గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
99–చతుర్భాషా పండితుడు విద్యావిశారద-గోటూర్ వేంకటాచల శర్మ (1894)
తమిళనాడు డంకిని కోటలో జన్మించిన గోటూర్ వేంకటాచల శర్మ చామరాజేంద్ర సంస్కృత కాలేజీ నుండి సాహిత్య విద్వాన్ పొందాడు .పండిత రత్న ,విద్యా విశారద ,సరస కవి రత్న బిరుదులు అందుకున్నాడు .సంస్కృతం తెలుగు ఇంగిలీషు కన్నడ భాషలో రచనలు చేశాడు .సంస్కృతం లో గణేశ గీతమాలాస్తోత్రం ,శ్రీ చౌడేశ్వరీ గీతాకాదంబకం ,స్తోత్రమాల భగవాన్ గీత మాలికవంటి వి రాశాడు .సుబ్రహ్మణ్య శాస్త్రి ఆఫ్ ఆనెకాల్ జీవిత చరిత్ర ఇంగిలీషు లో రచించాడు .మోహ ముద్గరం కు కన్నడ వ్యాఖ్యానం ,తెలుగులో ఆటవెలది గీతమాల రాశాడు .
100-కాశ్మీర సమస్యపై నాటకం రాసిన -నిరాపజే భీమదత్త -(1903)
కర్ణాటకలో దక్షిణకన్నర జిల్లా కాన్యన్ గ్రామం లో 1903 లో భీమదత్త నిరాపేజీ జన్మించాడు .తండ్రి శంకర భట్ .కాశ్మీర సంధాన సముద్యమ ,హైదరాబాదా విజయ అనే రెండునాటకాలు సంస్కృతం లో రాశాడు .మొదటిది విద్యార్థి దశలోనే రాసిననాటకం .చారిత్రాత్మక రాజకీయనాటకం .7 ఆంకాలలో కాశ్మీర సమసిపై రాశాడు .సమకాలీన రాజకీయాన్ని ప్రతిబింబించిననాటకం స్త్రీ పాత్రలేని నాటకం కూడా .రెండవదైన హైదరాబాద విజయం నాటకం లో భారత స్వాతంత్ర అనంతర పరిస్థితులు హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్ లో చేరటంమొదలైన పది దృశ్యాలున్న కదాఉన్న నాటకం .ఈ రెండు నాటకాలలో నిరాపజే భారత దేశ సమగ్రతను గట్టిగా సమర్ధించి దేశభక్తిని చాటాడు
101-హి ట్ఠనహళ్లి గోవింద భట్ట (1905).
హిట్టనహళ్లి గోవిందభట్ట 1905 లో కర్ణాటక లో దక్షిణ కెనరా జిల్లా మారుమూల గ్రామం లో జన్మించాడు .తండ్రి నీలకంఠ భట్ తల్లి భాగీరధి .హోసమానే రామచంద్ర శాస్త్రి గణేశా శాస్త్రీలవద్య కూలంకషంగా శాస్త్రాధ్యయనం చేశాడు .శ్రీ సర్వజ్ఞేన్ద్ర చంపు ను శ్రీ బ్రహ్మానంద గణేశా యోగేశ్వరాణాం జీవన చరితం అనే చారిత్రాత్మక రచన చేశాడు
శ్రీ సర్వజ్ఞేన్ద్ర చంపు అనంత భట్టు చంపూ భారతాన్ని అనుకరించి రాసింది .ఇది చారిత్రిక చంపు .స్వర్ణవాలి మఠ చరిత్ర ఉన్నది .వేదాంతానికి దీన్ని అంకితమిచ్చాడు -ఇలామొదలౌతుంది –
‘’కవితా సవితానాహం కిమపి లేహ్యం లిఖేచ్చమే హస్తా -తదపిచ విబుధైర్ దయయా పరుగుణ పరమాణుతుస్థిర అభిగ్రాహ్యం
మరో మనోజ్ఞ చంపు –
‘’తహా యతీన్ద్రో వ్యవహార దుర్యహ్-తహా తపస్యయా వాపి దుర్య దుర్యహ్ -యధా మృగేన్ద్రో మృగరాజా రాజా హ్ -తదా యతీన్ద్రో నటరాజ ఆసీత్ ‘’
శ్రీయ బ్రహ్మానంద గణేశయోగేశ్వరాణాం జీవన చరితం లో 8కాండలు ఉన్నాయి .బ్రహ్మానంద యతీశ్వరులే కథానాయకులు
102-విఘ్నేశ్వర శర్మ (1909)
.తండ్రి వెంకట రమణ పండిట్ .గురువు సుబ్బన్న భట్ .ఇతని రచనలు -సంస్కృతం లో సృజన రచనలు ,కన్నడ రచనలు ,,పాటలు కలగూర అని విభజించారు .చనిపోయే నాటికి వెలుగు చూడలేదు .
సంస్కృతంలో రాసిన ఉషానిరుద్ధంనాటకం అచ్చుకాలేదు .రత్నాఙ్గులీయకం హాస్య రచన హస్త కౌస్తుభం ,ధర్మ విప్లవం ,కామినీ కౌరవమ్ .భార్గవి చారిత్రాత్మకనాటకం ప్రచురణకాలేదు .ఇందిరా వైభవం ఖండకావ్యం -ఇందిరాగాంధీ జీవిత చరిత్ర .ఇందిరాగాంధీ పై చాలాశ్లోకాలు గీతాలు రాశాడు .మూకాంబికాస్తుతి ,శివ గౌరీ స్తుతి ,వానీవందనం మొదలైనవి చాలారాశాడు .రేణుకాఖండకావ్యం రాశాడు విఘ్నేశ్వర శర్మకవిత్వం లో సంగీతం ప్రతిధ్వనించి చెవులకు పరమానందం కలిగిస్తుంది
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-17 కాంప్ -షార్లెట్ -అమెరికా .

