాలు రచించాడు . కన్నడం లో నిధి సర్వావలి బాలినాభాగ్య ,వైరముడి వైభవం ,రాశాడు . మైసూర్ మహారాజా నలువది కృష్ణ రాజా వడియార్ ,శృంగేరి పీఠాధిపతి శ్రీ చంద్ర శేఖర స్వామి ,ఉడిపి పెజావర్ స్వామి మున్నగు వారి చేత సత్కరింపబడ్డాడు .కర్ణాటక రాష్ట్ర పురస్కారం తో బాటు అనేక సాహిత్య సంస్థల నుండి సన్మానాలు పొందాడు .అభినవ భవభూతి ,నూతన కాళిదాస ,కులభూషణ బిరుదులూ అందుకున్నాడు .
ఆయన రాసిన యదు శైల చంపు తన ష్వగ్రామం మేల్కొటే పై ఆరు అధ్యాయాలలో సత్పురపంచ పేరిట రాస్శాడు .కృష్ణకదా రహస్యాన్ని కన్నడ తెలుగులలో ముద్రించాడు .ఇది ఎస్ ఎస్ ఎల్ సి కి పాఠ్య గ్రంధంగా ఉన్నది .మూడు ప్రపంచాలతో దాశరధి దర్శనం రాశాడు .మొదటి అధ్యాయానికి పాదుకా పట్టాభి షేక ,రెండవ ప్రపంచకానికి చిత్ర కూటోదంతా ,మూడవడానికి రామ పట్టాభి షేకం అని పేర్లు పెట్టాడు .మహాభారత ధర్మవ్యధ ఉపాఖ్యానాన్ని ధర్మవ్యధ దర్శన నాటకం గా రచించాడు .మొహాన్ని శ్లేషలో వర్ణించాడు -’’పత్నీ మోహ పుత్రమోహార్హమోహః -పృధివీ మోహో దేహగే హాది మోహః -ఏవం మోహైర్నాపి నాపై సౌఖ్యం నాశాంతిహ్ -జ్ఞాని తస్మాన్ నైవ ముహ్యత్త్విహ యేసు ‘’.వీరి శిబి వైభవాన్ని సాహిత్య అకాడెమి ముద్రించింది .శౌరి శౌర్యం భాగవత కృష్ణకధ .
98-34 వ శృంగేరి పీఠాధిపతి -శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతి స్వామి (1892- 1954)
16-10-1892 న గోపాల శాస్త్రి లక్ష్మమ్మ దంపతులకు నరసింహ గా శ్రీ చంద్ర శేఖర భారతీ తీర్ధ స్వామి జన్మించారు .6–4-19 12 న 20 వ ఏటా శృంగేరిశారదా పీఠ 34 వ పీఠాధిపతిగా అభిషిక్తులయ్యారు . అనుక్షణం ఆత్మ దర్శనం పొందుతూ సమాధి స్థితిలో ఉండేవారు .ఛందస్సు పై అపూర్వ అధికారం ఉండటం వలన అలవోకగా ఎన్నో శ్లోకాలు చెప్పేవారు వాటిని భక్తులకు అందుబాటులోకి తేవటానికి ముద్రించారు .వాటిలో పాదా వలంబన స్తుతి ,నవరత్నమాల ,తోటకాస్టో త్తరం ,శ్రీమదాచార్యే 0ద్ర స్తవం ,ఆచార్య పాదా వలంబన స్తుతి ,దత్త నవరత్న మాలిక .దక్షిణామూర్తి మంత్రమార్క స్తవం ,సన్ముక్త భుజంగ స్తుతి మొదలైనవి .శంకరాచార్యుల వివేకా చూడామణికి వ్యాఖ్యానం ,భగవద్గీతకు శంకరభాష్యం పై వ్యాఖ్యానం మొదలైన శాస్త్ర గ్రంథ రచన చేశారు .
పాదా వలంబన స్తుతి లో -’’స్థితే నూపురమకరాండ పూర్ణే -జగద్గురోహ్ పాద సహస్ర పాత్రే – కిమన్యతో ధా వసి చిత్త భృంగ -ప్రయాహి తత్రైవ రామస్వ నిత్యం .’’భావం -ఓ మనస్సనే తుమ్మెదా !అనుగ్రహ గురు పాదపద్మ0 ఉండగా అటూ ఇటూ దేనికోసమో వెతుకుతావేమిటి .ఆపాదపద్మాలపైనే వ్రాలి చిరకాలం ఉండిపో
నవరత్నమాల -’’కామాది శృంగి పరిచ్చేదన వజ్ర పాణే -నామావధూత నిఖిలా ఘ చయో మనశ్వీ-సామాది గీర్శు పరిగీత నిజ స్వరూపః -దృగ్గోచరో భవతు దేశికరాన్ మమాసు ‘’ –భావం -గురు దేశికులు తక్షణం ప్రత్యక్షం కావాలి .ఇంద్రుడు పిడుగును సంహరించినట్లు నా ఆరుగురు లోపలి శత్రువులను దునుమాడి ,ఉపనిషత్ సా ర సంగ్రహమైన గురుదేవుడు ప్రత్యక్షం కావాలి .
స్వామిజీ జీవితకాలం లో అనేక అద్భుతాలు ప్రదర్శించారు .కళ్ళు లేనివారికి నేత్ర జ్ఞానం బాధితులకు వినికిడి వారి స్పర్శవలన లభించేవికనుక వారిని ‘’స్పర్శామాత్ర గురుదేవులు ‘’అని అందరూ చెప్పుకునేవారు .వీరు పీఠాధిపతులుగా ఉన్నకాలం లో శృంగేరి శారదా పీఠం పరమ వైభవాన్ని సాధించింది .ఎంద రెంద రో తత్వ వేత్తలు శాస్త్ర వేత్తలు విద్యాధికులు పండితులు రాజకీయ ప్రముఖులు స్వామీజీ సందర్శనం చేసి ఉపశమనం పొందేవారు .అలాంటివారిలో డా రాజేంద్ర ప్రసాద్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ,కృష్ణరాజ ఒడియార్ వంటి ప్రముఖులున్నారు 26-.-9-19 54 న స్వామీజీ మహా సమాధి చెందారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-4-17-కాంప్-షార్లెట్ -అమెరికా

